జియో ధన్ దనా ధన్.. కొత్త ఆఫర్లు కేక?

ట్రాయ్ ఆదేశాల మేరకు సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేయునున్న జియో, వాటిని తలదన్నే రీతిలో కొత్త ప్లాన్‌లను మార్కెటోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం.

Read More : 5000 mAh బ్యాటరీతో మోటో ఇ4 ప్లస్, రూ.10,000లోపే?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఓ ఆసక్తికర న్యూస్...

జియో లాంచ్ చేయబోయే కొత్త ప్లాన్‌లకు సంబంధించి ఇప్పటి వరకు ఏవిధమైన అఫీషియనల్ న్యూస్ అందుబాటులో లేనప్పటికి ఓ ఆసక్తికర న్యూస్ వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ ప్రకారం..

ధన్ దనా ధన్ పేరుతో జియో కొత్త్ ఆఫర్‌ను అనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ క్రింద రెండు ప్లాన్‌లను జియో అందుబాటులో ఉంచనుందట.

మొదటి ప్లాన్‌ ఖరీదు రూ.309

మొదటి ప్లాన్‌లో భాగంగా నెలకు 28 రోజులు చొప్పున మూడు నెలల పాటు రోజుకు 1జీబి డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయట. జియో ప్రైమ్ యూజర్లకు ఈ ప్లాన్‌ రూ.309కే అందుబాటులో ఉంటుందట. నాన్ జియో ప్రైమ్ యూజర్లు మాత్రం రూ.349 వెచ్చించి ఈ ప్లాన్‌ను తీసుకోవల్సి ఉంటుందట.

రెండవ ప్లాన్ ఖరీదు రూ.509..?

మరొక ప్లాన్‌లో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ.509 చెల్లించటం ద్వారా మూడు నెలల పాటు రోజుకు 2జీబి డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయట. నాన్ జియో ప్రైమ్ యూజర్లు ఈ ప్లాన్‌ను సొంతం చేసుకోవాలంటే రూ.549 చెల్లించాల్సి ఉంటుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to Come Up With Dhan Dhana Dhan Offer..? Read MOre in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot