Home
News

జియో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లపై పూర్తి సమాచారం మీకోసం

By Gizbot Bureau

దేశీయ టెలికాం రంగంలో సంచలనాల మోత మోగించిన రిలయన్స్ జియో యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను ప్రకటిస్తూ పోతోంది. దేశీయ టెలికాం మార్కెట్లో డేటా సంచలనంతో ఓ ఊపు ఊపిన రిలయన్స్ జియో అదే స్థాయిలో అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్లను అత్యంత తక్కువ ధరకే అందిస్తోంది.

Reliance Jio international roaming plans

ఇంకా చెప్పాలంటే లోకల్ రీఛార్జ్ ప్లాన్లు మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా రోమింగ్ ప్లాన్లపై జియో అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అంతర్జాతీయంగా జియో యూజర్ల కోసం రెండు రకాల రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అన్ లిమిటెడ్ ప్యాక్స్ (20 దేశాల్లో వ్యాలీడ్) గ్లోబల్ ప్యాక్స్ (170 దేశాల్లో వర్తింపు) రీఛార్జ్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. జియో మొత్తం నాలుగు ఇంటర్నేషనల్ రోమింగ్ ప్లాన్లను అందిస్తోంది. ఆ పాన్లు ఏంటో ఓ సారి చూద్దాం.

jio.comలో చెక్ చేసుకోండి

jio.comలో చెక్ చేసుకోండి

ఈ రీఛార్జ్ ప్లాన్లు అన్నీ జియో వెబ్ సైట్ అయిన jio.com అందుబాటులో ఉన్నాయి. జియో అందించే రోమింగ్ రీఛార్జ్ ప్లాన్లు జెక్ రిపబ్లిక్, జర్మనీ, గ్రీస్, హంగారీ, ఐర్లాండ్, ఇటలీ, మలేషియా, నెదార్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పైయిన్స్, పోర్చుగల్, రోమానియా, సింగపూర్, స్పెయిన్, శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూనైటెడ్ కింగ్ డమ్, యూనైటెడ్ స్టేట్స్ అన్ లిమిటెడ్ ప్యాక్లు అందుబాటులో ఉన్నాయి.

రూ. 575 రీఛార్జ్ ప్లాన్ :

రూ. 575 రీఛార్జ్ ప్లాన్ :

ఈ ప్లాన్ కింద జియో కస్టమర్లు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ హైస్పీడ్ డేటా రోజుకు 250 MB వరకు పొందవచ్చు. ఒక రోజులో ఈ అన్ లిమిటెడ్ డేటా పరిమితి దాటితే 64kbps కు పడిపోతుంది. అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు జియో యూజర్లు.. 100 నిమిషాల ఔట్ గోయింగ్ కాల్స్ కూడా పొందవచ్చు. ఉచితంగా ఇన్ కమింగ్ కాల్స్, రోజుకు 100 SMS పొందవచ్చు. జియో www.jio.com వెబ్ సైట్లో లాగిన్ అయి ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు.

రూ.2, 875 రీఛార్జ్ ప్లాన్ :

రూ.2, 875 రీఛార్జ్ ప్లాన్ :

జియో యూజర్లు రూ.2,875 రీఛార్జ్ ప్లాన్ యాక్టివేట్ చేసుకుంటే హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా రోజుకు 250MB వరకు పొందవచ్చు. డేటా లిమిట్ దాటితే రోజులో అన్ లిమిటెడ్ డేటా స్పీడ్ 64kbps కు పడిపోతుంది. 100 నిమిషాలు ఔట్ గోయింగ్ కాల్స్, ఉచితంగా ఇన్ కమింగ్ కాల్స్ పొందవచ్చు. 100 SMS లు కూడా ఏడు రోజుల పాటు పొందవచ్చు.

రూ.5,751 రీఛార్జ్ ప్లాన్ :

రూ.5,751 రీఛార్జ్ ప్లాన్ :

ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకునే యూజర్లు 1500 నిమిషాలు ఔట్ గోయింగ్ వాయిస్ కాల్స్, ఉచితంగా ఇన్ కమింగ్ కాల్స్ 30 రోజుల కాలపరిమితిపై పొందవచ్చు. ఈ ప్లాన్ పై 5GB హైస్పీడ్ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. 30 రోజుల పాటు 1500 SMS లు పొందవచ్చు.

గ్లోబల్ ప్యాక్స్ :

గ్లోబల్ ప్యాక్స్ :

రిలయన్స్ జియో అందించే ఆఫర్లలో గ్లోబల్ ప్లాన్స్ ఒకటి. ఈ ప్లాన్ కావాలంటే యూజర్లు రూ. 1,101 తో రీఛార్జ్ చేసుకోవచ్చు. 170 దేశాల్లో ఈ ప్లాన్ వ్యాలీడ్ అవుతుంది. ఈ ప్లాన్ కింద.. వాయిస్ కాల్స్ కు నిమిషానికి రూ.2 ఛార్జ్ అవుతుంది. అలాగే MB డేటాకు రూ.2, SMSలపై కూడా యూజర్ల నుంచి జియో రూ.2 ఛార్జ్ చేస్తుంది.

Pay-as-you-go-plan

ఇతర టెల్కోల మాదిరిగానే జియో కూడా ఈ ప్లాన్ అందిస్తోంది. పై ప్లాన్లు వద్దనుకున్న వారు ఈ ప్లాన్ లోకి మారవచ్చు. ఈ ప్లాన్ ప్రకారం వాయిస్ కాల్స్ నిమిషానికి రెండు రూపాయలు, ఎస్మెమ్మెస్ ఛార్జి రెండు రూపాయలు, డేటా అయితే ఎంబికి రెండు రూపాయల చొప్పున చార్జి చేయబడతాయి. అవుట్ గోయింగ్ కాల్స్ నిమిషానికి రూ.100 చొప్పున చార్జ్ చేయబడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio international roaming plans: A look at prepaid and postpaid packs, voice and data benefits more News at gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X