52 కోట్ల కాల్స్‌ ఫెయిల్ అయ్యాయి, జియో సంచలన ఆరోపణ

జియో నెట్‌వర్క్ నుంచి వచ్చే వాయిస్ కాల్స్‌కు ఇంటర్ కనెక్టింగ్ పాయింట్లు కల్పించేంత నెట్‌వర్క్ సామర్థ్యం, ఆర్థిక వనరులు తమకు లేవని ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌లు వాదిస్తోన్న నేపథ్యంలో రిలయన్స్ జియో స్పందించింది.

52 కోట్ల కాల్స్‌ ఫెయిల్ అయ్యాయి, జియో సంచలన ఆరోపణ

"పోటీ వ్యతిరేక ప్రవర్తన"తో కావాలనే ఇతర టెల్కోలు తమ కాల్స్‌కు కనెక్షన్ పాయింట్లు ఇవ్వకపోవటం వల్ల దాదాపు 52 కోట్ల కాల్ ఫెయ్యిలర్స్‌ను చెవి చూడాల్సి వచ్చిందని జియో ఒక ప్రకటనలో ఆరోపించింది.

Read More : ఫోన్‌లు ఈ మధ్యన బాగా పేలిపోతున్నాయ్, మరి మీ ఫోన్ సేఫ్ జోన్‌లో ఉందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

రిలయన్స్ జియో ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్లతో తమ ట్రాఫిక్ దెబ్బతినేలా కాల్స్ వస్తున్నాయని, దీనివల్ల తమకు నష్టాలు తప్పవని ఎయిర్‌టెల్ గతకొద్ది కాలంగా వాదిస్తూనే ఉంది.

#2

ఎయిర్‌టెల్‌కు జవాబుగా రిలయన్స్ స్పందిస్తూ, తమ జియో నెట్‌వర్క్ నుంచి వెళ్లే ఔట్ గోయింగ్ ట్రాఫిక్.. ఒక్కో కస్టమర్ నుంచి గంటకు రెండు కాల్స్ మాత్రమేనని, అది కూడా పీక్ ట్రాఫిక్ సమయంలోనేనని, వీటికి భారీగా కనెక్టింగ్ పాయింట్స్ అక్కర్లేదని తెలిపింది.

#3

అదీ కాకుండా, తమ నుంచి వెళుతోన్న ఔట్ గోయింగ్ కాల్స్ ఒక్క ఎయిర్‌టెల్‌కు మాత్రమే వెళ్లడం లేదని, అన్ని టెల్కోలు పంచుకుంటాన్నాయని రిలయన్స్ జియో స్పష్టం చేసింది.

#4

గతకొద్ది వారాలుగా జియో నుంచి వెళ్లిన ప్రతి 100 అవుట్ గోయింగ్ కాల్స్‌లో 75 కాల్స్ కనెక్ట్ కావడంలో విఫలమయ్యాయిని రిలయన్స్ ఆరోపించింది.

#5

గత 10 రోజుల వ్యవధిలో ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌కు వెళ్లిన 22 కోట్ల కాల్స్‌, మొత్తం మీద వోడాఫోన్, ఐడియా సెల్యులార్‌లతో కలుపుకని 52 కోట్ల జియో కాల్స్ కనెక్ట్ కావటంలో విఫలమయ్యాయిని రిలయన్స్ తెలిపింది.

#6

అయితే, తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో రిలయన్స్ జియోకి అదనపు ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల ఏర్పాటు చేసేందుకు భారతి ఎయిర్‌టెల్ అంగీకరించింది.

#7

తాము ఏర్పాటుచేసే పోర్ట్‌లు జియో కస్టమర్ల కాల్స్‌ని సపోర్ట్ చేస్తాయని ఎయిర్‌టెల్ వెల్లడించింది.

#8

ఎయిర్‌టెల్ బాటలోనే ఐడియా కూడా జియో కాల్స్‌కు కనెక్టింగ్ పాయింట్స్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

#9

ఉచిత ఆఫర్లతో పాటు రూ.50కే 1జీబి 4జీ డేటా అంటూ ముందుకొచ్చిన జియోకు అడుగడుగునా అవాంతరాలే ఎదురవుతున్నాయి.  

#10

ముఖ్యంగా జియో సిమ్ కార్డ్స్ యాక్టివేషన్ ప్రక్రియ విషయంలో మరింత జాప్యం జరుగుతోంది. దీంతో సిమ్ తీసుకుని రోజుల తరబడి వినియోగదారులు ఎదురుచూాల్సిన పరిస్థితి నెలకుంది. ఈ-కేవైసీ విధానంగా భాగంగా యాక్టివేషన్ ప్రక్రియను మరింత వేగవంతంగా చేస్తామని అంబానీ ప్ర‌క‌టించినా అది క్షేత్రస్థాయిలో ఆచణలోకి రాలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio claims over 52 crore call failures from Airtel, Vodafone, Idea. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot