రిలయన్స్ జియో GigaFiber vs బీఎస్ఎన్ఎల్ BBG 1199

రిలయన్స్ జియోకు దీటుగా బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను మార్కెట్లో లాంచ్ చేస్తోంది. తాజాగా ఈ ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BBG 1199 పేరుతో సరికొత్త కాంబో ప్లాన్‌ను రంగంలోకి దింపింది.

రిలయన్స్ జియో GigaFiber vs బీఎస్ఎన్ఎల్  BBG 1199

Read More : LeEco అతిపెద్ద షాపింగ్ ఫెస్టివల్, ప్రతి ఫోన్ పై రూ.10,000 గిఫ్ట్స్

రిలయన్స్ జియో త్వరలో లాంచ్ చేయబోతోన్న GigaFiberకు ధీటుగా ఈ ప్లాన్ ఉంటుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ రెండు ప్లాన్‌ల మధ్య తేడాలను పరిశీలించినట్లయితే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బీఎస్ఎన్ఎల్ BBG 1199

బీఎస్ఎన్ఎల్ BBG 1199 ప్లాన్‌లో భాగంగా యూజర్ రూ.1199 చెల్లించటం ద్వారా నెల మొత్తం డేటా, వాయిస్ కాల్స్ ఇలా అన్ని సర్వీసులను అపరిమితంగా వాడుకోవచ్చు.

దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా

ఈ ఆఫర్‌లో భాగంగా దేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్ చేసుకోవచ్చు. BBG కాంబో ప్లాన్ పేరుతో ప్రకటించిన ఈ ఆఫర్‌లో వినియోగదారులు నెలకు రూ.1199 ఛార్జ్‌తో దేశంలో లోకల్ , ఎస్టీడీ కాల్స్ 24గంటలు ఉచితంగా చేసుకోవచ్చు.

డౌన్‌లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్

బాండ్‌విడ్త్ డౌన్‌లోడ్ స్పీడ్ 2 ఎంబీపీఎస్ కన్నా వేగంగా ఉంటుంది. ఈ ఆఫర్‌ను అన్ని సర్కిళ్లలో అందరూ ఉపయోగించుకోవచ్చు. నెలకి రూ. 1199 ఛార్జ్ చేయబడుతుంది.

ఇదే ప్లాన్ సంవత్సరానికి

నెలకి రూ. 1199 ఛార్జ్ చేయబడుతుంది. ఇదే ప్లాన్ సంవత్సరానికి కావాల్సిన వారు రూ. 13,189 ఛార్జ్‌తో ఉపయోగించుకోవచ్చని BSNL తెలిపింది.

రెండు సంవత్సరాలకు, మూడు సంవత్సరాలకు కూడా

ఇదే ప్లాన్ రెండు సంవత్సరాలకు అయితే రూ. 25179, మూడు సంవత్సరాల కయితే రూ.35970 ఛార్జ్ తో ఉపయోగించుకోవచ్చని BSNL చెబుతోంది. ఈ ప్లాన్‌లో డౌన్‌లోడ్ అలాగే అప్‌లోడ్ అన్‌లిమిటెడ్.

జియో బ్రాడ్‌బాండ్ సేవలు

GigaFiber fibernet service పేరుతో జియో బ్రాడ్‌బాండ్ సర్వీసును రిలయన్స్ త్వరలో లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

రూ.500కే 600 జిబి

జియో బ్రాడ్‌బాండ్ పథకంలో భాగంగా రూ.500కే 600 జిబి వరకు బ్రాడ్‌బాండ్ ప్లాన్ అందించనున్నట్లు తెలుస్తోంది. నెల రోజుల వ్యాలిడితో వినియోగదారులు ఈ ఆఫర్‌ని పొందవచ్చని జియో చెబుతోంది.

1Gbps స్పీడ్‌తో

ఇంటర్నెట్ స్పీడ్ కూడా దాదాపు 1Gbps స్పీడ్‌తో ఉండే అవకాశం. ఈ జియో బ్రాడ్‌బాండ్ సర్వీసుకు సంబంధించి ప్లాన్లు కూడా అదిరిపోయే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది.

నెలకి రూ. 500 ఛార్జ్‌తో

నెలకి రూ. 500 ఛార్జ్‌తో 600 జిబి అలాగే రూ. 500తో రోజుకు 3.5 జిబి వాడుకునే విధంగా ఆఫర్ ఉంది. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తుంది. రూ. 400 రీఛార్జ్‌తో మీరు అన్‌లిమిటెడ్ డేటాను 24 గంటల పాటు వాడుకునే అవకాశం ఉంది.

రూ.1500తో 2000 జీబి వరకు

రూ. 1500తో 2000 జీబి వరకు డేటాను 50Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది. రూ. 2000తో 1000 జీబి వరకు 100Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.  రూ. 4000తో 500 జీబి వరకు 400Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది.

రూ.5500తో 300 జీబి డేటా వరకు

రూ.5500తో 300 జీబి ఫ్రీ డేటా వరకు 600Mbps స్పీడ్ తో పొందవచ్చు. ఇది నెల రోజుల వ్యాలిడిటీతో మీకు లభిస్తోంది. ఇది రూ.6000తో కూడా లభించే అవకాశం ఉంది. దాని స్పీడ్ 800Mbps వరకు ఉంటుందని అంచనా.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Should you go for Reliance Jio GigaFiber or BSNL BBG 1199: Tariff, Data Usage & More Compared. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot