జియో కాయిన్ పేరుతో వెబ్‌సైట్, వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి !

Written By:

టెలికాం రంగంలో దూసుకుపోతూ దిగ్గజాలకు షాకిస్తూ వస్తున్న రిలయన్స్ జియో క్రిప్టో కరెన్సీ పేరుతో మరో సంచలనానికి తెరతీయబోతున్నారన్న విషయం సోషల్ మీడియాలో పుకారు అయి కూర్చున్న సంగతి తెలిసిందే. బిలీనియర్ ముఖేష్‌ అంబానీ, రిలయన్స్‌ జియోకాయిన్‌ పేరుతో సొంతంగా ఈ క్రిప్టోకరెన్సీని సృష్టిస్తున్నట్టు రిపోర్టులు అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలపై జియో నుంచి ఎటువంటి ప్రకటనా రాకపోవడంతో ఈ వార్తల నిజమా కాదా అనే విషయం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.

బిట్ కాయిన్‌కు పోటీగా జియో కాయిన్, అంబాని టార్గెట్ ..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో కాయిన్ పేరుతో ఓ కొత్త సైట్ ..

ఈ వార్తలు ఇలా ఉంటే ఇప్పుడు జియో కాయిన్ పేరుతో ఓ కొత్త సైట్ దూసుకొచ్చింది. జియోకు మార్కెట్‌లో ఉన్న క్రేజ్‌ను బట్టి, జియో కాయిన్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ ఒకటి తెరపైకి వచ్చింది.

రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ అనే యూఆర్‌ఎల్‌..

రిలయన్స్‌-జియోకాయిన్‌.కామ్‌ అనే యూఆర్‌ఎల్‌తో ఈ వెబ్‌సైట్‌ లిస్ట్‌ అయింది. అచ్చం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మాదిరిగేనే ఈ వెబ్‌సైట్‌ దర్శనమిస్తోంది. ఐకాన్‌ కూడా జియో పేరెంట్‌ కంపెనీదే ఉండటం గమనార్హం.

జియో కాయిన్‌ను వంద రూపాయలకు..

దీనిలో ఒక్కో జియో కాయిన్‌ను వంద రూపాయలకు లాంచ్‌ చేయనున్నట్టు పేర్కొంది. పూర్తి పేరు, ఈ-మెయిల్‌ అడ్రస్‌తో రిజిస్టర్‌ అవ్వాలంటూ ఈ నకిలీ వెబ్‌సైట్‌ యూజర్లను తప్పుదోవ పట్టిస్తోంది.

వెబ్‌సైట్‌తో అప్రమత్తం..

దీనిలో ఏదన్నా సమాచారం రాయడానికి కనీసం వెబ్‌సైటే ఓపెన్‌ అవడం లేదని తెలుస్తోంది. దీంతో ఇది నకిలీ వెబ్‌సైట్‌గా వెల్లడవుతోంది. ప్రజలు ఈ వెబ్‌సైట్‌తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే రిలయన్స్ జియో నుంచి ఇంకా ఎటువంటి స్పందనా రాలేదు. 

క్రిప్టోకరెన్సీలకు ఎక్కువగా డిమాండ్‌ పెరుగుతుండంతో..

మింట్‌ రిపోర్టు ప్రకారం ఇటీవల కాలంలో క్రిప్టోకరెన్సీలకు ఎక్కువగా డిమాండ్‌ పెరుగుతుండంతో, రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కూడా సొంతంగా జియో కాయిన్‌ పేరుతో క్రిప్టోకరెన్సీకి సృష్టిస్తుందని తెలిసింది. 

అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్‌ ..

అంబానీ పెద్ద కొడుకు ఆకాశ్‌ సారథ్యంలో మొత్తం 50 మంది టీమ్‌ ఈ బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీపై పనిచేస్తున్నారని రిపోర్టు పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Coin: Beware of this fake website More News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot