జియో పుట్‌బాల్ ఆఫర్, కొత్తగా ఉంది కదా,ఆఫర్ ఇంకా కొత్తగా ఉంటుంది !

Written By:

దేశీయ టెలికారం రంగంలో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియో మరో బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. తొలిసారి జియో నెట్‌వర్క్‌ యాక్టివేట్‌ చేసుకునే కొత్త స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లకు ఫుట్‌బాల్‌ ఆఫర్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇతర దిగ్గజాలను సవాల్ చేస్తూ దూసుకొచ్చిన ఈ ఆఫర్లో భారీగా క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. మొత్తం మీద ఈ ఆఫర్‌ కింద ఈ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు 2,200 రూపాయల వరకు ఇన్‌స్టాంట్‌ క్యాష్‌బ్యాక్‌ యూజర్లకు అందివ్వనుంది.

ఆన్ లైన్ లో ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ గుర్తించడం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌కు ..

షియోమి, శాంసంగ్‌, మోటోరోలా, ఆసుస్‌, హువావే, ప్యానాసోనిక్‌, ఎల్‌జీ, నోకియా, మైక్రోమ్యాక్స్‌ వంటి పలు డివైజ్‌లను కొనుగోలు చేసే కస్టమర్లకు జియో ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. అలాగే ఎంపిక చేసిన ఇతర స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్‌కు కూడా ఇది అందుబాటులో ఉంటుంది.

198 రూపాయలతో..

ఈ ఆఫర్‌ కింద ఫోన్‌ యాక్టివేషన్‌ చేయించుకునే సమయంలో జియో యూజర్లు ప్రీపెయిడ్‌ ప్లాన్లు 198 రూపాయలతో లేదా 299 రూపాయలతో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.

44 జియో ఓచర్లు

దీంతో యూజర్లకు 44 జియో ఓచర్లు మైజియో అకౌంట్‌లో క్రెడిట్‌ అవుతాయి. ఈ ఓచర్‌ ఒక్కో దాని విలువ 50 రూపాయలు. ఈ ఓచర్లను తర్వాత రీఛార్జ్‌లలలో వాడుకోవచ్చు. కొత్త, పాత జియో కస్టమర్లందరికీ ఈ ఫుట్‌బాల్‌ ఆఫర్‌ వర్తిస్తుంది.

మార్చి 31 వరకు మాత్రమే..

కాగా మైజియో యాప్‌ ద్వారా మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈ ఆఫర్‌ కింద వచ్చిన ఓచర్లను యూజర్లు సద్వినియోగం చేసుకోకపోతే, 2022 మార్చి 31న ఎక్స్‌పైరి అయిపోతాయి.

వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు

ఈ ఓచర్లను వేరే వారికి బదిలీ చేయడానికి వీలుండదు. ఒక్కసారి మాత్రమే వీటిని రిడీమ్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమ క్యాష్‌బ్యాక్‌ ఓచర్లను మైజియో యాప్‌లో ''మై ఓచర్స్‌' సెక్షన్‌ కింద చూసుకోవచ్చు. ఈ ఆఫర్‌ కూడా కేవలం అర్హత పొందిన డివైజ్‌లలో దేశీయ వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ డివైజ్‌లకు

రెడ్‌మి నోట్‌ 5, రెడ్‌మి నోట్‌ 5 ప్రొ డివైజ్‌లకు ఇప్పటికే జియో తన ఫుట్‌బాల్‌ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది. అదనంగా కోమియో ఎస్‌1 లైట్‌, సీ1 లైట్‌ యూజర్లకు ఈ ఆఫర్‌కు అర్హులే. షియోమి రెడ్‌మి వై1, శాంసంగ్‌ ఆన్‌8, హానర్‌ 9ఐ, బ్లాక్‌బెర్రీ కీవన్‌, మైక్రోమ్యాక్స్‌ భారత్‌1 వంటి డివైజ్‌లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Football Offer Gives Rs. 2,200 Cashback on New Smartphones more news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot