అన్నకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన తమ్ముడు , రూ 299కే అన్నీ!

Written By:

రిలయన్స్ కమ్యూనికేషన్ జియోకు భారీ షాక్ ఇచ్చేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. జియో కన్నా అత్యంత తక్కువ ధరకే డేటా ప్లాన్ అందింస్తున్నట్లుగా ట్విట్టర్ లో తెలిపింది. దీనిపై పూర్తి సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే ట్విట్టర్ లో మాత్రం రిలయన్స్ పోస్ట్ చేసింది. ఈ ఆఫర్ లో అన్నీ అన్ లిమిటెడ్ గా లభిస్తాయని కంపెనీ చెబుతోంది.

రూ. 850కే స్పైస్ మొబైల్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ట్విట్టర్ లో తెలిపిన వివరాల ప్రకారం

ఆర్ కామ్ ట్విట్టర్ లో తెలిపిన వివరాల ప్రకారం రూ. 299 నెలసరి అద్దెతో మొత్తం అన్ లిమిటెడ్ అని తెలుస్తోంది.మీరు వాడే షూస్ కన్నా మా ప్లాన్ చాలా తక్కువ అంటూ ఇమేజ్ తో కూడిన వివరాలను పోస్ట్ చేసింది.

ఫ్లాన్ పొందాలనుకున్న వారు

ఈ ఫ్లాన్ పొందాలనుకున్న వారు ఆర్‌కామ్ పేజీలోకి వెళ్లి మీ మొబైల్ నంబర్ అలాగే ఈ అమౌంట్ మెత్తం ఎంటర్ చేస్తే మీకు ఈ ఆఫర్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది.

లింక్ కోసం క్లిక్ చేయండి

రూ. 5199 ప్లాన్

గత వారమే కంపెనీ రూ. 5199తో ఏడాది పాటు 1 జిబి డేటాతో కూడిన ఆఫర్ ని రిలీజ్ చేసిన విషయం విదితమే. ఇది 4జీ డేటా కార్డ్ వాడుతున్న వారికి అలాగే 4జీ సిమ్ వాడుతున్న వారికి వర్తిస్తుంది.

అదనంగా వైఫాడ్ కొనుగోలు చేసిన వారికి

అయితే అదనంగా వైఫాడ్ కొనుగోలు చేసిన వారికి ఈ ఆఫర్ వస్తుందని కంపెనీ తెలిపింది. వీటి ధరను రూ. 3200గా నిర్ణయించింది. ఈ ఆఫర్ లో మీకు వైఫై డోంగిల్ ఉచితంగా లభిస్తుంది. ఈ ఆఫర్ లో మీరు మీరు రోజుకు 1జిబి డేటా చొప్పున 365 రోజులు పాటు పొందవచ్చు.

సూపర్ వాల్యు టారిఫ్ పేరుతో

తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్లను ప్రకటించిన విషయం విదితమే. సూపర్ వాల్యు టారిఫ్ పేరుతో రూ.148తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ డేటా చొప్పున 70 రోజుల పాటు పొందవచ్చు . ఈ ప్లాన్ కింద రూ.50 టాక్ టైమ్ కూడా అందించనుంది. కాల్స్ కు నిమిషానికి 25 పైసలు మాత్రమే వసూలు చేయనుంది.

రూ.54 తో రీచార్జ్ చేసుకుంటే

వీటితో పాటు రూ.54 తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 1జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు పొందవచ్చు. రిల‌యన్స్ టూ రిలయన్స్ కాల్స్ కు నిమిషానికి 10 పైసలు, ఇతర లోకల్, ఎస్టీడీ కాల్స్ కు నిమిషానికి 25 పైసలు మాత్రమే వసూలు చేయనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio effect: RCom offers unlimited data, calls and texts at just Rs 299 Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot