జియో vs ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్

ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి పోటీ ఆపరేటర్స్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

|

జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ పేరుతో రిలయన్స్ జియో తన ఉచిత సేవలను మార్చి 31, 2017 వరకు పొడిగించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, బీఎస్ఎన్ఎల్ వంటి పోటీ ఆపరేటర్స్ సరికొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి
తీసుకువచ్చాయి. మరి, ఈ ప్లాన్స్ జియోతో పోటీపడే విధంగా ఉన్నాయా..?

Read More : మీ ఫోన్‌లో మెమరీ కార్డ్ ఉందా..? ఇవి తెలుసుకోండి

కొత్త ప్లాన్‌లతో కదం తొక్కిన ఎయిర్‌టెల్

కొత్త ప్లాన్‌లతో కదం తొక్కిన ఎయిర్‌టెల్

జియోతో పోటీపడే క్రమంలో ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.145 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ - ఎయిర్‌టెల్ కాల్స్ ఉచితం. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్యాక్‌లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తుంది. మీరు 4జీ యూజర్ కాకపోయినట్లయితే 50MB డేటా మాత్రమే మీకు లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్‌..

ఎయిర్‌టెల్ రూ.345 ప్లాన్‌..

మిస్టరీ ఫోన్ ఇదే..మిస్టరీ ఫోన్ ఇదే..

ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన రూ.345 ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ బండిల్డ్ ప్లాన్ లో భాగంగా 1జీబి 4జీ డేటాను యూజర్ పొందగలుగుతారు.

ఎంతకొంటే అంత ఉచితమంటున్న వొడాఫోన్..

ఎంతకొంటే అంత ఉచితమంటున్న వొడాఫోన్..

వొడాఫోన్ తన 2జీ, 3జీ, 4జీ ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేట్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. మొదటి ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.144 - రూ.149 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వొడాఫోన్ - వొడాఫోన్ మధ్య 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు, ఇన్‌కమింగ్ కాల్స్ పూర్తిగా ఉచితం. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయస్ కాల్స్‌తో పాటు
300 ఎంబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ అందిస్తోంది.

వొడాఫోన్ రూ.344 - రూ.349 ప్లాన్..

వొడాఫోన్ రూ.344 - రూ.349 ప్లాన్..

డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్'డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్'

వొడాఫోన్ లాంచ్ చేసిన రెండవ ప్లాన్ విలువ సర్కిల్‌ను బట్టి రూ.344 - రూ.349 రేంజ్‌లో అందుబాటులో ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ల్యాండ్‌లైన్ కాల్స్ కూడా పూర్తిగా ఉచితం. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1జీబి 4జీ డేటాను కూడా వొడాఫోన్ యూజర్లు పొందవచ్చు.

4జీ రీఛార్జుల పై డబల్ డేటా..

4జీ రీఛార్జుల పై డబల్ డేటా..

పోటీ మార్కెట్ నేపథ్యంలో అన్ని 4జీ రీఛార్జుల పై డబల్ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు కూడా వొడాఫోన్ ఇండియా ప్రకటించింది. రూ.255 అంతకన్నా ఎక్కువ రీఛార్జులకు మాత్రమే ఈ డబల్ డేటా ఆఫర్ వర్తిస్తుందని వొడాఫోన్ తెలిపింది. వొడాఫోన్ లాంచ్ చేసిన కత్త స్కీమ్‌లో భాగంగా యూజర్ 1జీబి 4జీ డేటాను కొనుగోలు చేసినట్లయితే అతని అకౌంట్‍లో 2జీబి 4జీ డేటా యాడ్ అవుతుంది. ఇలా ఎన్ని జీబిలు కొంటే అన్ని జీబిలు ఇంటర్నెట్ అదనంగా యాడ్ అవుతుంటుంది. రూ.255, అంతకన్నా ఎక్కువ రీఛార్జులకు మాత్రమే ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వొడాఫోన్ యూజర్లు ఆఫర్ ను సద్వినియోగం చేసుకునేందుకు మినిమమ్ 1జీ 4జీ డేటా అయినా రీఛార్జ్ చేయించుకోవల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్ పై లభించే డేటాకు 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుందని వొడాఫోన్ తెలిపింది.

 

ఐడియా సెల్యులార్ అన్‌లిమిటెడ్..

ఐడియా సెల్యులార్ అన్‌లిమిటెడ్..

మోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకుమోటరోలా ఫోన్స్.. నాటి నుంచి నేటి వరకు

పోటీ మార్కెట్ నేపథ్యంలో ఐడియా సెల్యులార్ రెండు సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ప్లాన్‌లను మార్కెట్లో లాంచ్ చేసింది. రూ.148 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఐడియా - ఐడియా కాల్స్ ఉచితం. ఈ బండిల్డ్ ప్యాక్ లో భాగంగా 300 ఎంబీ 4జీ డేటాను కూడా యూజర్ పొందే అవకాశం.

ఐడియా సెల్యులార్ అన్‌లిమిటెడ్..

ఐడియా సెల్యులార్ అన్‌లిమిటెడ్..

రూ.348 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు 1జీబి 4జీ డేటాను కూడా ఐడియా యూజర్లు పొందవచ్చు. ఐడియా తన 3G/ 4G మొబైల్ డేటా రేట్లను కూడా 67శాతానికి తగ్గించింది. 2జీబి అంతకన్నా ఎక్కువ మొత్తంలో రీఛార్జుల పై ఈ రాయితీ వర్తిస్తుంది. 1జీబి అంతకన్నా తక్కువ రీఛార్జుల పై 45శాతం వరకు తగ్గింపు ఐడియా ఆఫర్ చేస్తోంది.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి..

రిలయన్స్ కమ్యూనికేషన్స్ నుంచి..

డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్'డిసెంబర్ 14న ‘లెనోవో కే6 నోట్'

అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ప్రీపెయిడ్ ఖాతాదారుల కోసం రూ.148 రీఛార్జ్ ప్యాక్‌‌ను మార్కెట్లో పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఈ బండిల్డ్ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి డేటాను కూడా రిలయన్స్ ఆఫర్ చేస్తోంది. ఈ డేటా బెనిఫిట్స్ అనేవి 2జీ, 3జీ, అలానే 4జీ యూజర్లకు వర్తిస్తాయి.

బీఎస్ఎన్ఎల్  అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇంకా డేటా ప్లాన్స్

బీఎస్ఎన్ఎల్ అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇంకా డేటా ప్లాన్స్

రూ.149 రేంజ్‌లో బీఎస్ఎన్ఎల్ నుంచి సరికొత్త అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇంకా డేటా ప్లాన్ జనవరి 1, 2017 నుంచి అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ బండిల్డ్ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి మొబైల్ డేటా కూడా యూజర్లకు లభించే అవకాశం.

Best Mobiles in India

English summary
Reliance Jio Effect: Best Unlimited Voice Calling Plans, Mobile Data Offers by Airtel, Vodafone, and Others. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X