రూ. 500కే జియో ఫైబర్ ప్లాన్, బుకింగ్ ఎలా, ఎప్పుడు, పూర్తి వివరాలు మీకోసం

దేశీయ రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆ రంగంలో ఎన్ని సంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

|

దేశీయ రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఆ రంగంలో ఎన్ని సంచనాలను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ సరికొత్త ఆఫర్లతో ముందుకు దూసుకువెళుతోంది జియో. ఎప్పటికప్పుడు నూతన ప్లాన్లు, ఆఫర్లను ప్రవేశపెడుతూ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంది. దీంతో ఇతర టెలికాం కంపెనీలు కూడా ధరలను తగ్గించక తప్పలేదు. ఇదిలా ఉంటే త్వరలో బ్రాడ్‌బ్యాండ్, డీటీహెచ్ కంపెనీలకు కూడా షాకిచ్చేందుకు జియో సిద్ధమైంది.

వావ్..జియో హ్యాపీ అవర్స్ వచ్చేస్తున్నాయివావ్..జియో హ్యాపీ అవర్స్ వచ్చేస్తున్నాయి

ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్లు

ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్లు

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఆ సంస్థ వార్షిక సమావేశంలో జియో గిగాఫైబర్‌పై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సేవలకు గాను ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

కనీస ప్లాన్ రూ.500

కనీస ప్లాన్ రూ.500

అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చిన నగరంలో ముందుగా జియో గిగాఫైబర్ సేవలను ప్రారంభించనున్నారు. ఇక సేవలకు గాను కనీస ప్లాన్ రూ.500 గా నిర్ణయించినట్లు తెలిసింది. తొలి దశలో 1,100 నగరాల్లో ఈ సేవలు లాంచ్‌ కాబోతున్నాయి.

 

ఆన్‌లైన్‌లోనే ..

ఆన్‌లైన్‌లోనే ..

జియో గిగాఫైబ‌ర్ రిజిస్ట్రేషన్ల‌ను కేవ‌లం ఆన్‌లైన్‌లోనే తీసుకోనున్నార‌ట‌. అది కూడా జియో వెబ్‌సైట్ లేదా మై జియో యాప్‌లోనే ఈ రిజిస్ట్రేష‌న్ల‌ను చేసుకునేందుకు వీలు క‌ల్పిస్తార‌ని తెలిసింది.

 రూ.4500 డిపాజిట్

రూ.4500 డిపాజిట్

జియో ప్రారంభించనున్న గిగాఫైబర్ సేవల ప్లాన్లు ప్రస్తుతం లీకయ్యాయి. ఈ సేవలను పొందేందుకు వినియోగదారులు ముందుగా రూ.4500 డిపాజిట్ చెల్లించాలి. సేవలను వద్దు అనుకున్నప్పుడు ఈ డిపాజిట్‌ను తిరిగిచ్చేస్తారు.

ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్

ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్

ఈ ప్లాన్లలో కనీస ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ ఉండనున్నట్లు తెలుస్తుండగా, గరిష్టంగా 1జీబీపీఎస్ వరకు స్పీడ్‌ను ఇస్తారని సమాచారం.

రోజువారీ డేటా లిమిట్

రోజువారీ డేటా లిమిట్

గిగాఫైబర్ సేవలలో రూ.500, రూ.800, రూ.1000 ప్లాన్లలో నెలవారీ డేటా లిమిట్ కాకుండా రోజువారీ డేటా లిమిట్ ఉంటుందని తెలిసింది. రోజుకు 5జీబీ నుంచి 60 జీబీ డేటా లిమిట్‌తో బ్రాడ్‌బ్యాండ్‌ను ఇస్తారని సమాచారం

 కేబుల్‌ ఆపరేటర్స్‌ నెలకు..

కేబుల్‌ ఆపరేటర్స్‌ నెలకు..

ప్రస్తుతం హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్యాక్స్‌ను ఆఫర్‌ చేస్తున్న కేబుల్‌ ఆపరేటర్స్‌ నెలకు 700 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో 100 జీబీ డేటాను, 100 ఎంబీపీఎస్‌ స్పీడులో అందజేస్తున్నారు. అదనంగా టీవీ సర్వీసులకు ఒక్కో ఇంటికి 250 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నారు.

జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను..

జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను..

జియో కూడా అదేరకమైన ఆఫర్‌ను అంటే 100జీబీ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో వాటికంటే 50 శాతం తక్కువ ధరకే అందజేయబోతుంది.

25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌లో ..

25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌లో ..

కంపెనీ హోమ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల ధరలు ప్రస్తుతమున్న 4జీ మొబైల్‌ డేటా రేట్లకు 25 శాతం నుంచి 30 శాతం డిస్కౌంట్‌లో లభించనున్నాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.

15వ తేదీ నుంచి ప్రారంభం

15వ తేదీ నుంచి ప్రారంభం

జియో గిగాఫైబర్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నప్పటికీ సేవలు మాత్రం నవంబర్‌లోనే అందుబాటులోకి రానున్నాయట. దీపావళి వరకు ఈ సేవలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.

500 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

500 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

జియోగిగాఫైబర్‌ తొలి ప్యాకేజీ రూ.500 నుంచి ప్రారంభమవుతుందట. ఈ ప్లాన్‌ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను 50 ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. అయితే 300 జీబీ ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక, స్పీడ్‌ తగ్గిపోనుందని సమాచారం.

750 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

750 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

తర్వాత ప్లాన్‌ రూ.750గా ఉంటుందని సంబంధిత వర్గాల టాక్‌. ఈ ప్లాన్‌ కింద నెలకు 450 జీబీ అపరిమిత డేటాను 50 ఎంబీపీఎస్‌ స్పీడులో అందించనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్లాన్‌ 30 రోజుల వాలిడిటీలో మార్కెట్‌లోకి వస్తుందని టాక్‌.

999 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

999 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

600జీబీ వరకు అపరిమిత డేటాను రూ.999 ప్లాన్‌పై పొందవచ్చట. దీని స్పీడ్‌ 100 ఎంబీపీఎస్‌ అని తెలుస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 30 రోజులుగా ఉంటుందని సమాచారం.

 1,299 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

1,299 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

ఈ ప్లాన్‌ ఎఫ్‌యూపీ పరిమితి 750 జీబీ. ఈ డేటాను 100 ఎంబీపీఎస్‌ స్పీడులో 30 రోజుల వరకు వాడుకోవచ్చట.

1,599 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

1,599 రూపాయల జియోగిగాఫైబర్‌ ప్లాన్‌ వివరాలు అంచనా

జియోగిగాఫైబర్‌ కింద అందించే హైయస్ట్‌ ప్లాన్‌ ఇదేనట. ఈ ప్లాన్‌ కింద 900 జీబీ డేటాను 150 ఎంబీపీఎస్‌ స్పీడులో పొందవచ్చట. ఈ ప్లాన్‌ వాలిడిటీ 30 రోజులని తెలుస్తోంది. ఎఫ్‌యూపీ పరిమితి అయిపోయాక స్పీడు పడిపోనుందని టాక్‌.

ఇంటర్నెట్‌ను వాడుకుంటూనే

ఇంటర్నెట్‌ను వాడుకుంటూనే

ఇక గిగాఫైబర్ ద్వారా లభించే రూటర్‌తో కస్టమర్లు ఓ వైపు ఇంటర్నెట్‌ను వాడుకుంటూనే మరోవైపు దాంతోపాటే లభించే సెట్ టాప్ బాక్స్ ద్వారా డీటీహెచ్ ప్రసారాలను వీక్షించేందుకు వీలు కలుగుతుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Gigafiber plans might start from Rs. 500: Here is everything you need to know More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X