జియో యూజర్లకు స్వాతంత్ర్య దినోత్సవ బంపర్ ఆఫర్!! ఉచితంగా 75GB డేటా...

|

భారతదేశంలోని టెలికాం రంగంలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను ప్రకటించింది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. అత్యంత ప్రజాదరణ పొందిన దీర్ఘకాలిక ప్రీపెయిడ్ ప్లాన్‌లలోని ఒకదానితో 75GB అదనపు డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా విడిగా రూ.2,250 విలువైన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

 

జియో యొక్క స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్

జియో సంస్థ ఈ ఆఫర్‌ను ప్రకటించింది మరియు ఈ ఆఫర్ ఎంతకాలం కొనసాగుతుందనే దాని గురించి సరైన సమాచారం అందుబాటులో లేదు. ఈ సంవత్సరం జియో యొక్క స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ రూ.2999 లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో అందిస్తున్నది. ఈ ప్లాన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో 2022 స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో 2022 స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ పూర్తి వివరాలు

రిలయన్స్ జియో టెలికాం సంస్థ రూ.2999 ధర వద్ద అందించే లాంగ్ టర్మ్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2022 ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజుల చెల్లుబాటు కాలానికి 2.5GB రోజువారీ డేటాను పొందుతారు. వీటితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌తో వినియోగదారులు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకి 100 SMS ప్రయోజనాలు పొందుతారు. రోజువారీ డేటా వినియోగం తర్వాత వినియోగదారుల 64 Kbps వేగంతో డేటాను యాక్సిస్ చేయడానికి అనుమతిని ఇస్తుంది.

జియో రూ.2999 ప్లాన్ స్వాతంత్ర్య దినోత్సవ అదనపు ప్రయోజనాలు
 

జియో రూ.2999 ప్లాన్ స్వాతంత్ర్య దినోత్సవ అదనపు ప్రయోజనాలు

రూ.2999 ధర వద్ద లభించే జియో లాంగ్ టర్న్ ప్లాన్ యొక్క అదనపు ప్రయోజనాలలో జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ మరియు Disney+ Hotstar మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లు ఒక సంవత్సరం పాటు ఉన్నాయి. అలాగే స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ విషయానికి వస్తే వినియోగదారులు ఈ ప్లాన్‌తో రూ.750 విలువైన 75GB డేటాను అదనంగా ఉచితంగా పొందుతారు. అంతేకాకుండా రూ.2,250 విలువైన ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. వీటిలో Ajio(రూ.750 డిస్కౌంట్), నెట్‌మెడ్స్ (రూ. 750 డిస్కౌంట్) మరియు Ixigo (రూ. 750 డిస్కౌంట్) వంటివి ఉన్నాయి.

జియోఫైబర్ 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ 30 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

జియోఫైబర్ తన యొక్క వినియోగదారులకు ఇంటర్నెట్ సేవలను ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ మోడ్‌లలో అందిస్తుంది. మీరు తక్కువ మొత్తంలో ఖర్చు చేసి బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో ఉచితంగా OTT యాక్సెస్‌ని పొందాలనుకుంటే కనుక ఈ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు. ఇందులో మొదటిది రూ.1797 ధర వద్ద లభిస్తుంది. దీనికి GST కూడా ఉంటుంది అని గమనించండి. ఇది మూడు నెలల చెల్లుబాటుతో లభిస్తుంది. ఈ పోస్ట్‌పెయిడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 30 Mbps వేగంతో నెలకు 3.3TB ఇంటర్నెట్ డేటాను అందిస్తుంది. దీనితో పాటుగా డిస్నీ+ హాట్‌స్టార్, ZEE5, వూట్ సెలెక్ట్, వూట్ కిడ్స్, సన్‌ఎన్‌ఎక్స్‌టి, హోయిచోయ్, డిస్కవరీ+ లతో సహా 14 OTT యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్ ను అందిస్తుంది. వినియోగదారులు 550+ కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను కూడా అందిస్తుంది. అదనంగా కంపెనీ జియో STBని కూడా ఉచితంగా కూడా అందిస్తుంది. జియోఫైబర్ వినియోగదారులు రూ.1797 మొత్తం కూడా అధికం అని భావిస్తే కనుక దీని కంటే కొద్దిగా తక్కువ ధర వద్ద లభించే ఇలాంటి 30 Mbps ప్లాన్‌లను కొనుగోలు చేయవచ్చు. రూ.1497 + GST ధర వద్ద లభించే ప్లాన్‌తో నెలకు 3.3TB డేటాను 30 Mbps వేగంతో పాటుగా 6 OTT యాప్‌లు మరియు మూడు నెలల పాటు 400+ లైవ్ టీవీ ఛానెల్‌ల ప్రయోజనాలను పొందవచ్చు. డేటా పరిమితి ఈ ప్లాన్‌కు కూడా వర్తిస్తుంది. ఆ తర్వాత రూ.1197 + GST ధర వద్ద మూడు నెలల చెల్లుబాటు కాలానికి లభించే మరో 30 Mbps ప్లాన్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌కి సంబంధించిన నిబంధనలు మరియు షరతులు పైన పేర్కొన్న వాటికి సమానంగా ఉంటాయి. కానీ వినియోగదారులకు ఎటువంటి OTT ప్రయోజనాలు ఉండవు అని గుర్తుంచుకోవాలి.

Best Mobiles in India

English summary
Reliance Jio Independence Day Offer: Rs.2999 Plan Offers 75GB Extra Data and Rs.3000 Other Benefits

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X