Home
News

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు!! వివరాలు ఇవిగో

ఇండియాలోని టెలికాం రంగంలో అనేక మార్పులను తీసుకొనివచ్చిన రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా మరొక కొన్ని ప్లాన్‌లను విడుదల చేయనున్నది. రేపు అంటే సెప్టెంబర్ 1, 2021 నుండి వినియోగదారుల కోసం కొత్త డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లను తీసుకురానుంది. ఈ ప్లాన్‌లు కస్టమర్‌లకు డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్ లో ఇంగ్లీష్‌తో సహా పూర్తిస్థాయి అంతర్జాతీయ కంటెంట్‌ని యాక్సెస్ చేయడానికి అనుమతిని ఇస్తాయి.

డిస్నీ+ హాట్‌స్టార్

ఈ కొత్త ప్లాన్‌లు రూ.499, రూ.666, రూ.888, రూ.2,599 మరియు రూ.549 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లలో రూ.549 ‘డేటా వోచర్' ప్లాన్ మినహా మిగిలినవన్నీ కూడా అపరిమిత వాయిస్ కాలింగ్, SMS మరియు డేటా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్‌లతో వినియోగదారులకు అందించే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ 1 సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు అంతర్జాతీయ కంటెంట్‌ను ఇంగ్లీష్‌లో కూడా యాక్సెస్ చేయవచ్చు. ఇప్పటి వరకు కంపెనీ తన ప్లాన్‌లను డిస్నీ+ హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో అందిస్తోంది. అయితే ఇది ఇంగ్లీష్ లో కంటెంట్‌కి యాక్సిస్ ను అందించలేదు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

డిస్నీ+ హాట్‌స్టార్‌తో రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

డిస్నీ+ హాట్‌స్టార్‌తో రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో ఇప్పుడు తన వినియోగదారులకు రూ.499 ధర వద్ద ఒక ప్లాన్ ను అందిస్తుంది. ఇది 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అలాగే రూ.666 ధర వద్ద లభించే ప్లాన్ 2GB రోజువారీ డేటాను 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుండగా రూ.888 మరియు రూ.2599 ధరల వద్ద లభించే ప్లాన్‌లు వినియోగదారులకు 2GB రోజువారీ డేటాను వరుసగా 84 రోజులు మరియు 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తాయి. చివరగా రూ.549 ధర వద్ద లభించే డేటా యాడ్-ఆన్ ప్లాన్ వినియోగదారులకు 56 రోజుల వాలిడిటీ కాలానికి 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ లో వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలు అందుబాటులో లేవు.

అపరిమిత వాయిస్ కాలింగ్

రూ.499, రూ.666, రూ.888 మరియు రూ.2599 ధరల వద్ద లభించే ప్లాన్‌లతో సహా పైన పేర్కొన్న ఇతర ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను అందిస్తాయి. జియో ప్లాన్‌తో ఇప్పటికే డిస్నీ+ హాట్‌స్టార్ విఐపికి సభ్యత్వం పొందిన వినియోగదారుల కోసం వారి సభ్యత్వం గడువు ముగిసే వరకు అదే ప్రయోజనాలను వినియోగిస్తూనే ఉంటారు.

డిస్నీ+ హాట్‌స్టార్

ఈ కొత్త ప్లాన్‌లతో వినియోగదారులు డిస్నీ+ హాట్‌స్టార్ యొక్క పూర్తి కంటెంట్ లైబ్రరీని ఆంగ్లంలో యాక్సెస్ చేయగలగడం వలన ప్లాట్‌ఫారమ్‌కు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ పొందడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డిస్నీ+ హాట్‌స్టార్ లో ఈ మార్పు సెప్టెంబర్ 1, 2021 నుండి అందుబాటులోకి రానున్నది. ఇది భారతదేశంలో నివసిస్తున్న వినియోగదారుల కోసం దాని సభ్యత్వ నిర్మాణాన్ని మారుస్తోంది.

జియో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

జియో ఉత్తమమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లు

రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారులకు అందించే ఉత్తమ విలువ ప్రీపెయిడ్ ప్లాన్‌లు రూ.399, రూ.555, రూ.599 ధరల వద్ద లభిస్తాయి. ఈ ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్, మరియు జియో యొక్క అన్ని యాప్‌లకు కాంప్లిమెంటరీ చందాతో వస్తాయి. రూ.399 మరియు రూ.555 ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 1.5GB FUP డేటాను అందిస్తుండగా రూ.599 ప్లాన్ 2GB డైలీ డేటా ప్రయోజనంతో వస్తుంది. ఇంకా రూ.399 ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో లభించగా రూ.555 మరియు రూ.599 ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాన్‌లు

సాధారణంగా డిస్నీ+ హాట్‌స్టార్ ఇప్పుడు రూ.499, రూ.899 మరియు రూ.1499 ధరల వద్ద మూడు సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో లభిస్తుంది. రూ.499 ధర వద్ద లభించే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటు వాలిడిటీకి HD క్వాలిటీ వీడియో యాక్సెస్‌ను అందిస్తుంది. అయితే ఈ ప్లాన్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే. కాబట్టి మీరు మీ మొబైల్ ఫోన్‌ని మాత్రమే ఉపయోగించి కంటెంట్‌ను వినియోగిస్తే ఇది ఉపయోగకరంగా మరియు పాకెట్ ఫ్రెండ్లీగా కూడా మారుతుంది. రూ.899 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ కింద డిస్నీ+ హాట్‌స్టార్ రెండు స్క్రీన్‌ల యాక్సెస్‌ను HD నాణ్యతతో అందిస్తుంది. ఇది చౌకైన రూ.299 ప్లాన్ లాగా కాకుండా ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను స్మార్ట్‌ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్ లేదా టీవీలో కూడా ఉపయోగించవచ్చు. ఆయతే ఇది కూడా వార్షిక ప్లాన్. చివరిగా అత్యంత ఖరీదైన రూ.1499 సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ 4 స్క్రీన్‌లలో 4K నాణ్యతతో వీడియోను ప్రసారం చేస్తుంది. ఇది మూడింటిలో అత్యంత ప్రీమియం ప్లాన్ మరియు ఒక సంవత్సరం చెల్లుబాటుతో వస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Introduced New Prepaid Plans With Disney+ Hotstar Benefits: These Plans Available From September 1
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X