జియో రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ డేటా ప్రయోజనాలలో భారీ మార్పులు!!
ఇండియాలోని టెలికాం రంగంలో సరికొత్త మార్పులకు మొదటగా శ్రీకారం మొదలుపెట్టిన రిలయన్స్ జియో ఇప్పుడు తన యొక్క పోటీదారులను వెనుకకు నెట్టి మొదటి స్థానంలో కొనసాగుతున్నది. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా టెల్కోల కంటే జియో అధిక మంది యూజర్ బేస్ ను కలిగి ఉంది. ఇటీవల జియో టెల్కో తన యొక్క టారిఫ్ ను పెంచిన తరువాత కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జియో కేవలం రూ.1 ధరకే కొత్త ప్లాన్ ను విడుదల చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నది. అయితే నిన్న విడుదల చేసిన సమయంలో ప్రకటించిన ప్రయోజనాలను మార్చింది. కేవలం ఒక రోజులో టెల్కో ప్లాన్ యొక్క ప్రయోజనాలను భారీగా మార్చింది. ఇది ఇప్పుడు చాలా తక్కువ డేటాను చాలా తక్కువ వ్యాలిడిటీతో అందిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో సంస్థ తన తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ ల విభాగంలో బుధవారం కొత్తగా రూ.1 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశబ్దంగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్లాన్ వినియోగదారులకు 30 రోజుల వాలిడిటీ కాలానికి 100MB డేటాను అందిస్తున్నట్లు కూడా ప్రకటించింది. కాబట్టి ప్రాథమికంగా ఈ వోచర్‌తో పదిసార్లు రీఛార్జ్ చేయడం వలన రూ.10 ఖర్చు అవుతుంది. అది వినియోగదారులకు 30 రోజుల పాటు 1GB (100MB x 10 = 1GB) డేటాను కూడా అందిస్తుంది అని భావించారు. అయితే ఒక రోజు తేడాలోనే డేటాను చాలా వరకు తగ్గించింది.

జియో రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలలో సరికొత్త మార్పులు
'వాల్యూ' విభాగంలో టెల్కో యొక్క మొబైల్ అప్లికేషన్ (MyJio)లో ఈ ప్లాన్ కనిపిస్తుంది. రూ.1 ప్లాన్ ఇప్పుడు 1 రోజు చెల్లుబాటుతో మాత్రమే వస్తుంది. కానీ ముందు తెలిపిన 100MB డేటాకు బదులుగా కేవలం 10MB డేటాను మాత్రమే అందిస్తున్నట్లు తెలిపింది. నిన్నటి ప్రయోజనాల పరంగా చూసుకుంటే కనుక అవసరమైన దానికంటే ఎక్కువ డేటాను కొనుగోలు చేయకూడదనుకునే తక్కువ-ఆదాయ తరగతి వ్యక్తులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్లాన్ తో లభించే 10MB డేటా ఉత్తమమైనది కాకపోవచ్చు.

జియో రూ.1 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలలో సరికొత్త మార్పులలో భాగంగా వినియోగదారులు 100MB డేటాను పొందడానికి సుమారు రూ.10 వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రూ.15 ధర వద్ద లభించే 4G డేటా వోచర్ తో 1GB హై-స్పీడ్ డేటాను పొందడం వలన ఇక్కడ చాలా అర్ధవంతంగా ఉంటుంది. అయితే మునుపటి ప్రయోజనాలను టెల్కో మార్చింది మరియు మార్పులు మొబైల్ అప్లికేషన్‌లో కనిపిస్తాయి. 10MB హై-స్పీడ్ డేటాను వినియోగించిన తర్వాత వినియోగదారుల యొక్క ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి పడిపోతుంది.

ఈ 10MB డేటా ప్లాన్ నుండి ఎవరు ప్రయోజనం పొందుతారనేది చెప్పనవసరం లేదు. ఈ ప్లాన్‌తో రిలయన్స్ జియో యొక్క వ్యూహం కొద్దిగా గందరగోళంగా ఉంది. నేటి స్మార్ట్‌ఫోన్‌ల నేపథ్యంలో అప్లికేషన్‌లు వినియోగించే మొత్తం డేటాతో 10MB డేటా కొన్ని సెకన్లలో లేదా కొన్ని నిమిషాల్లో తగ్గిపోతుంది. కానీ అలాంటి ప్లాన్‌ను అందించే టెల్కో మరొకటి లేదు. ఒక వినియోగదారు ఈ ప్లాన్‌ని ఐదు సార్లు (మొత్తం ఖర్చు - రూ 5) కొనుగోలు చేయవచ్చు. అలాంటి అవసరం ఉన్నట్లయితే దాదాపు 50MB డేటాను పొందవచ్చు. అయితే 1GB డేటాను అందించే రూ. 15 వోచర్‌ను ఎంచుకోవడం వలన ఎల్లప్పుడూ ఎక్కువ విలువను చూస్తారు.

జియో రూ.1559 దీర్ఘ-కాల వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్
జియో టెల్కో యొక్క వాల్యూ ప్లాన్ జాబితాలోని చివరి ప్లాన్ దీర్ఘ-కాల వ్యాలిడిటీతో లభిస్తుంది. ఈ ప్లాన్ సహేతుకమైన డేటాతో పాటు దీర్ఘకాలిక కాలింగ్ ప్లాన్‌లను కోరుకునే మరియు అవసరమయ్యే వినియోగదారులకు సరిపోతుంది. టెల్కో యొక్క ఈ దీర్ఘ-కాల ప్లాన్ రూ.1,559 ధర వద్ద లభిస్తుంది. దీనిని వినియోగదారులు 336 రోజుల చెల్లుబాటు కాలానికి పొందుతారు. వినియోగదారులు ఈ ప్లాన్‌తో అపరిమిత వాయిస్ కాలింగ్ మాత్రమే కాకుండా చెల్లుబాటు వ్యవధిలో మొత్తం 3600 SMSలను కూడా పొందుతారు. ఇంకా ఈ ప్లాన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు అధిక వేగంతో మొత్తం చెల్లుబాటు కాలానికి 24GB డేటాను అందించబడుతుంది. 24GB డేటా తర్వాత వినియోగదారులు 64 Kbps ఇంటర్నెట్ వేగం పొందుతారు. ఈ ప్లాన్‌లో వివిధ జియో యాప్‌ల యాడ్-ఆన్‌లు కూడా ఉన్నాయి. Jio ఇప్పుడు రూ. 15 నుండి డేటా యాడ్-ఆన్ వోచర్‌లను కూడా అందిస్తోంది. కాబట్టి హై-స్పీడ్ డేటా మొత్తాన్ని వినియోగించడం గురించి ఆందోళన చెందుతున్న వ్యక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు టెల్కో వెబ్‌సైట్ నుండి రిలయన్స్ జియో యొక్క మొత్తం డేటా యాడ్-ఆన్ వోచర్‌లను చూడవచ్చు.

జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ ఆఫర్ ప్లాన్‌లు
జియోమార్ట్ క్యాష్‌బ్యాక్‌ను అందించే జియో కొత్త ప్లాన్‌లలో మొదటిది రూ.299 ధర వద్ద లభిస్తుంది. ఇది 28 రోజుల వాలిడిటీ కాలంలో రోజువారీ 2 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. జాబితాలో తరువాతి ప్లాన్ రూ.666 ధర వద్ద లభిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలంలో 1.5GB రోజువారి డేటా, రోజుకు 100 SMSలు మరియు అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ సదుపాయాన్ని అందిస్తుంది. ఈ జాబితాలోని చివరి ప్లాన్ రూ.719 ధర వద్ద 84 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. ఇది 2GB రోజువారి డేటా, అపరిమిత కాలింగ్ మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్‌లు అన్ని కూడా తమ యొక్క రీఛార్జ్ లో 20 శాతం JioMart క్యాష్‌బ్యాక్ మరియు JioTV, JioCinema, JioSecurity మరియు JioCloud వంటి యాప్‌లతో Jio సూట్‌కు సభ్యత్వాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








