జియోకు కౌంటర్ : 90 రోజుల ప్లాన్‌తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

రిలయన్స్ జియోకు కౌంటర్‌గా 90 రోజుల ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ దూసుకొచ్చింది. తన 4జీ యూజర్ల కోసం రూ.1,494 టారిఫ్‌లో స్పెషల్ డేటా ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.

జియోకు కౌంటర్ : 90 రోజుల ప్లాన్‌తో దూసుకొచ్చిన ఎయిర్‌టెల్

Read More : సంచలనం రేపుతోన్న Amazon Samsung స్పెషల్ ఆఫర్స్

ఈ 90 రోజుల డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉన్న కస్టమర్‌లు రూ.1495 చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్‌లు రూ.1494 చెల్లించి ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

90 రోజుల పాటు ఇంటర్నెట్‌

ఈ ప్యాక్‌ను పొందే ఎయిర్‌టెల్ యూజర్లు 90 రోజుల పాటు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది..

ఫెయిర్ యూసేజ్ పాలసీ

ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్‌కు ఫెయిర్ యూసేజ్ పాలసీ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 90 రోజుల ప్లాన్ వ్యాలిడిటీలో మొదటి 30 జీబి వరకు 4జీ స్పీడ్ వర్తిస్తుందని, లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం 2జీకి పడిపోతుందని ఎయిర్‌టెల్ వివరించింది.

రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా

ప్రస్తుతానికి ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ప్లాన్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

జియో రూ.50కే అందిస్తోన్న నేపథ్యంలో

1జీబి 4జీ డేటాను రూ.50కే అందిస్తామని రిలయన్స్ జియో ప్రకటించిన నేపథ్యంలో అందుకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్ ఈ రూ.1,494 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఎయిర్‌టెల్ రూ.50కే 4జీ డేటా

ఎయిర్‌టెల్ రూ.1,494 ప్లాన్ ప్రకారం చూస్తే 1జీబి డేటా రేట్ రూ.50గా ఉంది. పైగా 90 రోజుల వ్యాలిడిటీ కూడా ఉంది.

రూ.1,499 టారిఫ్‌లో జియో ఆఫర్ చేస్తున్న

రూ.1,499 టారిఫ్‌లో జియో ఆఫర్ చేస్తున్న ప్లాన్‌లో భాగంగా 20జీబి డేటాతో పాటు ఉచిత వాయిస్ కాలింగ్ లభిస్తుంది. అయితే ప్యాక్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య హోరాహోరీ

ఇంటర్‌కనెక్టువిటీ పాయింట్ల విషయంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య నెలకున్న వివాదం రోజుకో మలుపు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విషయంలో

నిన్నటి వరకు ఇంటర్ కనెక్టివిటీ విషయంలో మాటల యుద్ధానికి తెరలేపిన ఈ కంపెనీలు, తాజాగా మొబైల్ నెంబర్ పోర్టబులిటీ విషయంలో కొట్లాడుకుంటున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: Airtel free data for 90 days to 4G users. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting