జియో ఆ నిజాన్ని దాచి 12 కోట్ల మందికి షాకిచ్చింది
ఈ మధ్య జియో యూజర్లని భయపెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది డేటా లీక్ అంశమే.
ఈ మధ్య జియో యూజర్లని భయపెట్టిన అంశం ఏదైనా ఉందంటే అది డేటా లీక్ అంశమే. అయితే దీనిపై జియోని వివరణ కోరిన వారికి అదంతా ఒట్టి అబద్దమేనంటూ బుకాయించిన సంగతి తెలిసిందే. అయితే డేటా లీక్ కాలేదంటూ ప్రగల్భాలు పలికిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ యూ టర్న్ తీసుకుంది. డేటా లీక్ అయిందంటూ పోలీసులకు జియో ఫిర్యాదు చేయడంపై ఇప్పుడు అందరూ ఆందోళనకు గురి అవుతున్నారు.

సమాచారం లీక్ అయిందంటూ
తమ వినియోగదారుల సమాచారం లీక్ అయిందంటూ పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొనడం కలకలం రేపింది. డేటా మేజర్ లీక్ అయిందంటూ జియో తమకు ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి బుధవారం తెలిపారు.

కస్టమర్ల సమాచారం
తమ కంప్యూటర్ వ్యవస్థలోకి అక్రమ చొరబాట్లు జరిగాయంటూ ముంబై పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రిలయన్స్ జియో ఆరోపించిందని దర్యాప్తు అధికారి ఒకరు వెల్లడించారు. దీంతో ఈ కస్టమర్ల సమాచారం భారీగా లీక్ అయిందన్న వార్తలను నమ్మొద్దంటూ కొట్టిపారేసిన జియో, డేటాలీక్‌ను అధికారికంగా ధృవీకరించినట్టయింది.

మాజిక్ ఏపీకే వెబ్‌సైట్‌లో
మాజిక్ ఏపీకే వెబ్‌సైట్‌లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళన రేపింది. వినియోగదారుల ఈమెయిల్, ఆధార్‌నెం, మొబైల్ నంబర్లను ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి.

లీకేజీకు సంబంధించి
మరోవైపు లీకేజీకు సంబంధించి రాజస్థాన్‌కు ఇమ్రాన్ చింపా అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చింపాను ముంబైకి తరలించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 66 లోని సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ యొక్క 379 సెక్షన్. ప్రకారం కేసు నమోదు చేశారు.

12 కోట్ల మంది జియో వినియోగదారులు
దాదాపు 12 కోట్ల మంది జియో వినియోగదారులు తన ఆధార్ కార్డ్ నమోదు ద్వారా జియో సిమ్‌ను తీసుకున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








