జియో vs ఎయిర్‌టెల్, రేసులో ఎవరు?

జియో గిగాఫైబర్ పేరుతో మరికొద్ది రోజుల్లో రిలయన్స్ లాంచ్ చేయబోతున్న బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్ నెలకుంది. ఇందుకు కారణం, ఈ సర్వీస్ ఆఫర్ చేయబోతున్న చౌకబారు ఇంటర్నెట్ డేటా ప్లాన్‌లే!.

జియో vs ఎయిర్‌టెల్, రేసులో ఎవరు?

Read More : తెలుగు రాష్ట్రాల్లో జియో సిమ్ హోమ్ డెలివరీ షురూ!

రిలయన్స్ జియో గిగాఫైబర్‌కు పోటీగా ఎయిర్‌టెల్ ఇప్పటికే V-Fiber broadband పేరుతో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ సేవలను మార్కెట్లో అందిస్తోంది. మరోవైపు బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ విభాగంలో ఎప్పటినుంచో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న బీఎస్ఎన్ఎల్ కూడా ఆసక్తికర ప్లాన్‌లను లాంచ్ చేసి మార్కెట్‌ను ఊరించే ప్రయత్నం చేస్తోంది. ఈ మూడు ప్రముఖ నెట్‌వర్క్‌ల మధ్య ఏ విధమైన పోటీ వాతావరణం నెలకుందో ఇప్పుడు చూద్దాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100జీబీపీఎస్ వరకు డేటా స్పీడ్స్

బీఎస్ఎన్ఎల్ తన బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌లతో అందిస్తోన్న డేటా స్పీడ్‌లతో పోల్చి చూసినట్లయితే రిలయన్స్ జియో గిగాఫైబర్ అలానే ఎయిర్‌టెల్ వీ-ఫైబర్ టెక్నాలజీలు ఆఫర్ చేయబోయే ఇంటర్నెట్ స్పీడ్స్ మరింత ఎక్కువుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు ప్రయివేటు టెలికామ్ ఆపరేటర్స్ అందించబోయే డేటా స్పీడ్స్ 100జీబీపీఎస్ వరకు నమోదు కావొచ్చని తెలుస్తోంది.

రూ.500కే జియో గిగాఫైబర్

అనధికారికంగా తెలుస్తోన్న సమచారం ప్రకారం రిలయన్స్ జియో ఆఫర్ చేయబోయే గిగాఫైబర్ ప్లాన్న్ రూ.500 నుంచి రూ.5000 వరకు వివిధ టారిఫ్‌లలో అందుబాటలో ఉంటాయని తెలుస్తోంది. 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లలో భాగంగా 500 నుంచి 1000 జీబి వరకు యూజర్లు పొందవచ్చు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రేసులో బీఎస్ఎన్ఎల్

టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దిగిరాక తప్పలేదు. ఎయిర్‌టెల్, జియోలతో పోటీపడే క్రమంలో బీబీ249, బీబీఎల్ 1199 వంటి ఆసక్తికర ప్లాన్‌లను బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే రంగంలోకి దింపింది. డీసెంట్ డేటా స్పీడ్‌లతో ఈ ప్లాన్స్ ఆకట్టుకుంటున్నాయి.

రిలయన్స్ జియో వెలకమ్ ఆఫర్‌

తన వెలకమ్ ఆఫర్‌తో మార్కెట్లో మరింత పాపులర్ అయిన రిలయన్స్ జియో అదే తరహా ఆఫర్‌ను గిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు విస్తరించే అవకాశముందని తెలుస్తోంది. ఇదే సమయంలో ఎయిర్‌టెల్ కూడా తన వీ-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ను 30 రోజుల పాటు

ఉచితంగా అందించే యోచనలో ఉన్నట్లు తెులస్తోంది.

 

లేటెస్ట్ ఫైబర్ టెక్నాలజీకి

జియో గిగాఫైబర్ అలానే ఎయిర్‌టెల్ వీ-ఫైబర్‌లతో పోటీపడే క్రమంలో బీఎస్ఎన్ఎల్ త్వరలోనే లేటెస్ట్ ఫైబర్ టెక్నాలజీకి అడాప్డ్ కాబోతున్నట్లు సమాచారం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio GigaFiber vs Airtel V-Fiber vs BSNL Broadband: And the Winner is..? Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot