ఐడియా రోజుకు 5జిబి డేటా, అపరిమిత కాల్స్, ప్లాన్ పూర్తి వివరాలు మీకోసం..

|

దేశీయ టెలికాం రంగంలో వార్ రోజురోజుకు వేడెక్కుతోంది. జియో ఏ కొత్త ఆఫర్ తీసుకొచ్చినా మిగతా దిగ్గజాలు దానికి కౌంటర్ గా కొత్త ప్లాన్లు మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. యూజర్లు తమ నుంచి ఎక్కడ చేజారిపోతారోనని వారికి అత్యంత సరసమైన ధరల్లో డేటా ఆఫర్లను అందిసున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐడియా సరికొత్త ప్లాన్ తో యూజర్లను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. జియోకి కౌంటర్ వేస్తూ 998 రూపాయలతో సరికొత్త ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. ఈ ప్యాక్‌ కింద రోజుకు 5జీబీ 4జీ/2జీ డేటాను అందించనున్నట్టు పేర్కొంది. డేటాతో పాటు అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను 35 రోజుల పాటు అందిస్తోంది.

 

6GB ర్యామ్, 512GB స్టోరేజ్, 40 Mp కెమెరా, సంచలనపు ఫోన్ 27న వస్తోంది..6GB ర్యామ్, 512GB స్టోరేజ్, 40 Mp కెమెరా, సంచలనపు ఫోన్ 27న వస్తోంది..

ఐడియా మ్యాజిక్‌ తో..

ఐడియా మ్యాజిక్‌ తో..

కాగా ఈ ఆఫర్ ఐడియా మ్యాజిక్‌ తో వచ్చింది. అంటే ఐడియా యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా రీఛార్జ్‌ చేసుకునే తన ప్రీపెయిడ్‌ సబ్‌స్క్రైబర్లకు రూ.3,300 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్యాక్‌పై ఒక వారంలో 100 యూనిక్‌ నెంబర్లకు మాత్రమే కాల్‌ చేసుకోవడానికి వీలుంటుంది.

ఒడిశా సర్కిల్‌కు మాత్రమే..

ఒడిశా సర్కిల్‌కు మాత్రమే..

అంతేకాక వారానికి 1000 నిమిషాలు, రోజుకు 250 నిమిషాలను ఉచితంగా అందిస్తోంది. ఈ ప్యాక్‌ తొలుత ఒడిశా సర్కిల్‌కు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఐడియా మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ లేకుండా ఇదే రకమైన ప్రయోజనాలను కర్నాటక సర్కిల్‌ వారికి కూడా 28 రోజుల పాటు ఐడియా ఆఫర్‌ చేస్తోంది.

రూ.998 ప్యాక్‌ మాదిరిగా కాకుండా..
 

రూ.998 ప్యాక్‌ మాదిరిగా కాకుండా..

అయితే ఐడియా రూ.998 ప్యాక్‌ మాదిరిగా కాకుండా... జియో తన సబ్‌స్క్రైబర్లకు రోజుకు 5జీబీ 4జీ డేటాను, అపరిమిత కాల్స్‌ను రూ.799కే 28 రోజుల పాటు అందిస్తోంది. ఎయిర్‌టెల్‌ కూడా రూ.799 ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ 4జీ డేటాను తన వినియోగదారులు కూడా వాడుకునేలా వీలు కల్పించింది.

రోజుకు 7జీబీ డేటా..

రోజుకు 7జీబీ డేటా..

రూ.998 ప్యాక్‌తో పాటు ఎంపిక చేసిన సర్కిల్స్‌ వారికి ఐడియా రోజుకు 7జీబీ డేటా అందించే రూ.1,298 ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్టు టెలికాంటాక్‌ రిపోర్టు చేసింది. ఈ ప్యాక్‌ను కూడా 35 రోజుల పాటు అందుబాటులో ఉంచుతుందని తెలిపింది.

 రూ.1,298 ప్యాక్‌లో

రూ.1,298 ప్యాక్‌లో

రూ.1,298 ప్యాక్‌లో అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను ఐడియా ఆఫర్‌ చేస్తోంది. అంతేకాక రూ.3,300 రూపాయల విలువైన ప్రయోజనాలతో ఐడియా మ్యాజిక్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Idea Launches ₹998 Prepaid Plan With 5GB 4G Data Per Day, Unlimited Calling More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X