జియో ఇచ్చిన ఊపుతో 15వ ర్యాంక్‌కు ఇండియా

మెరుగైన 4జీ నెట్‌వర్క్‌ను అందిస్తోన్న ప్రపంచదేశాల జాబితాలో ఇండియాకు 15వ ర్యాంకు లభించింది. ఇందుకు, రిలయన్స్ జియో 4జీ నెట్‌వర్క్ ప్రధానంగా దోహదపడిందని లండన్‌కు చెందిన వైర్‌లెస్ కవరేజస్ మ్యాపింగ్ కంపెనీ ఓపెన్ సిగ్నల్ వెల్లడించింది. ఈ సంస్థ 78 దేశాలకు చెందిన స్మార్ట్‌ఫోన్ యూజర్ల వద్ద నుంచి డేటాను సేకరించి విశ్లేషణ జరిపింది.

జియో ఇచ్చిన ఊపుతో 15వ ర్యాంక్‌కు ఇండియా

ఇండియాలో ఒక్క రిలయన్స్ జియో మాత్రమే 4G VoLTE నెట్‌వర్క్‌ను ఆఫర్ చేస్తుంది. దేశవ్యాప్తంగా జియోకు 10.89 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఇదే సమయంలో ఇతర టెల్కోలైన ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు 2జీ,3జీ, 4జీ డేటాను మిక్స్ చేసి అందిస్తున్నాయి.

జియో ఇచ్చిన ఊపుతో 15వ ర్యాంక్‌కు ఇండియా

ఓపెన్ సిగ్నల్ పోస్ట్ చేసిన స్టేట్ ఆఫ్ ఎల్టీఈ రిపోర్ట్ ప్రకారం 2016 3వ క్వార్టర్ నాటికి, భారత్‌లో 71.6 శాతంగా 4జీ నెట్‌వర్క్ సపోర్ట్ 2017 మొదటి క్వార్టర్ నాటికి 81.6 శాతానికి చేరుకుంది. భారత్‌లో 4జీ నెట్‌వర్క్ వినియోగం గణనీయంగా పెరిగినప్పటికి 4జీ డౌన్‌లోడ్ స్పీడ్స్ మాత్రం చాలా తక్కువుగా ఉన్నాయని స్టేట్ ఆఫ్ ఎల్టీఈ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఈ రిపోర్ట్‌లో వెల్లడైన గణంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 4జీ డౌన్‌లోడ్ స్పీడ్ సగటున 5.1ఎంబీపీఎస్‌గా నమోదైంది.

English summary
Reliance Jio Helps India Reach 15th Rank in 4G Availability Globally, Says OpenSignal. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot