ఏడాది పాటు 1జీబి 4జీ డేటా రూ.51కే

రిలయన్స్ జియోకు పోటీగా ఐడియా సరికొత్త 4జీ ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సరికొత్త ప్లాన్‌ను ఐడియా అనౌన్స్ చేసింది. ఈ ప్రత్యేకమైన టారిఫ్ ప్లాన్‌లో భాగంగా 1జీబి 4జీ డేటాను ఏడాది పాటు రూ.51కే పొందవచ్చు. ప్లాన్ విదివిధానాలు ఈ విధంగా ఉన్నాయి...

Read More : మార్చి 2017 వరకు Jio ఉచితం..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ఈ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ఆస్వాదించే క్రమంలో ముందుగా మీ ఐడియా నెంబర్ ను రూ.1,499కే రీఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 2

రీఛార్జ్ విజయవంతమైన వెంటనే మీ నెంబర్‌కు 6జీబి 4జీ డేటా క్రెడిట్ అవుతుంది. ఈ డేటాను మీరు ఏడాది పాటు వాడుకోవచ్చు.

స్టెప్ 3

మరసటి రీఛార్జ్ నుంచి మీరు రూ.51 (ఎంపిక చేసిన సర్కిళ్లలో) చెల్లించినట్లయితే 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా మీకు లభిస్తుంది. ఇలా ఏడాది పాటు ఎన్నిసార్లు మీరు రూ.51(ఎంపిక చేసిర సర్కిళ్లలో) పెట్టి రీఛార్జ్ చేయించినా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా మీకు లభిస్తూనే ఉంటుంది.

సర్కిల్‌ను బట్టి రేటు

తమిళనాడు, చెన్నై, పంజాబ్, ఒరిస్సా, మాహారాష్ట్రా, గోవా, కేరళ, హర్యానా సర్కిళ్లలోని ఐడియా యూజర్లు రూ.51 చెల్లించినట్లయితే 4జీ డేటా లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ఐడియా యూజర్లు రూ.52 పెట్టి రీఛార్జ్ చేయించాల్సి ఉంటుంది. కర్ణాటక ఇంకా ఈశాన్య ప్రాంతాలకు చెందిన ఐడియా యూజర్లు రూ.48 చెల్లించటం ద్వారా 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటాను పొందవచ్చు.

ఈ ఆఫర్‌ను పొందాలంటే..?

మీరు ఖచ్చితంగా ఐడియా ప్రీపెయిడ్ యూజర్ అయి ఉండాలి.
మీ ఐడియా నెంబర్ ఖచ్చితంగా పనిచేసే స్థితిలో ఉండాలి.
ముందుగా రూ.1499 పెట్టి రీఛార్జ్ చేయించుకోవాలి.
రీఛార్జ్ చేసుకునే ముందు ఓసారి Idea cellular websiteలో లాగినై ఆఫర్‌ను చెక్ చేసుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Effect: Idea Now Offers 1GB Data For 1 Year at Just Rs.51. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot