జియోఫోన్ యూజర్లకు అందుబాటులో 'జియోక్రికెట్ యాప్'!! ‌బహుమతులను పొందే గొప్ప అవకాశం...

|

ఇండియాలో అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రిలయన్స్ జియో తన కొత్త యొక్క జియో క్రికెట్ యాప్‌ను జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ఆవిష్కరించింది. ఈ కొత్త యాప్ జియోఫోన్ వినియోగదారులందరికీ "వన్ స్టాప్ క్రికెట్ డెస్టినేషన్" అని ఆపరేటర్ తెలిపింది. ఇది క్రికెట్‌లోని అన్ని రకాల విషయాలను ఒకే చోట చూపుతుంది. దీని ద్వారా జియోఫోన్ వినియోగదారులు లైవ్ స్కోర్‌లు, మ్యాచ్ అప్‌డేట్స్, క్రికెట్ న్యూస్ మరియు వీడియోలను అనేక ఉత్తేజకరమైన లక్షణాలతో యాక్సెస్ చేయగలదు అని తెలిపింది. ఈ కొత్త క్రికెట్ యాప్ 2020 సీజన్ లో నవంబర్ 3 వరకు జరిగే డ్రీమ్ 11 ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క అన్ని రకాల మ్యాచ్ లను ప్రసారం చేస్తుంది.

జియోఫోన్ లో కొత్తగా జియో క్రికెట్ యాప్‌
 

జియోఫోన్ లో కొత్తగా జియో క్రికెట్ యాప్‌

రిలయన్స్ జియో సంస్థ యొక్క కొత్త జియో క్రికెట్ యాప్ హిందీ, బంగ్లా, మరాఠీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గుజరాతీ మరియు ఇంగ్లీష్ వంటి తొమ్మిది భారతీయ భాషల మద్దతుతో లభిస్తుంది. ఈ కొత్త యాప్ క్రికెట్‌ను ఇంగ్లీష్, హిందీతో సహా రెండు భాషల్లో ఆటతో పాటు జియో క్రికెట్ ప్లే ఉందని తెలిపింది. ప్లే-అలోంగ్ గేమ్ ప్రతి బంతిని ఆస్వాదించటానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ప్రత్యేకమైన క్విజ్ మరియు రోజువారీ బహుమతులు వంటివి మరికొన్ని ఇతర ఆసక్తికరమైన ఫీచర్లను కూడా వినియోగదారులకు లభిస్తుంది.

Also Read: Flipkart Dussehra Specials Sale: స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలు మీద Flipkart లో ఊహించని డిస్కౌంట్ ఆఫర్లు!!

జియో క్రికెట్ యాప్‌ రోజువారి బహుమతులు

జియో క్రికెట్ యాప్‌ రోజువారి బహుమతులు

రిలయన్స్ జియో యొక్క కొత్త జియో క్రికెట్ యాప్‌లో ప్రతిరోజూ 10,000 రూపాయల విలువైన రిలయన్స్ వోచర్‌లను కలెక్ట్ చేయడానికి అవార్డుతో "సాధారణ సవాళ్లను" పూర్తి చేసినందుకు వినియోగదారులు రోజువారీ బహుమతుల్లో పాల్గొనవచ్చని కంపెనీ తెలిపింది. అంతేకాకుండా వినియోగదారులు ఒక సంవత్సరం జియో రీఛార్జ్ మరియు "జియో క్రికెట్ ప్లాన్" ను కూడా గెలుచుకోగలరని కంపెనీ తెలిపింది.

జియో క్రికెట్ యాప్ యూజర్లు రూ.50 వేల వోచర్లు గెలుచుకోనే అవకాశం

జియో క్రికెట్ యాప్ యూజర్లు రూ.50 వేల వోచర్లు గెలుచుకోనే అవకాశం

జియో క్రికెట్ యాప్‌లో వారపు బహుమతుల్లో రూ.10,000 విలువైన రిలయన్స్ వోచర్‌లతో పాటు TVS స్పోర్ట్‌బైక్ ను కూడా గెలుచుకునే గొప్ప అవకాశం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇంకా జియో క్రికెట్ యాప్ యూజర్లు రిలయన్స్ వోచర్‌లలో రూ.50,000 విలువైన "బంపర్ ప్రైజ్" ని పొందడానికి కూడా అర్హులు అవుతారు అని ప్రత్యేకంగా తెలిపింది.

జియో క్రికెట్ యాప్ ఇంటర్‌ఫేస్‌ విధానం
 

జియో క్రికెట్ యాప్ ఇంటర్‌ఫేస్‌ విధానం

జియో క్రికెట్ యాప్ సరళమైన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను కలిగి ఉంది. దీనిని అర్థం చేసుకోవడం చాలా సులభంగా ఉంటుంది అలాగే అదే సమయంలో నావిగేట్ చేయడం కూడా సులభంగా ఉంటుంది అని కంపెనీ విడుదలలో తెలిపింది. సరికొత్త జియో క్రికెట్ యాప్‌తో అద్భుతమైన బహుమతులను ఉపయోగించటానికి మరియు గెలవడానికి క్రికెట్ నైపుణ్యాలను ప్రదర్శించే సరైన సమయం ఇది. కైయోస్ యాప్ స్టోర్‌లో జియో క్రికెట్ యాప్ అందుబాటులో ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Reliance Jio Company Introduced "JioCricket App" For JioPhone Users

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X