జియో మరో అద్బుతం, ఫోన్ టూ టీవీ

Written By:

రిలయన్స్ మరో అధ్బుతానికి తెరలేపింది. సరికొత్త ఆవిష్కరణగా జియో ఫోన్ టీవీ-కేబుల్ ను పరిచయం చేసింది. కేవలం స్మార్ట్ టీవీలకు మాత్రమే కాకుండా, అన్ని రకాల టీవీలకూ ఇది పని చేస్తుందని, ఈ కేబుల్ ద్వారా స్మార్ట్ ఫోన్ డేటాతో టీవీ కార్యక్రమాలను, నచ్చిన సమయంలో నచ్చిన సినిమాలను, పాటలకు టీవీ స్క్రీన్ పై వీక్షించవచ్చని, లైవ్ కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు.

జియో నీకు ఇది తగదు, ఇకనైనా ఆటలు మానుకో..

జియో మరో అద్బుతం, ఫోన్ టూ టీవీ

నెలకు రూ. 309 చెల్లించడం ద్వారా ఈ ప్యాక్ ను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. జియో ధన్ ధనా ధన్ ఆఫర్ లో ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగు గంటల పాటు టీవీలో కార్యక్రమాలను చూడవచ్చని అన్నారు.జియో ఫోన్ హైలెట్స్ ఇవే

నో టెన్సన్, ఆధార్ గురించి మరచిపోండి..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని

ఆగస్టు 15 నుంచి భారతీయులకు డిజిటల్ స్వేచ్ఛ దగ్గర కానుందని, ఆనాటి నుంచి ఏ ఒక్కరూ వాయిస్ కాల్స్ చేసుకునేందుకు ఒక్క పైసా కూడా ఇవ్వక్కర్లేదని, ఉచితంగా ఎన్ని నిమిషాలైనా, గంటలైనా మాట్లాడుకోవచ్చని ప్రకటించారు.

అన్ని జియో అప్లికేషన్లు

అన్ని జియో అప్లికేషన్లు ముందుగానే ఇందులో లోడ్ చేసి వుంటాయని, జియో సినిమా, జియో మూవీ, జియో టీవీ యాప్స్ తో పాటు వాయిస్ కమాండ్, ప్రాంతీయ భాషల్లో సందేశాలు పంపుకునే వీలు కూడా ఉంటుందని అన్నారు.

నచ్చిన సాంగ్ ను

నచ్చిన సాంగ్ ను వాయిస్ కమాండ్ ద్వారా సెలక్ట్ చేసుకోవచ్చని తెలిపారు.

ఫోన్ లో 5వ నంబర్

ఫోన్ లో 5వ నంబర్ ఎమర్జెన్సీ బటన్ గా పని చేస్తుందని, ఎమర్జెన్సీ లొకేషన్ ను షేర్ చేయడం ఈ ఫీచర్ ప్రత్యేకతని ముఖేష్ పేర్కొన్నారు.

రూ. 153కు అన్ లిమిటెడ్ డేటా

4జీ ఫీచర్ ఫోన్ లో నెలకు కేవలం రూ. 153కు అన్ లిమిటెడ్ డేటాను అందిస్తామని, వాయిస్ కాల్స్ ఎన్ని చేసుకున్నా ఉచితమేనని, ఎస్ఎంఎస్ లు కూడా ఉచితమని ముఖేష్ తెలిపారు.

ముందుగా బుక్ చేసుకున్న వారికి

ముందుగా బుక్ చేసుకున్న వారికి ముందుగా అనే ప్రాతిపదికన సెప్టెంబర్ నుంచి ఫోన్లను అందిస్తామని ప్రకటించారు.

అక్టోబరు నుంచి

అక్టోబరు నుంచి జియో కొత్త ఫోన్ల తయారీ ఇండియాలో జరుగుతుందని తెలిపారు. ఇందుకోసం నూతన ప్లాంటు సిద్ధమైందని తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio finally launches 4G feature phone, Jio Cable TV read more at gizzbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot