Reliance Jio మరో సంచలన నిర్ణయం!! 5వేల లోపు 5G స్మార్ట్‌ఫోన్‌

|

ఇండియాలో అతిపెద్ద వైర్‌లెస్ ఆపరేటర్ గా ఎదిగిన రిలయన్స్ జియో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ రంగంలో కూడా తన యొక్క సత్తాను చాటాలని చూస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పుడు 5G స్మార్ట్‌ఫోన్‌ను రూ.5000 కన్నా తక్కువ ధర వద్ద విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని నివేదికల ప్రకారం కంపెనీ నుండి రాబోయే 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ధర రూ.2,500 నుండి రూ.3000 మధ్య ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం భారతదేశంలో 2G కనెక్షన్‌ను ఉపయోగిస్తున్న 20 నుంచి 30 కోట్ల మందికి తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌లను అందించాలనే ప్రధాన లక్ష్యంతో ఉన్నారు. 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం ఇండియా మార్కెట్ లో రూ.27,000 ధర విభాగంలో లభిస్తున్నాయి. తక్కువ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడానికి జియో తీసుకున్న చర్య లాంచ్ అయితే స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారీ గేమ్ ఛేంజర్ అవుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 5G స్మార్ట్‌ఫోన్‌ల ప్రకటన

రిలయన్స్ జియో 5G స్మార్ట్‌ఫోన్‌ల ప్రకటన

ఇటీవల జరిగిన 43 వ వార్షిక సమావేశంలో రిలయన్స్ జియో చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ భారతదేశాన్ని ‘2G-ముక్త్' అని స్టేట్ మెంట్ ను ప్రకటించారు. ప్రస్తుతం 2G ఫీచర్‌ను సరసమైన స్మార్ట్‌ఫోన్‌లకు ఉపయోగిస్తున్న 350 మిలియన్ల మంది భారతీయులను 5G కి అప్ గ్రేడ్ చేయడానికి కంపెనీ వేగవంతం చేస్తుందని ఆయన తెలిపారు. తక్కువ ఖర్చుతో 5G స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ విడుదల చేస్తుందనే కొత్త ఉహాగానాలు ఈ ప్రకటనతో అందరి దృష్టిలో మొదలయ్యాయి.

Also Read:మీరు laptop కొనాలనుకుంటే ఇదే చక్కని అవకాశం! Flipkart లో మంచి ఆఫర్లు ఉన్నాయి ....Also Read:మీరు laptop కొనాలనుకుంటే ఇదే చక్కని అవకాశం! Flipkart లో మంచి ఆఫర్లు ఉన్నాయి ....

రిలయన్స్ జియోలో గూగుల్ పెట్టుబడులు
 

రిలయన్స్ జియోలో గూగుల్ పెట్టుబడులు

రిలయన్స్ జియో ఇప్పటికే ప్రముఖ సెర్చ్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నుండి పెట్టుబడి ఏర్పాట్లు చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క టెలికాం కార్యకలాపాలను కలిగి ఉన్న జియో ప్లాట్‌ఫామ్‌లో 7.73% వాటా కోసం US టెక్ దిగ్గజం రూ.33,737 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. రాబోయే ఐదు నుండి ఏడు సంవత్సరాలలో ఇండియాలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలనే దాని ప్లాన్ లో గూగుల్ పెట్టుబడి ఒక భాగం. ముఖేష్ అంబానీ ప్రకారం ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను రూపొందించడానికి టెక్ దిగ్గజం జియోతో భాగస్వామ్యం కావాలని భావిస్తోంది.

జియో ప్లాట్‌ఫాంలో ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు

జియో ప్లాట్‌ఫాంలో ఇతర గ్లోబల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు

గూగుల్‌ సంస్థ కంటే ముందు జియో ప్లాట్‌ఫామ్‌లలో 9.99% వాటాను ఫేస్‌బుక్ సంస్థ రూ.43,574 కోట్ల పెట్టుబడితో కొనుగోలు చేసింది. అలాగే మరొక ప్రముఖ టెక్నాలజీ ప్లేయర్ యుఎస్ చిప్‌మేకర్ క్వాల్‌కామ్ కూడా జియో ప్లాట్‌ఫామ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. క్వాల్‌కామ్ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.730 కోట్ల పెట్టుబడితో 0.15% వాటాను కొనుగోలు చేసే ఆలోచనలో ఉంది. ఇవే కాకుండా జియో ప్లాట్‌ఫామ్స్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ మరియు ముబదాలా, ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కెకెఆర్, టిపిజి, ఎల్ కాటర్టన్ మరియు సౌదీ అరేబియా యొక్క పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పిఐఎఫ్) వంటివి కూడా ఉన్నాయి.


Best Mobiles in India

Read more about:
English summary
Reliance Jio Plan to Launch 5G Budjet Smartphone in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X