జియోలో 80 వేల ఉద్యోగాలు, ఈ కోర్సులు చదివిన వారికే అవకాశం

|

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన ముఖేష్ అంబానీ జియో ఏ ఒక్క రంగాన్ని వదలడం లేదు. ఇప్పటికే టెలికాం రంగంలో దిగ్గజాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న జియో ముందు ముందు బ్రాడ్ బ్యాండ్ రంగంలో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. అత్యంత తక్కువ ధరకే సేవలను అందించడం ద్వారా మార్కెట్లో పాగా వేయాలనుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరింతమంది ఉద్యోగులను నియమించుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ విషయాన్ని Mint రిపోర్ట్ చేసింది. కంపెనీ విస్తరణలో భాగంగా జియో ఈ ఉద్యోగ నియామకాలను చేపడుతోంది.

 

పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా ?పెట్రోల్,డీజిల్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటున్నారా ?

75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను..

75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను..

ముఖేష్‌ అంబానీకి చెందిన టెలికాం వెంచర్‌ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ భారీగా ఉద్యోగాల నియామకాలకు తెరతీసింది. ఈ ఏడాది దాదాపు 75 వేల నుంచి 80 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని రిలయన్స్‌ జియో ప్లాన్‌ చేస్తోంది.

కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా

కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా

కంపెనీ విస్తరణ ప్రక్రియలో భాగంగా ఈ నియామకాలను జియో చేపడుతోందని తెలుస్తోంది. ఈ నియామకాలతో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో నిపుణులైన ప్రొఫిషనల్స్‌ను జియో నియమించుకోవడం ప్రారంభించిందని మింట్ తెలియజేసింది.

 బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ..
 

బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ..

జియో నియమించుకునే ఈ ఏఐ టీమ్‌ ఆకాశ్‌ అంబానీ నేతృత్వంలో పనిచేయనున్నారని మింట్‌ రిపోర్టు చేసింది. ఈ ఏఐ టీమ్‌ను నిర్మించడానికి జియో కొంతమంది సీనియర్‌ అధికారులను నియమించిందని, బెంగళూరు లేదా హైదరాబాద్‌లో ఈ టీమ్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తుందని రిపోర్ట్ తెలిపింది.

టీమ్‌పై ఎక్కువ ఆసక్తి ..

టీమ్‌పై ఎక్కువ ఆసక్తి ..

ఆకాశ్‌ అంబానీ ఈ టీమ్‌పై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయన తన భుజాలపై వేసుకున్నారని జియో అధికారులు చెప్పినట్టు రిపోర్టు కోడ్‌ చేసింది.

మిషన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై..

మిషన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై..

ఏఐతో పాటు బెంగళూరులో మిగత నియామకాల ప్రక్రియను కూడా జియో ప్రారంభించింది. మిషన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై పనిచేసే వారిని కంపెనీ తీసుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపారు.

1,57,000 మంది ఉద్యోగులు

1,57,000 మంది ఉద్యోగులు

ఇప్పటి వరకు కంపెనీలో 1,57,000 మంది ఉద్యోగులున్నారని, మరో 75 వేల నుంచి 80 వేల మందిని నియమించుకోనున్నామని జియో చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్సస్‌ ఆఫీసర్‌ సంజయ్‌ జాగ్‌ కూడా తెలిపారు.

6 వేల కాలేజీలతో భాగస్వామ్యం

6 వేల కాలేజీలతో భాగస్వామ్యం

కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా 6 వేల కాలేజీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని, దీనిలో టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూషన్లు కూడా ఉన్నట్టు జాగ్‌ చెప్పారు. ‘రిలయన్స్‌ రెడీ'అనే దాని కోసం కొన్ని కోర్సులను కూడా ఈ కాలేజీలు ఆఫర్‌ చేస్తున్నాయని తెలిపారు.

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సహకారంతో..

సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సహకారంతో..

ప్రస్తుతం సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ సహకారంతో కూడా నియామకాలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. రిఫెరల్స్‌ ద్వారా 60 శాతం నుంచి 70 శాతం నియమిస్తున్నామని, తమ రిక్రూట్‌మెంట్‌ ప్లాన్‌లో కాలేజీలు, ఎంప్లాయీ రిఫెరల్స్‌ ప్రధాన భాగాలని జాగ్‌ చెప్పారు.

Best Mobiles in India

English summary
Reliance Jio hiring AI team under Akash Ambani, report says More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X