రిలయన్స్ జియో కస్టమర్లు కొంత మంది ఇప్పటికీ ఉచిత కాల్స్ చేయవచ్చు

|

రిలయన్స్ జియో ఇటీవలే ఇతర నెట్‌వర్క్‌లకు చేసే వాయిస్ కాల్‌ల కోసం నిమిషానికి 6 పైసలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. జియో టు జియో కాల్స్ మాత్రం ఉచితం అని కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు రిలయన్స్ జియో కస్టమర్లకు ఒక మంచి వార్త అందించింది. అది ఏమిటంటే అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు తమ మొబైల్ నంబర్లను రీఛార్జ్ చేసిన కస్టమర్లు ఇప్పటికీ ఉచిత కాలింగ్ ప్రయోజనాలను పొందవచ్చని ధృవీకరించారు.

ట్విట్టర్

టెలికాం ఆపరేటర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా దాని గురించి సమాచారం ఇచ్చారు. "మీరు అక్టోబర్ 9 న లేదా అంతకు ముందు రీఛార్జ్ చేసి ఉంటే కనుక మీ యొక్క ప్లాన్ గడువు ముగిసే వరకు మీరు ఫోన్ కాల్ లను మరియు ప్లాన్ యొక్క అన్ని ప్రయోజనాలను ఉచితంగా ఆనందించవచ్చు" అని రిలయన్స్ జియో ట్విట్ లో తెలిపారు.

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ IUC ప్లాన్స్

రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ IUC ప్లాన్స్

రిలయన్స్ జియో ఇప్పటికే తన కొత్త ఐయుసి ప్రణాళికలను అదనపు డేటా ప్రయోజనాలతో అందిస్తోంది. అదనపు ఐయుసి టాప్-అప్‌లను భర్తీ చేయడానికి వినియోగదారులు ఖర్చు చేసిన ప్రతి 10 రూపాయలకు జియో 1 జిబి డేటాను ఉచితంగా ఇస్తుంది. 1 జిబి ఉచిత అదనపు డేటాతో పాటు జియోయేతర నెట్‌వర్క్‌లకు 124 నిమిషాల కాలింగ్ తో ఐయుసి రూ.10 టాప్-అప్ వోచర్ ను అందిస్తుంది. అలాగే రూ .20 వోచర్ 2 జీబీ డేటాతో పాటు 249 నిమిషాల కాల్స్ ను అందిస్తుంది.

నెట్‌వర్క్‌లకు

రూ.50 వోచర్ ఇతర నెట్‌వర్క్‌లకు 656 నిమిషాల కాల్స్‌ను మరియు అదనంగా 5GB డేటాను అందిస్తుంది. చివరిగా రూ.100ల టాప్-అప్ వోచర్ 10 జీబీ అదనపు డేటాతో పాటు 1362 నిమిషాల కాల్స్‌ను ఇతర నెట్‌వర్క్‌లకు ఇస్తుంది. ఈ టాప్-అప్ ప్యాక్‌లు సాధారణ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ల పైన అందిస్తాయని గమనించడం ముఖ్యం.

 

జియో నుంచి ఇతరులకు అవుట్ గోయింగ్ ఇకమీద ఉచితం కాదు

IUC ఛార్జ్ లు ఎప్పుడు ముగుస్తాయి

IUC ఛార్జ్ లు ఎప్పుడు ముగుస్తాయి

ప్రస్తుత నిబంధన ప్రకారం ఐయుసి ఛార్జ్ జనవరి 1 2020 నాటికి తొలగించబడుతుందని తెలిపింది. ప్రస్తుతం ఉన్న ఈ తాత్కాలిక ఛార్జ్ డిసెంబర్ 31, 2019 నాటికి ముగుస్తుందని అందరు ఆశిస్తున్నారు. వినియోగదారులు ఆ తర్వాత ఈ ఛార్జీని చెల్లించవలసిన అవసరం లేదు. ఈ సమయంలో వినియోగదారులు ఐయుసి టాప్-అప్ వోచర్‌లకు బదులుగా అదనపు డేటా అర్హతను పొందవచ్చు. దీని వలన 2019 డిసెంబర్ 31 వరకు మీరు అదిక మొత్తం చెల్లించినట్లు కాదు అని జియో చెప్పారు.

జియో యూజర్లు

కాబట్టి అక్టోబర్ 10 నుండి జియో యూజర్లు చేసే అన్ని రీఛార్జీల కోసం ఇతర మొబైల్ ఆపరేటర్లకు చేసిన కాల్స్ ప్రస్తుతమున్న ఐయుసి రేటుకు నిమిషానికి 6 పైసలు ఐయుసి టాప్-అప్ వోచర్ల ద్వారా వసూలు చేయబడతాయి.

Best Mobiles in India

English summary
Reliance Jio customers can still make free calls: Other Jio Offers To Know

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X