జియోలో ఈ ప్యాక్స్ గురించి తెలుసా, డేటా అయిపోతే 10 జిబి డేటాను పొందడం ఎలా ?

|

దేశీయ టెలికాం రంగంలో ఇప్పుడు వార్ నువ్వా నేనా అన్నట్లు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఎయిర్‌టెల్, జియోల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ప్రత్యర్థి కంపెనీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లను, ప్లాన్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటున్నది. ఈ క్రమంలోనే జియోలో ఇప్పుడు వినియోగదారులకు అనేక ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆ ప్లాన్లలో ఉన్న మొబైల్ డేటా అయిపోతే మళ్లీ ప్లాన్ వాలిడిటీ ముగిసే వరకు లేదా, రోజువారీ డేటా లిమిట్ ఉంటే మళ్లీ రోజు ఆరంభమయ్యే వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తున్నది. కానీ అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్లాన్‌తో వచ్చిన మొబైల్ డేటా అయిపోతే జియోలో కస్టమర్లకు యాడాన్ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

 

స్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లుస్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లు

 నాలుగు యాడాన్ ప్యాక్స్..

నాలుగు యాడాన్ ప్యాక్స్..

జియోలో రూ.11, రూ.21, రూ.51, రూ.101 పేరిట నాలుగు యాడాన్ ప్యాక్స్ ప్రస్తుతం కస్టమర్లకు లభిస్తున్నాయి. వీటికి ప్రత్యేకమైన వాలిడిటీ ఏమీ లేదు. కస్టమర్ వాడుతున్న ప్లాన్ వాలిడిటీ ఎప్పటి వరకు ఉంటే అదే వాలిడిటీ ఈ ప్యాక్స్‌కు కూడా వర్తిస్తుంది.

రీఛార్జ్..

రీఛార్జ్..

ఈ ప్యాక్స్‌లో రూ.11తో యూజర్లు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 400 ఎంబీ మొబైల్ డేటాను, రూ.21తో యూజర్లు రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 1 జీబీ డేటాను , యూజర్లు రూ.51తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 3 జీబీ డేటాను, యూజర్లు రూ.101తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 6 జీబీ డేటాను పొందవచ్చు.

రూ. 201తో రీఛార్జ్
 

రూ. 201తో రీఛార్జ్

అలాగే యూజర్లు రూ. 201తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 5జిబి డేటాను 525 నిమిషాల వాయిస్ కాల్స్ ని పొందవచ్చు. అలాగే రూ. 301తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 10 జిబి డేటాను 1000 నిమిషాల వాయిస్ కాల్స్ ని పొందవచ్చు.

 అడిషనల్ డేటా

అడిషనల్ డేటా

ఈ ప్యాక్ లను మీరు ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు అడిషనల్ డేటాను పొందవచ్చు. వీటిని యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే మై జియో యాప్ లోకి వెళ్లాలి. ఆ యాప్ లో కెళ్లి మై రీఛార్జ్ సెక్షన్ లో కెళ్లి మీరు యాడ్ ఆన్ బూస్టర్ ప్యాక్స్ సెలక్ట్ చేసుకుని మీ నంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది.

నంబర్ యాడ్ చేయగానే..

నంబర్ యాడ్ చేయగానే..

మీ నంబర్ యాడ్ చేయగానే మీకు అక్కడ ఈ బూస్టర్ ప్యాక్స్ కనిపిస్తాయి. వాటి ద్వారా మీకు నచ్చని వాటిని సెలక్ట్ చేసుకుని పేమెంట్ చేయవచ్చు. పేమెంట్ ఆప్సన్ పూర్తి కాగానే మీ మొబైల్ కి రీఛార్జ్ సక్సెస్ పుల్ అయినట్లు మెసేజ్ వస్తుంది. ఈ డేటాను మీరు ఎప్పుడైనా వాడుకోవచ్చు.

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio daily limit exhausted? These booster packs can give you up to 10GB additional data More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X