నాన్ స్టాప్‌గా 5 గంటలు, మిస్టరీగా మారిన జియో వాయిస్ కాల్స్ !

Written By:

రిలయన్స్ జియోలో ఏ ప్యాక్‌ను రీచార్జి చేసుకున్నా యూజర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయని తెలిసిందే. దీని వల్ల ఎన్ని కాల్స్ అయినా చేసుకోవచ్చు.అయితే ఇంత వరకు బాగానే ఉంది, కానీ ఒకసారి ఎవరికైనా (జియో లేదా నాన్ జియో కస్టమర్‌కు) కాల్ చేశాక ఎంత సేపు మాట్లాడుకోవచ్చు ఈ ప్రశ్న అడిగిన యూజర్‌కు జియో దిమ్మతిరిగే సమాధానం ఇచ్చింది.

జియో రూ. 149 ప్లాన్‌లో భారీ మార్పులు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

5 గంటల వరకు

రోజులో ఎవరైనా జియో యూజర్ అవతల ఉన్న జియో లేదా నాన్ జియో కస్టమర్‌కు కాల్ చేస్తే 5 గంటల వరకు ఒకే కాల్‌లో నాన్‌స్టాప్‌గా మాట్లాడుకోవచ్చు.అనంతరం ఆ రోజుకు కోటా పూర్తవుతుంది. ఇక మళ్లీ కాల్ చేయాలంటే మరుసటి రోజు వరకు ఆగాలి.

నాన్‌స్టాప్‌గా కాకుండా

అయితే ఒకేసారి 5 గంటల పాటు నాన్‌స్టాప్‌గా కాకుండా అంతకు తక్కువగా ఎంత సమయం పాటు అయినా యూజర్లు మాట్లాడుకోవచ్చు.

ఒక యూజర్‌తో గంట, ఇంకో యూజర్‌తో రెండు గంటలు..

ఉదాహరణకు కాల్ చేస్తే ఒక యూజర్‌తో గంట, ఇంకో యూజర్‌తో రెండు గంటలు, మరో యూజర్‌తో అరగంట ఇలా కాల్స్ చేసుకుంటే గనక 5 గంటల లిమిట్ వర్తించదు.

జియో కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా..

కేవలం నాన్‌స్టాప్‌గా 5 గంటలు మాట్లాడితేనే ఆ లిమిట్ వర్తిస్తుంది. ఓ వినియోగదారుడు తాజాగా జియో కస్టమర్ కేర్‌కు కాల్ చేయడం ద్వారా అడిగి తెలుసుకున్న సమాచారం ఇది..!

300 నిమిషాల కాల్స్‌ను మాత్రమే

ఇదిలా ఉంటే వాయిస్‌ఓవర్‌ను వాడుకుంటూ తమ నెట్‌వర్క్‌పై కేవలం రోజుకు 300 నిమిషాల కాల్స్‌ను మాత్రమే వాడుకునేలా జియో నిబంధన పెట్టబోతున్నట్టు రిపోర్టులు తెలిపాయి.

కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంలో..

అపరిమిత కాల్స్‌ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారనే నేపథ్యంలో ఈ కాల్స్‌ను పరిమితం చేస్తున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. టెలికాంటాక్‌కు జియో ప్రియారిటీ టీమ్‌ ఈ విషయాన్ని నిర్థారించిందట.

 

కొందరు యూజర్లు రోజుకు 10 గంటలకు పైగా ..

కొందరు యూజర్లకు రోజుకు 300 నిమిషాల వాయిస్‌ కాల్స్‌ను మాత్రమే జియో పరిమితం చేస్తుందని, జియో అపరిమిత కాల్స్‌ ఫీచర్‌తో కొందరు యూజర్లు రోజుకు 10 గంటలకు పైగా వాడుకుంటూ.. ఆ ఫీచర్‌ను దుర్వినియోగం చేస్తుండటమే దీనికి ప్రధాన కారణంగా రిపోర్టు వెల్లడించింది.

కస్టమర్లకు అందాల్సిన సేవలు

కస్టమర్లకు అందాల్సిన సేవలు పక్కదారి పడుతున్నాయని జియో గుర్తించినట్టు రిపోర్టు చేసింది. ఇలా పరిమితం చేస్తున్న వాయిస్‌ కాల్స్‌ను రోజూ పాటించాలని చూస్తుందని పేర్కొంది.

పరిమితి కొందరు యూజర్లకే..

అయితే ప్రస్తుతం వాయిస్‌ కాల్స్‌పై పెడుతున్న పరిమితి కొందరు యూజర్లకేనని తెలిసింది. అది కూడా జియో నెట్‌వర్క్‌ను దుర్వినియోగం చేసేవారికేనట. అయితే ఎవరు ఈ కేటగిరీ కిందకి వస్తున్నారో ఇంకా స్పష్టం కాలేదు.

గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే..

రోజుకు 10 గంటల కంటే ఎక్కువ వాయిస్‌ కాల్స్‌ను వాడే వారు ఈ కేటగిరీ కిందకి వస్తారంటూ రిపోర్టులు చెబుతున్నాయి. ఈ కాల్స్‌పై గరిష్ట పరిమితి ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.

 

అధికారికంగా ప్రకటన చేయని జియో

ప్రస్తుతానికి దీనిపై అధికారికంగా ప్రకటన చేయని జియో, త్వరలోనే విధివిధానాలు వెల్లడించనుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio clarifies its limits on 'unlimited' calling facility more News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot