జియోను తలదన్నే ఆఫర్, రోజుకు 2జీబి డేటా

రిలయన్స్ జియోకు షాకిస్తూ బీఎస్ఎన్ఎల్ (BSNL) సరికొత్త ఆఫర్‌ను లాంచ్ చేసింది. ఈ ఆఫర్ లో భాగంగా బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.339 రీచార్జ్ ప్లాన్‌ను పొందటం ద్వారా 28 రోజుల పాటు ( బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్) అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 2జీబి 3జీ డేటాను పొందవచ్చు.

Read More : సంగీతా, బిగ్ సీ స్టోర్‌లలో Redmi Note 4 ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

90 రోజుల పాటు ఈ ప్లాన్

90 రోజుల పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. అంటే మూడు సార్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌లో డేటా ఎక్కువగానే లభిస్తున్నప్పటికి అన్‌లిమిటెడ్ కాల్స్ మాత్రం బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్ పరిధిలోనే ఉండటం కొంత మేర నిరుత్సాహపరిచే విధంగా ఉంది.

ఇతర స్పెషల్ టారిఫ్ ప్లాన్‌లను పరిశీలించినట్లయితే..

మార్చి 31లోపు రిలయన్జ్ జియో యూజర్లు రూ.99 చెల్లించి జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ను తీసుకుకోవటం ద్వారా రూ.303కే 28జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌ను ఆస్వాదించే వీలుంటుంది.  

మార్చి 31, 2018 వరకు

జియో ప్రైమ్ సభ్యత్వం మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది. ఈ పీరియడ్‌లో ప్రైమ్ యూజర్లు ప్రతినెలా రూ.303 చెల్లించిటం ద్వారా మార్చి జియో న్యూ ఇయర్ ఆఫర్ తాలుకూ అన్ లిమిటెడ్ బెనిఫిట్స్ అందుబాటులో ఉంటాయి.

ఎయిర్‌టెల్ విషయానికి వచ్చేసరికి

ఇక ఎయిర్‌టెల్ విషయానికి వచ్చేసరికి రూ.345 పెట్టి రీచార్జ్ చేసుకోవటం ద్వారా నెల మొత్తం అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు రోజుకు 1జీబి డేటా (పగలు 500 ఎంబి + రాత్రి 500 ఎంబి) అందుబాటులో ఉంటుంది. ఏడాది పాటు ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

వొడాఫోన్, ఐడియాలు కూడా..

ఎయిర్‌టెల్ బాటలోనే వొడాఫోన్, ఐడియాలు కూడా ఇదే తరహా ఆఫర్లను తమ ప్రీపెయిడ్ చందాదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: BSNL offers 2GB data per day and unlimited calls at Rs 339. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot