జియో ప్రైమ్ హిట్టా, ఫట్టా? తెరపైకి కొత్త ఆఫర్లు!

గత 6 నెలల కాలంగా నిరాటంకంగా కొనసాగుతోన్న రిలయన్స్ జియో ఉచిత సేవలకు నేటి అర్ధరాత్రితో తెరపడబోతోంది. మార్చి 31, 2017 తరువాత కూడా జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తరహా వాతవరణాన్ని కొనసాగించేందుకు రిలయన్స్, ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ స్కీమ్‌ను తెరపైకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

Read More : Redmi Note 4 బుకింగ్స్ ప్రారంభం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ప్రైమ్ వర్క్‌అవుట్ కాలేదా..?

జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్ స్కీమ్ ఆశించిన స్థాయిలో వర్క్‌అవుట్ కాకపోవటంతో రిలయన్స్ పునరాలోచనలో పడినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జియో నెట్వర్క్ను వినియోగించుకుంటోన్న 10 కోట్ల పై చిలుకు యూజర్లలో కేవలం సగం మంది మాత్రమే జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను పొందినట్లు వార్తలొస్తున్నాయి.

తెెరపైకి సరికొత్త ఆఫర్లు..

ఈ నేపథ్యంలో నాన్ ప్రైమ్ యూజర్లను కూడా ఆకర్షించేందుకు సరికొత్త ఆఫర్‌లను జియో మరికొద్ది రోజుల్లో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 1, 2017 నుంచి జియో నెట్‌వర్క్‌ను కస్టమర్ ఉపయోగించుకునే తీరును బట్టి ఈ ప్లాన్స్ ఉండొచ్చని సమాచారం.

మరో రెండు మూడు రోజుల్లో..

బిజినెస్ ఇన్‌సైడర్ తెలిపిన వివరాల ప్రకారం జియో కొత్త టారిఫ్ ప్లాన్స్ మరో రెండు మూడు రోజుల్లో మార్కెట్లో అనౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఈ టారిఫ్ ప్లాన్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

నేటి అర్ధరాత్రి వరకే..?

జియో ప్రైమ్ మెంబర్ షిప్ ప్రోగ్రామ్‌ను మరోనెలపాటు పొడిగిస్తారని వార్తలు వచ్చినప్పటికి రిలయన్స్ వాటి పై అధికారికంగా స్పందించలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ నేటి అర్ధరాత్రితో ముగియబోతోంది. ఈ సమయంలోపు రూ.99 చెల్లించి సబ్‌స్ర్కిప్షన్ ను పొందినట్లయితే మార్చి 31, 2018 వరకు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ తరహా బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to Come Up With New Tariff Plans After March 31?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot