జియో మరో సంచలనం, రెండున్నరేళ్లలోనే..

కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది.

|

కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్ జియో ఇతర టెలికాం దిగ్గజాలకు అందనంత వేగంలో దూసుకుపోతున్నది. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేండ్లలో 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది. మార్చి 2న ఈ మైలురాయిని సాధించిందని కంపెనీ వర్గాలు తెలిపాయి. కాగా మరింత సమాచారం ఇవ్వడానికి వారు నిరాకరించారు.

జియో మరో సంచలనం, రెండున్నరేళ్లలోనే..

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా జియో..30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్నట్లు జియో చెబుతోంది. ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా టీవీల్లో ఇచ్చే కమర్షియల్‌ యాడ్స్‌లో .. 'సెలబ్రేటింగ్‌ 300 మిలియన్‌ యూజర్స్‌’ అని పేర్కొనడంతో ఈ విషయం స్పష్టమైంది.

 170 రోజుల్లోనే

170 రోజుల్లోనే

10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు నమోదు చేసింది.

భారతీ ఎయిర్‌టెల్‌కు

భారతీ ఎయిర్‌టెల్‌కు

మరోవైపు ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌కు జనవరి నాటికి 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 30 కోట్ల కస్టమర్ల మైలు రాయిని చేరుకునేందుకు ఎయిర్‌టెల్‌కు 19 ఏళ్లు పట్టిన విషయం గమనార్హం.

వొడాఫోన్‌, ఐడియాలు

వొడాఫోన్‌, ఐడియాలు

వొడాఫోన్‌ ఐడియా 40 కోట్ల మంది యూజర్లతో ప్రస్తుతం అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండగా, ఎయిర్‌టెల్‌ రెండో స్థానంలో ఉంది. కాగా వొడాఫోన్‌, ఐడియాలు వీలినం కావడంతో 408 మిలియన్ల వినియోగదారులతో దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే.

ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని

ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని

ఇదిలా ఉంటే త్వరలో ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని జియో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమర్షియల్‌ సేవలు ప్రారంభించిన 170 రోజుల్లోనే జియో 100 మిలియన్ల కస్టమర్లను అందుకొని ప్రపంచ తొలి టెలికాం సంస్థగా నిలిచింది.

జియో రాకముందు

జియో రాకముందు

జియో రాకముందు వరకూ ఇంటర్నెట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. జియో ఒకేసారి అన్‌లిమిటెడ్ కాలింగ్‌తోపాటూ 4జీ ఇంటర్నెట్‌ని ప్రజలు ఆశించినదానికంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంతో జనాలు జియో కోసం ఎగబడ్డారు.

జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య

జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య

దాంతో ఇతర నెట్‌వర్క్‌ల నుంచీ కస్టమర్లు జియోకి మారారు. కొంతమంది రెండు, మూడు నెట్‌వర్క్‌లు కలిగివుంటూ... జియో సిమ్ ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫలితంగా జియో సబ్‌స్క్రైబర్ల సంఖ్య వేగంగా పెరుగుతూ వస్తోంది.

Best Mobiles in India

English summary
Reliance Jio crosses 300 million customers mark

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X