భారీగా తగ్గిన జియో కొత్త యూజర్లు

రిలయన్స్ జియో ఉచిత ఆఫర్లు నిలిచిపోయిన నాటి నుంచి ఆ నెట్‌వర్క్‌లో చేరుతోన్న వారి సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. ఏప్రిల్ 2017కు గాను కేవలం 3.9 మిలియన్ల మంది కస్టమర్లు మాత్రమే కొత్తగా జాయిన్ అయినట్లు టెలికమ్ రెగ్యులేరటర్ అధారిటీ ఆఫ్ ఇండియా లెక్కలు చెబుతున్నాయి.

భారీగా తగ్గిన జియో కొత్త యూజర్లు

అయితే, ఇదే నెలలో ఇతర నెట్‌వర్క్‌లకు లభించిన కొత్త చందాదారులతో పోలిస్తే రిలయన్స్ టెలికామ్ నెట్‌వర్క్‌కు లభించిన చందాదారుల సంఖ్య ఎక్కువని తెలుస్తోంది. ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ రిపోర్ట్ ప్రకారం, రిలయన్ జియో నెట్‌వర్క్‌కు మార్చి 2017లో 6 మిలియన్ల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. అయితే ఏప్రిల్‌లో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా తగ్గింది. తమ నెట్‌వర్క్‌ను కేవలం 6 నెలల వ్యవధిలో 10 కోట్ల మంది subscribe చేసుకున్నట్లు రిలయన్స్ జియో ఫిబ్రవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
Reliance Jio hits lowest monthly subscriptions ever, adds 3.9 million customers in April 2017. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting