జియో గిగిఫైబర్ vs Airtel V-Fiber, గెలిచేదెవరు ?
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో ఇప్పుడు మరొక సంచలనానికి తెర తీయబోతోంది. ఇందులో భాగంగానే ఆగస్టు 12న జియో గిగాఫైబర్ సేవలు ప్రారంభమవుతాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆగస్టు 12వ తేదీన జరగనున్న రిలయన్స్ ఏజీఎం (వార్షిక సర్వసభ్య సమావేశం)లోనే జియో గిగాఫైబర్ సేవలను ఆ సంస్థ చైర్మన్ ముకేష్ అంబానీ ప్రారంభిస్తారని తెలుస్తోంది.

జియో గిగాపైబర్ సేవలను ఇప్పటికే పలు నగరాలు, పట్టణాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్న జియో అందులో విజయవంతమైందని ఇది వరకే ముకేష్ అంబానీ తెలిపారు. దీంతో ఆగస్టు 12నే ఆ సేవలు కచ్చితంగా ప్రారంభమవుతాయని సమాచారం. ఈ నేపధ్యంలో ఇప్పుడు అన్ని టెల్కోలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఎయిర్‌టెల్ వి ఫైబర్ జియోని గట్టిగా ఢీకొట్టేందుకు కసరత్తు చేస్తొంది. ఈ శీర్షికలో భాగంగా Airtel V-Fiber ఇప్పుడు అందిస్తున్న ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

Airtel V-Fiber Data Plans, Speeds
ఎయిర్ టెల్ Airtel V-ఫైబర్ డేటా ప్లాన్స్ 4 నెలల కాల పరిమితిపై అందిస్తోంది. రూ.799తో బేస్ ప్లాన్ డేటాతో 40Mbps స్పీడ్‌తో పాటు Unlimited లోకల్, STD కాల్స్ , 100GB బ్రాడ్ బ్యాండ్ డేటాను 200GB బోనస్ డేటాతో 6 నెలల వరకు అందిస్తోంది. ఇక రూ.1,099 డేటా ప్టాన్ యాక్టివేట్ చేసుకుంటే Unlimited లోకల్, STD కాల్స్, 100Mbps స్పీడ్‌తో 300GB బ్రాడ్ బ్యాండ్ డేటా 6 నెలల వరకు 500GB బోనస్ డేటా అందిస్తోంది. రూ.1,599 డేటా ప్లాన్‌తో Airtel V-Fiber యూజర్లు అన్ లిమిటెడ్ లోకల్, STD కాల్స్ 6 నెలల వరకు 300Mbps స్పీడ్‌తో 600GB వరకు బ్రాడ్ బ్యాండ్ డేటా.. 1000GB బోనస్ డేటా ను పొందవచ్చు.

Airtel V-Fiber vs Jio GigaFiber
రిలయన్స్ జియో ఇప్పటివరకూ Jio GigaFiber సర్వీసులో అందించే డేటా ప్లాన్స్ అధికారికంగా ఏవీ ప్రకటించలేదు. రిపోర్ట్స్ ప్రకారం.. గిగాఫైబర్ డేటా ప్లాన్స్ Airtel V-Fiber కంటే చాలా తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం.. జియో GigaFiber Preview Offer కింద యూజర్లకు 100Mpbs స్పీడ్ డేటా అందిస్తోంది. జియో ప్రీమియం యాప్స్ ఈజీగా ఉచితంగా యూజర్లు యాక్సస్ చేసుకునేలా ఉంది. Triple Play Plan కింద యూజర్లందరూ DTH-బ్రాడ్ బ్యాండ్-TV Comboను అందించనుంది. DTH-బ్రాడ్ బ్యాండ్-TV Comboను రూ.600లకే నెలవారీ సబ్ స్ర్కిప్షన్ పొందవచ్చు. అయితే కంపెనీ అధికారికంగా ప్రకటిస్తేనే వీటిపై క్లారిటీ వస్తుంది.

జియో గిగాఫైబర్
జియో గిగాఫైబర్ సేవలకు గాను నెలకు రూ.600 చెల్లిస్తే ఏకంగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్, టెలిఫోన్, కేబుల్ టీవీ సదుపాయాలు మూడింటినీ పొందవచ్చని సమాచారం. ఈ క్రమంలో మొదట రూ.4500 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని తెలిసింది. అయితే ఈ వివరాలపై జియో ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో ఆ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Airtel Thanks Benefits
Airtel Thanks Benefits పేరుతో కంపెనీ ఓ ప్రొగ్రామ్ లాంచ్ చేసింది. V-Fiber హోం బ్రాడ్ బ్యాండ్ ప్లాన్ యూజర్లు రూ.1099 లేదా ఆపై ఈ ఆఫర్ అందిస్తోంది. ఇందులో ఉచితంగా 3 నెలల పాటు Netflix సబ్ స్ర్కిప్షన్ , ఏడాది వరకు Amazon Prime అందిస్తోంది. అలాగే ZEE5 స్రీమింగ్ సర్వీసుతో పాటు Airtel TV Premiumతో Full యాక్సస్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








