దేశీయ టెలికాం రంగంలో ఓ సునామికి జియో తెరలేపిన విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సునామి దెబ్బకు టాప్ దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలలోకి జారుకున్నాయి. ఇప్పటికీ ఆ నష్టాల నుంచి బయటపడలేక సతమతమవుతున్నాయి. ఇదిలా ఉంటే రిలయన్స్ జియో వినియోగదారులకు హైస్పీడ్ మొబైల్ డేటాను అందివ్వడంలోనూ ఇప్పటికీ ముందుందని ట్రాయ్ రిపోర్టు పేర్కొంది.
ఇండియాలో ఇప్పుడు లభిస్తున్న బెస్ట్ ఫోన్లు ( రూ. 15 వేల లోపు )
ట్రాయ్ రిపోర్టుల ప్రకారం..
ట్రాయ్ రిపోర్టుల ప్రకారం అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాల్లో రిలయన్స్ జియో, ఐడియా పోటీపడుతున్నాయి. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో ఈ రెండు టెల్కోలు అగ్రస్థానంలో నిలిచాయి.
జియో రికార్డు స్థాయిలో..
నవంబరులో జియో రికార్డు స్థాయిలో 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో అగ్రస్థానంలో నిలవగా అదే నెలలో అప్‌లోడింగ్ వేగంలో ఐడియా సెల్యులార్ 7.1 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో నిలిచింది.
డౌన్‌లోడ్ వేగంలో..
డౌన్‌లోడ్ వేగంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యూలార్‌లు వరుసగా 9.3, 9.9, 8.1 ఎంబీపీఎస్ వేగంతో జియో తర్వాతి స్థానాన్ని ఆక్రమించాయి.
అప్‌లోడ్ వేగంలో..
అప్‌లోడ్ వేగంలో ఐడియా తర్వాత ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియోలు వరుసగా 3.9, 6.2, 4.9 ఎంబీపీఎస్‌తో ఆ తర్వాతి స్థానాలకు పరిమితమయ్యాయి.
అక్టోబరులో జియో..
అక్టోబరులో జియో 21.9 ఎంబీపీఎస్ నమోదు చేయగా, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ల డౌన్‌లోడ్ వేగం 7.5, 8.7 ఎంబీపీఎస్‌లకు పెరిగింది.
ఐడియా 8.6 ఎంబీపీఎస్ వేగాన్ని ..
అక్టోబరుతో పోలిస్తే ఈనెలల ఐడియా డౌన్‌లోడ్ వేగం పడిపోయింది. అక్టోబరులో ఐడియా 8.6 ఎంబీపీఎస్ వేగాన్ని నమోదు చేసింది.
Gizbot ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి.Subscribe to Telugu Gizbot.