డిసెంబర్ 15 నుంచి జియో డీటీహెచ్ సర్వీస్?

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలయన్స్ జియో DTH సర్వీసులను డిసెంబర్ 15న రిలయన్స్ మార్కెట్లో లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మార్కెట్లో ఇప్పటికే డీటీహెచ్ సేవలను ఆఫర్ చేస్తున్న ఇతర ప్రొవైడర్స్‌తో పోలిస్తే మరింత చౌకగా జియో తన డీటీహెచ్ సేవలను అందించే అవాకశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More : రూ.1,000కే 4G VoLTE స్మార్ట్‌ఫోన్?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రూ.185కే నెల వ్యాలిడిటీ..

బలంగా వినిపిస్తోన్న రూమర్స్ ప్రకారం రూ.185కే నెల వ్యాలిడిటీతో జియో డీటీహెచ్ ప్రసారాలు పొందే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

సౌత్ ఇండియా ఛానల్ కాంబో

సౌత్ ఇండియా ఛానల్ కాంబో ప్లాన్ ధర రూ.195గా ఉండే అవకాశం. స్పోర్ట్స్ ఛానల్ కాంబో ధర రూ.210గా ఉండే అవకాశం.

వెల్‌కమ్ ఆఫర్‌ సదుపాయం కూడా..?

జియో తన వెల్‌కమ్ ఆఫర్‌ను కొత్తగా లాంచ్ చేయబోనే డీటీహెచ్ సర్వీసులకు విస్తరించే అవకాశముందని అనధికారికంగా తెలియవచ్చింది.

ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం..

ఇదే వాస్తవమైతే మొదటి మూడు నెలల పాటు జియో డీటీహెచ్ సర్వీసులను ఉచితంగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

 

రోజుకో ఆసక్తికర న్యూస్..

'Jio GigaFiber' పేరుతో రిలయన్స్ జియో లాంచ్ చేయబోతున్న బ్రాడ్‌బ్యాండ్ సర్వీసుల పై రోజకో ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం..

అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం ప్రకారం రిలయన్స్ జియో తన GigaFiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను రూ.500 నుంచి రూ.5,500 వరకు రకరకాల టారిఫ్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. రూ.500 ప్యాక్‌లో భాగంగా 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 600జీబి ఇంటర్నెట్‌ ను యూజర్లు పొందే అవకాశముందని తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio DTH Service Might Be Launched on December 15: Here's All We Know Right Now. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot