జియో సెలబ్రేషన్స్ ప్యాక్‌: 8జీబీ ఫ్రీ డేటా ఇస్తున్న జియో

రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా దూసుకువచ్చి దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే.

|

రెండేళ్ల క్రితం నిశ్శబ్దంగా దూసుకువచ్చి దేశీయ టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో కొత్త కొత్త ప్లాన్లతో ముందుకు దూసుకువెళుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రెండు సంవత్సరాల పయనంలో జియో ఉచిత ఆఫర్లతో అనేక సంచలనాలకు కేంద్రబిందువుగా మారింది. టెలికాం దిగ్గజాలను హడలెత్తిస్తూ ఆఫర్ల సునామికి తెరలేపింది. లాంచే చేసిన 170 రోజుల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను సొంతం చేసుకుంది. వినియోగదారులకు ఉచిత జీవిత కాల కాలింగ్ సదుపాయం కల్పించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు తాజాగా తన కస్టమర్లందరికీ సెలబ్రేషన్స్ ప్యాక్‌ను మరోసారి అందిస్తుంది. ఈ ప్యాక్ కింద 8జీబీ డేటాను ఉచితంగా అందిస్తుంది. ఈ నెల 30వ తేదీ వరకు ఈ ప్యాక్ జియో కస్టమర్లకు అందుబాటులో ఉంటుంది.

క్యాన్సర్ బారీన శాంసంగ్ ఉద్యోగులు, కంపెనీ స్పందన ఏంటంటే..క్యాన్సర్ బారీన శాంసంగ్ ఉద్యోగులు, కంపెనీ స్పందన ఏంటంటే..

రోజుకి 2జీబీ డేటా చొప్పున....

రోజుకి 2జీబీ డేటా చొప్పున....

రోజుకు 2జీబీ డేటా చొప్పున 4 రోజులకు కలిపి ఈ 8జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ ప్యాక్‌ను ఇప్పటికే జియో తన కస్టమర్లందరికీ యాక్టివేట్ చేసింది.

జియో అందిస్తున్న 8 జీబీ ఉచిత డేటా పొందారో లేదో తెలుసోకోవడం ఎలా?

జియో అందిస్తున్న 8 జీబీ ఉచిత డేటా పొందారో లేదో తెలుసోకోవడం ఎలా?

స్టెప్ 1:

రోజులో ఉపయోగించిన అదనపు డేటా అలాగే డేటాను తనిఖీ చేయడానికి, Google Play స్టోర్ నుండి MyJio యాప్ ను డౌన్ లోడ్ చేయండి

స్టెప్ 2:

స్టెప్ 2:

MyJio యాప్ ను ఓపెన్ చేసి మీ యొక్క జియో నెంబర్ తో లాగ్ ఇన్ అవ్వండి.ఈ సర్వీస్ ఆటోమేటిక్ గా నంబర్ను ధృవీకరిస్తుంది మరియు మీ టారిఫ్ ప్లాన్ యొక్క చెక్ వివరాలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది.

స్టెప్ 3:

స్టెప్ 3:

ఒకసారి ధృవీకరించబడిన, Jio యూజర్లు Menu ఐకాన్ పై క్లిక్ చేసి 'My Plans ' ఎంపిక చేయండి . ఈ Menu లోపల,మీరు జియో సెలబ్రేషన్ ప్యాక్ Add-on ఆఫరింగ్ మార్కింగ్ చూస్తారు.

రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలు...

రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలు...

సెప్టెంబర్‌ 5న రిలయన్స్‌ జియో తన రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్న నేపథ్యంలో ఈ రెండేళ్ల ప్రస్థానంలో జియో సాధించిన విజయాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

జియో ఎంట్రీ తర్వాత..

జియో ఎంట్రీ తర్వాత..

జియో ఎంట్రీ తర్వాత మొబైల్‌ డేటా వినియోగం ఇండియాలో నెలకు 20 కోట్ల జీబీ నుంచి 370 కోట్ల జీబీకి పెరిగింది. కేవలం జియో కస్టమర్లే 240 కోట్ల జీబీ డేటాను వినియోగిస్తున్నారంటే దాని ప్రభావం ఎంతో తెలుుకోవచ్చు.

 

 

లాంచ్‌ అయిన నెలల్లోనే..

లాంచ్‌ అయిన నెలల్లోనే..

జియో లాంచ్‌ అయిన నెలల్లోనే, ప్రపంచంలోనే నెంబర్‌ కంపెనీగా ఎదిగింది. కేవలం 170 రోజుల్లో 10 కోట్ల మంది కస్టమర్లను తన సొంతం చేసుకుంది. ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్‌ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

ప్రతి సెకనుకు ఏడుగురు..

ప్రతి సెకనుకు ఏడుగురు..

ప్రతి సెకనుకు ఏడుగురు కస్టమర్లను జియో తన ఖాతాలో వేసుకుంది. 2018 జూన్‌ 30 నాటికి 21.5 కోట్ల మందికి పైగా కస్టమర్లను చేరుకుంది.

4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో...

4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో...

భారత్‌లో ఎల్‌టీఈ కవరేజ్‌ ఎక్కువగా జియోకే ఉంది. 99 శాతం భారత జనాభాను త్వరలో జియోనే కవర్‌ చేయబోతుంది.4జీ నెట్‌వర్క్ కవరేజ్‌లో జియోనే ఆధిపత్య స్థానంలో ఉన్నట్టు ట్రాయ్‌ స్పీడ్‌టెస్ట్‌ పోర్టల్‌ వెల్లడించింది.

టారిఫ్‌ ప్లాన్లపై...

టారిఫ్‌ ప్లాన్లపై...

అన్ని టారిఫ్‌ ప్లాన్లపై జియో ఉచిత అపరిమిత కాలింగ్‌ను ఆఫర్‌ చేసింది. జియో రాక ముందు ఏ కంపెనీ కూడా అలా ఆఫర్‌ చేయలేదు. జియో తీసిన ఈ అపరిమిత సంచలనంతో, మిగతా అన్ని కంపెనీలు కూడా ఉచితాల బాట పట్టాయి. డేటాను ధరలను కూడా తగ్గించాయి.

ప్రస్తుతం 15 రూపాయలకు...

ప్రస్తుతం 15 రూపాయలకు...

జియో లాంచ్‌ తర్వాత, 250 రూపాయల నుంచి 10వేల రూపాయల మధ్యలో ఉన్న ఒక్క జీబీ డేటా ధర, ప్రస్తుతం 15 రూపాయలకు తగ్గింది. జియో లాంచింగ్‌ తర్వాత డేటా ధరలు భారీగా కుప్పకూలి, సామాన్యుడికి చేరువలో ఇంటర్నెట్‌ వచ్చేసింది.

జియో దెబ్బకు చాలా కంపెనీలు....

జియో దెబ్బకు చాలా కంపెనీలు....

జియో తీసుకొస్తున్న కొత్త కొత్త టారిఫ్‌ ప్లాన్లతో ఇతర టెల్కోల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆయా కంపెనీలు కూడా జియో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టిన వెంటనే, దానికి కౌంటర్‌గా టారిఫ్‌ ధరలను తగ్గిస్తూ పోతున్నాయి. జియో దెబ్బకు చాలా కంపెనీలు మూత పడటం, మరికొన్ని కంపెనీలు విలీనమవడం జరిగింది.

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు..

ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు..

జియో ఎంట్రీ అనంతరం, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు యూజర్‌ బేస్‌ పెరిగింది. అంటే పరోక్షంగా ఈ కంపెనీలకు కూడా జియో బాగా సహకరించింది. జియో కార్యకలాపాలు లాంచ్‌ అయినప్పటి నుంచి గూగుల్‌, ఫేస్‌బుక్‌లకు భారత్‌ మోస్ట్‌ యాక్టివ్‌ మార్కెట్‌గా మారింది.

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద...

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద...

ఎల్‌వైఎఫ్‌ బ్రాండ్‌ కింద వాయిస్‌ఓవర్‌ ఎల్‌టీఈ డివైజ్‌లను కూడా రిలయన్స్‌ రిటైల్‌ లాంచ్‌ చేసింది. జియో అరంగేట్రం తర్వాత ఈ డివైజ్‌ల సరుకు రవాణా పెరిగింది.

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ..

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ..

ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లోనూ జియో సంచలనానికి తెరలేపింది. జియోఫోన్‌ పేరుతో కొత్త ఫీచర్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టి, మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంది. ఇటీవలే ఫీచర్‌ ఫోన్‌లో హైఎండ్‌ మోడల్‌ జియోఫోన్‌ 2 ను కూడా ఆవిష్కరించింది.

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి..

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి..

బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోకి జియో అడుగుపెట్టింది. జియో గిగాఫైబర్‌ పేరుతో ఫైబర్‌ ఆధారిత వైర్‌లైన్‌ కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

 గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో...

గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో...

భారత్‌ను గ్లోబల్‌గా ఆధిపత్య స్థానంలో నిల్చోబెట్టడమే లక్ష్యంగా జియో ముందుకు సాగుతుందని ఆ కంపెనీ అధినేత ముఖేష్‌ అంబానీ పలుమార్లు తెలిపారు.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio Celebrations Offer for November: How to get free 8GB high-speed data with Jio.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X