అన్నాదమ్ముళ్లు ఏకమయ్యారు..జియోతో ఏం చేయబోతున్నారు ..?

By Hazarath
|

సంచలనాలతో దూసుకుపోతున్న జియో అంబాని ఫ్యామిలీలో కూడా ఓ సరికొత్త సంచలనానికి తెరలేపింది. ఎప్పడో విడిపోయిన అన్నాదమ్ములిద్దరినీ జియో ఒకగూటికి చేర్చింది. తమ్ముడు ముఖేష్ అంబాని జియోతో చేతులు కలిపాడు. ఇక నుంచి ఇద్దరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఇద్దరూ కలిసి ధీరూభాయ్ అంబాని కలలు సాకారం చేస్తామని అందుకోసం ఇద్దరం కలిసిపోయామని అనిల్ అంబాని కంపెనీ వార్షిక సభ్య సమావేశంలో తెలిపి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అన్నదమ్ముల కలయికతో టెలికం ఇప్పుడు కొత్త రంగును పులుముకోనుంది.

 

ఎవరికీ తెలియని జియో పాత ప్రస్థానం..షాకింగ్ నిజాలు

అన్నతో తమ్ముడు జట్టు

అన్నతో తమ్ముడు జట్టు

అన్న ముకేశ్ అంబానీ రిల‌యెన్స్ జియోతో త‌మ్ముడు రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ అధినేత అనిల్ అంబానీ చేతులు క‌లిపారు . ముంబైలోని బిర్లా మాతుశ్రీలో రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ కంపెనీ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఆయ‌న త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించారు.

అనిల్ అంబానీ త‌న కొడుకు జై అన్‌మోల్‌ను

అనిల్ అంబానీ త‌న కొడుకు జై అన్‌మోల్‌ను

ఈ సంద‌ర్భంగా అనిల్ అంబానీ త‌న కొడుకు జై అన్‌మోల్‌ను ప‌రిచ‌యం చేశారు.అన్‌మోల్ కంపెనీకి అదృష్టాన్ని తీసుకొచ్చాడ‌ని, అది కొన‌సాగాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

జియోతో చేతులు కలుపుతున్నామని
 

జియోతో చేతులు కలుపుతున్నామని

ఈ సందర్భంగా జియోతో చేతులు కలుపుతున్నామని చెప్పారు. ఇక అన్న‌ద‌మ్ములు ఇద్ద‌రూ క‌లిసి ధీరూభాయ్ అంబానీ క‌ల‌ల‌ను సాకారం చేయ‌బోతున్నార‌ని అనిల్ చెప్ప‌డంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆయ‌న ఈ మాట అన‌గానే స‌మావేశంలోని స‌భ్యులంతా లేచి నిల‌బ‌డి చ‌ప్ప‌ట్ల‌తో అభినందించారు.

2జీ, 3జీ, 4జీ సేవ‌ల‌కు

2జీ, 3జీ, 4జీ సేవ‌ల‌కు

త‌మ‌కు ఇప్ప‌టికే 2జీ, 3జీ, 4జీ సేవ‌ల‌కు కావాల్సిన స్పెక్ట్ర‌మ్ ఉంద‌ని, అయితే ఆచ‌ర‌ణాత్మ‌క ప్ర‌యోజ‌నాల కోసం జియోతో చేతులు క‌లిపి వారు త‌మ స్పెక్ట్ర‌మ్ వాడుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నామ‌ని అనిల్ వెల్ల‌డించారు.

4జీ సేవ‌లు ప్రారంభించిన 90 రోజుల్లోనే

4జీ సేవ‌లు ప్రారంభించిన 90 రోజుల్లోనే

త‌మ కంపెనీ 4జీ సేవ‌లు ప్రారంభించిన 90 రోజుల్లోనే 10 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్లు స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నార‌ని చెప్పారు. ఇది ఇంకా విస్తరణ దిశగా సాగుతుందని టాప్ లోకి దూసుకెళ్లేందుకు కంపెనీ కృషి చేస్తుందని చెప్పారు.

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు త‌మ స్పెక్ట్ర‌మ్‌ను

ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు త‌మ స్పెక్ట్ర‌మ్‌ను

అయితే రిలయన్స్ కమ్యూనికేషన్స్ కే స్పెక్ట్ర‌మ్ ఉండటంతో ఇప్పుడీ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు త‌మ స్పెక్ట్ర‌మ్‌ను క‌లిసి వాడుకోబోతున్నారు. దీంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కు కూడా బాగా కలిసి రానుంది.

రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ ఖ‌ర్చులు భారీగా

రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ ఖ‌ర్చులు భారీగా

జియోతో చేతులు క‌ల‌ప‌డం వ‌ల్ల రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్ ఖ‌ర్చులు భారీగా త‌గ్గ‌నున్నాయి. అయితే ఇదే సమయంలో ఇత‌ర ఆప‌రేట‌ర్లు స్పెక్ట్ర‌మ్ కోసం భారీగా ఖ‌ర్చు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఎయిర్‌సెల్‌ను విలీనం చేసుకున్న రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్‌

ఎయిర్‌సెల్‌ను విలీనం చేసుకున్న రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్‌

ఇప్ప‌టికే ఎయిర్‌సెల్‌ను విలీనం చేసుకున్న రిల‌యెన్స్ క‌మ్యూనికేష‌న్స్‌.. ఇప్పుడు జియోతో చేతులు క‌ల‌ప‌డంతో భార‌త్‌లోని 12 స‌ర్కిల్స్‌లో టాప్ ఆప‌రేట‌ర్‌గా ఎదగనుంది.

ధీరూభాయి అంబాని మరణం తర్వాత

ధీరూభాయి అంబాని మరణం తర్వాత

ధీరూభాయి అంబాని మరణం తర్వాత 2005లో అన్నదమ్ములిద్దరూ విడిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముఖేష్ అంబాని ఆయిల్ అలాగే గ్యాస్ పరిశ్రమను తీసుకోగా అనిల్ అంబాని టెలికంతో పాటు రిలయన్స్ ఫైనాన్సియల్ అలాగే ఎలక్ట్రిసిటీని తీసుకున్నారు.

విడిపోయే సమయంలో ఇద్దరూ అన్నదమ్ములు

విడిపోయే సమయంలో ఇద్దరూ అన్నదమ్ములు

అయితే విడిపోయే సమయంలో ఇద్దరూ అన్నదమ్ములు ఓ ఒప్పందాన్ని రాసుకున్నారు. ఒకరి వ్యాపారంలోకి మరొకరు తలదూర్చరాదనే నిబంధనతో ఆ ఒప్పదం జరిగింది.

నాలుగేళ్ళపాటు..

నాలుగేళ్ళపాటు..

నాలుగేళ్ళపాటు పరస్పరం పోటీ పడకూడదన్న ఒప్పందాన్నిఈ ఒప్పందాన్ని 2010 మే నెలలో ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీ రద్దుచేసుకున్నారు. దీంతో అనిల్ అంబాని టెలికామ్ వ్యాపారంలో జియోతో ప్రవేశించేందుకు మార్గం సుగమమైంది.

పెట్టుబడులు

పెట్టుబడులు

వెనువెంటనే 2010 జూన్ లో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ అండ్ వైర్లెస్ యాక్సెస్ (బిడబ్ల్యుఎ) వేలాన్ని ఇన్ఫోటెల్ బ్రాడ్ బాండ్ సర్వీసెస్ పేరుతో అంబాన్ని దక్కించుకోవడం దానిలో పెట్టుబడులు పెట్టి ఆ పేరును జియోగా మార్చిన విషయం అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం కోసం..

మరింత సమాచారం కోసం..

క్లిక్ చేయండి క్లిక్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio helps Ambani brothers find a common connection read more telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X