Just In
- 54 min ago
షియోమీ Mi 10T ఫోన్ పై రూ.3000 తగ్గింపు ! కొనాలంటే ఇదే మంచి అవకాశం.
- 1 hr ago
ఐఫోన్ కన్నా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్కువ ఇష్టపడతానంటున్న బిల్‌గేట్స్
- 3 hrs ago
BSNL నుంచి కొత్తగా FRC మరో ప్లాన్!! రోజుకు 2GB డేటా ప్రయోజనంతో..
- 4 hrs ago
Netflix లో 'డౌన్లోడ్ ఫర్ యూ' కొత్త ఫీచర్‌ను యాక్టివేట్ చేయడం ఎలా?
Don't Miss
- News
54 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ .. హర్యానాలోని కర్నాల్ లో స్కూల్ మూసివేత , సర్కార్ అలెర్ట్
- Movies
జాతిరత్నాల కోసం రంగంలోకి రెబల్ స్టార్ ప్రభాస్
- Lifestyle
వెన్నునొప్పిని తేలికగా తీసుకోకూడదని ఇక్కడ కొన్ని హెచ్చరిక సంకేతాలు ఉన్నాయి!
- Automobiles
భారత్‌కు వస్తున్న కొత్త 2021 సుజుకి హయబుసా; అఫీషియల్ టీజర్ లాంచ్!
- Sports
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో అశ్విన్!
- Finance
భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 50,000 క్రాస్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జియో GigaFiber కనెక్షన్ తీసుకుంటే, మూడు నెలల పాటు అన్నీ ఉచితం
రిలయన్స్ జియో తన గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను అఫీషియల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆగష్టు 15, 2018 నుంచి ఈ రిజిస్ట్రేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ హైస్పీడ్ ఇంటర్నెట్ సర్వీసును వినియోగించుకోవాలనుకుంటోన్న యూజర్లు ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కంపెనీ చెబుతోంది.
టెలికాంకు ఆర్‌కామ్ గుడ్ బై , కొత్త వ్యాపారంలోకి సునామి ఎంట్రీ !

జియ గిగాఫైబర్ కనెక్షన్ తీసుకోవాలంటే..?
జియో గిగాఫైబర్ నెట్‌వర్క్ కోసం రిజిస్టర్ అవ్వాలనుకునే యూజర్లు ముందుగా జియో అఫీషియల్ వెబ్‌సైట్‌లోని డెడికేటెడ్ గిగాఫైబర్ పేజీలోకి వెళ్లాలి. సంబంధిత పేజీలోకి వెళ్లి మీ అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. ఆ తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తరువాత మీరు నమోదు చేసిన వివరాలు ఇంటివా లేక ఆఫీసువా అన్నది టిక్ మార్క్ చేయవల్సి ఉంటుంది. తరువాత ఓపెన్ అయ్యేలో మరో పేజీలో మీ పేరుతో పాటు ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయవల్సి ఉంటుంది. ఈ రెండు వివరాలను ఎంటర్ చేసిన తరువాత జనరేట్ ఓటీపీ బటన్ పై క్లిక్ చేసినట్లయితే కొన్ని అంకెలతో కూడిన ఓటీపీ మీ మొబైల్ నెంబర్‌కు అందుతుంది. ఆ ఓటీపీని సంబంధిత కాలమ్‌లో ఎంటర్ చేసిన తరువాత మీ లొకాలిటీని సెలక్ట్ చేసుకుని సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసినట్లయితే మీ అభ్యర్థన విజయవంతంగా జియో గిగాఫైబర్ విభాగం దృష్టికి వెళుతుంది.

మూడు నెలల పాట ప్రివ్యూ ఆఫర్..
జియో తన గిగాఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్‌కు సంబంధించి ఓ ప్రివ్యూ ఆఫర్‌ను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. గిగాఫైబర్ యూజర్లు ఈ ఉచిత సర్వీసును ఆప్ట్ చేసుకోవటం ద్వారా మూడు నెలల పాటు 300జీబి డేటాను వినియోగించుకునే వీలుంటుంది. ఈ ఆఫర్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

నెలకు 100జీబి చొప్పున 300జీబి ఉచిత డేటా..
జియో గిగాఫైబర్ ప్రివ్యూ ఆఫర్ క్రింద సబ్‌స్ర్కైబర్స్‌కు 300జీబి ఉచిత డేటా అందుబాటులో ఉంటుంది. ఈ మొత్తం డేటాను నెలకు 100 జీబి డేటా చొప్పున మూడు నెలల పాటు వినియోగించుకోవల్సి ఉంటుంది. ఈ ఆఫర్‌లో నెలవారీ క్యాప్‌తో మీకు కేటాయించిన 100జీబి 30 రోజుల కంటే ముందే మీరు వినియోగించేసుకున్నట్లయితే అదనంగా 40జీబి డేటాను మీరు పొందే వీలుంటుంది. ఈ కాంప్లిమెంటరీ డేటా టాపప్‌ను మైజియో యాప్ లేదా జియో.కామ్ ద్వారా పొందే వీలుంటుంది.

1జీబీపీఎస్ వేగంతో డేటా స్పీడ్..
జియో గిగాఫైబర్ ప్రివ్యూ ఆఫర్‌లో భాగంగా 1జీబీపీఎస్ వేగంతో కూడిన డేటా స్పీడ్ యూజర్లకు అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది. ఈ నెట్‌వర్క్‌లో 4కే క్వాలిటీ వీడియోలతో పాటు వర్చువల్ రియాల్టీ గేమ్‌లను కూడా ప్లే చేసుకునే వీలుంటుందని జియో తెలిపింది. జియో గిగాఫైబర్ కనెక్షన్ తీసుకునే వారి వద్ద నుంచి రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ క్రింద రూ.4,500ను జియో వసూలు చేస్తోంది. ఈ అమౌంట్‌ను యూజర్లు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, జియో మనీ ఇంకా పేటీఎమ్ సర్వీసెస్ ద్వారా చెల్లించవచ్చు.

నచ్చకుంటే రీఫండ్..
గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్‌కు సంబంధించి ప్రీ-పెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను రానున్న నెలల్లో జియో అనౌన్స్ చేయబోతోంది. ప్రివ్యూ ఆఫర్ ముగిసిన వెంటనే జియో లాంచ్ చేయబోయే ఏదో ఒక ప్లాన్‌ను గిగాఫైబర్ యూజర్లు సెలక్ట్ చేసుకోవల్సి ఉంటుంది. జియో గిగాఫైబర్ సేవలు నచ్చకపోయినట్లయితే, యూజర్లు వెంటనే తమ కనెక్షన్‌లను టర్మినేట్ చేసుకుని సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి పొందవచ్చని జియో తెలిపింది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190