JioPhone వార్షిక ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేయండి...

|

ఇండియాలోని టెలికాం సంస్థలలో ఎక్కువ మంది వినియోగదారులను కలిగిన రిలయన్స్ జియో ఇటీవల తన జియోఫోన్ వినియోగదారుల కోసం కొత్తగా మూడు ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. జియో సంస్థ ఇప్పటికే ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లను కలిగి ఉన్నప్పటికీ ఇవి కొత్తగా 336 రోజుల చెల్లుబాటుతో వార్షిక ప్లాన్‌ల కింద ప్రవేశపెట్టింది. ఈ మూడు కొత్త ప్లాన్‌ల యొక్క ధరలు వరుసగా రూ.1,001, రూ .1,301 మరియు రూ.1,501 గా ఉన్నాయి.

జియోఫోన్ లాంగ్ టర్మ్ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

జియోఫోన్ లాంగ్ టర్మ్ ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ల పూర్తి వివరాలు

జియోఫోన్ యొక్క కొత్త ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లతో వినియోగదారులు మొత్తంగా 504GB డేటా ప్రయోజనం పొందుతారు. ప్రతి నెల రీఛార్జ్ చేయకూడదనుకునే వినియోగదారులకు ఈ కొత్త వార్షిక ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లు నిజంగా ఉపయోగపడతాయి. ఈ మూడు కొత్త ప్లాన్‌లు అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్‌ ప్రయోజనాలను అందిస్తున్నాయి. కాని కంపెనీ వాయిస్ కాలింగ్‌లో ఇతర నంబర్లకు పరిమితం చేస్తూనే ఉంది. జియోఫోన్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ లాంగ్ టర్మ్ ప్లాన్‌ల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: Apple macOS బిగ్ సుర్‌ను డౌన్‌లోడ్ & ఇన్‌స్టాల్ చేయడం ఎలా?Also Read: Apple macOS బిగ్ సుర్‌ను డౌన్‌లోడ్ & ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

జియోఫోన్ రూ.1,001 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ రూ.1,001 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో ప్రవేశపెట్టిన వార్షిక ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లలో మొదటిది రూ.1,001 ధర వద్ద లభించే ఆల్ ఇన్ వన్ ప్యాక్. ఇది వినియోగదారులకు 49GB 4G డేటాను అందిస్తుంది. ఇందులో రోజువారీ డేటా పరిమితి 150MB గా ఉంటుంది. ఈ ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత జియో-జియో వాయిస్ కాలింగ్‌ను మరియు ఇతర నెటవర్క్ లకు 12000 నిమిషాల ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్‌ క్యాప్ ను 336 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేసే జియోఫోన్ వినియోగదారులు రోజుకు 100SMS ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

జియోఫోన్ రూ.1,301 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ రూ.1,301 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ వినియోగదారుల కోసం అందిస్తున్న తదుపరి రూ.1,301 ఆల్ ఇన్ వన్ జియోఫోన్ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో రోజుకు 500MBతో 336 రోజులు మొత్తం వాలిడిటీ కాలానికి 164GB 4G డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. జియోఫోన్ వినియోగదారులకు చాలా కాలం నుంచి అందిస్తున్న రూ.125 ఆల్ ఇన్ వన్ ప్లాన్‌ను ఒక కస్టమర్ నెలకు రూ.125 ధరతో 12 నెలలకు రీఛార్జ్ చేస్తే ఖర్చు రూ.1,500 అవుతుంది. కొత్తగా ప్రారంభించిన ప్లాన్‌తో పోలిస్తే రూ.199 తక్కువ ఖర్చు అవుతుంది. ఈ ప్లాన్ రోజుకు 100SMS‌లు, అపరిమిత జియో టు జియో వాయిస్ కాల్స్ మరియు 12000 నాన్-జియో నిమిషాల ప్రయోజనాలను అందిస్తుంది.

జియోఫోన్ రూ.1,501 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ రూ.1,501 ఆల్ ఇన్ వన్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫోన్ వినియోగదారుల కోసం అందిస్తున్న ఆల్ ఇన్ వన్ ప్లాన్‌లలో చివరిది రూ.1,501 జియోఫోన్ ఆల్ ఇన్ వన్ ప్లాన్. ఇది రోజుకు 1.5GB 4G డేటా ప్రయోజనంతో 336 రోజుల మొత్తం చెల్లుబాటు సమయానికి 504GB డేటాను అందిస్తుంది. ఇది జియో టు జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు 12,000 నాన్-జియో FUP నిమిషాలు వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Reliance Jio Introduced JioPhone Annual All-in-One Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X