జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్, మార్కెట్లోకి కొత్త ప్లాన్

Written By:

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ జియోకు పోటీగా ఓ సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను తాజాగా ప్రవేశపెట్టింది. రూ.499కు లభిస్తున్న ఈ ప్లాన్‌ను కస్టమర్లు తీసుకుంటే వారికి 40 జీబీ ఉచిత 3జీ/4జీ మొబైల్ డేటా లభిస్తుంది. దీనికి డేటా రోల్ ఓవర్ ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఏ నెలలో అయినా 40 జీబీ డేటాను పూర్తిగా వాడుకోకపోతే మిగిలిన డేటా తరువాతి నెలకు ట్రాన్స్‌ఫర్ అవుతుందన్నమాట. దీంతో తరువాత నెలలో వచ్చే 40 జీబీ డేటాకు తోడు గత నెలలో మిగిలిన డేటాను కలిపి వాడుకోవచ్చు. ఇక ఈ ప్లాన్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఏడాది పాటు ఉచితంగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌కు 30 రోజుల బిల్లింగ్ సైకిల్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో వింక్ టీవీ, లైవ్ టీవీ ఉచిత సబ్‌స్క్రిప్షన్, ఉచిత హ్యాండ్ సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ లభిస్తున్నాయి.

డిస్‌ప్లే పింగర్ ప్రింట్ సెన్సార్‌తో వన్‌ప్లస్ 6, oppo R15కి ధీటుగా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇదే తరహా ప్లాన్ రూ.509కు..

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఇదే తరహా ప్లాన్ రూ.509కు లభిస్తుండగా ఇందులో నెలకు 60 జీబీ డేటా వస్తుంది. దీన్ని రోజూ గరిష్టంగా 2 జీబీ వరకు మాత్రమే వాడుకోవచ్చు. అదే పైన చెప్పిన ఎయిర్‌టెల్ ప్లాన్‌లో అయితే రోజు వారీ లిమిట్ ఏమీ లేదు. నెల రోజుల్లో 40 జీబీ డేటాను ఎప్పుడైనా వాడుకోవచ్చు.

ఎయిర్‌టెల్‌ రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను

ఎయిర్‌టెల్‌ రూ. 98 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను సమీక్షించింని విషయం అందరికీ తెలిసిందే. రూ. 98 రీచార్జ్‌పై రోజువారీ పరిమితి లేకుండా 28 రోజుల వ్యవధిలో 5జీబీ (3జీ / 4జీ)డేటా ఉచితమని ప్రకటించింది. అంటే 28 రోజుల్లో ఎపుడైనా మొత్తం 5జీబీ డేటాను వాడుకనే సౌలభ్యాన్ని అందిస్తోంది.

వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం..

అయితే ఈ ప్లాన్‌లో ఎలాంటి వాయిస్‌ కాలింగ్‌ ఆఫర్లు లేవు. అలాగే ఎయిర్‌టెల్‌ వెబ్‌సైట్‌ సమాచారం ప్రకారం ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు మాత్రమే అందుబాటులో ఉంది.

రూ. 98లో హై స్పీడ్ డేటా

కాగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో రూ. 98 లో ఈ హై స్పీడ్ డేటాను 28 రోజులు రోజువారీ టోపీ పరిమితి లేకుండా అందిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెలు తాజా మార్పులను వెల్లడించింది. కాగా రూ. 93 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో కూడా ఇటీవల మార్పులు చేసిన సంగతి తెలిసిందే.

1 జీబీ( 3జీ / 4జీ) డేటా..

1 జీబీ( 3జీ / 4జీ) డేటాను 28 రోజుల పాటు అందిస్తుంది. అలాగే అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు కూడా ఉచితం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio effect: Airtel offering unlimited calls, 40GB data at Rs 499 More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot