Reliance Jio రూ.598 క్రికెట్ కొత్త ప్లాన్!!! IPL 2020 కోసం సరైన ఛాయస్....
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం ఇప్పుడు మరొక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. రూ.598 ధర వద్ద లభించే ఈ ప్లాన్ డిస్నీ + హాట్‌స్టార్ VIP సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది. క్రికెట్ అభిమానవులకు అతి పెద్ద పండుగ అయిన IPL 2020 మరొక మూడు రోజులలో ప్రారంభం కానున్నది. IPL మ్యాచ్ లను మిస్ అవ్వకుండా చూడడానికి యూజర్లకు కొత్తగా రోజువారి 2GB డేటా ప్రయోజనంతో ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో IPL క్రికెట్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో టెల్కో డిస్నీ + హాట్‌స్టార్ VIP ఉచిత సబ్స్క్రిప్షన్ తో ప్రస్తుతం నాలుగు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది. ఇవి వాయిస్ కాలింగ్ మరియు డేటా ప్రయోజనాలతో పాటు మరికొన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లు వరుసగా రూ.401, రూ.598, రూ.777 మరియు రూ .2,599 ధరల వద్ద లభిస్తాయి. ఈ టెల్కో అధికంగా డేటా అవసరం ఉన్న వారికి వాయిస్ కాల్ మరియు SMS ప్రయోజనాలు లేకుండా డేటా యాడ్-ఆన్‌లను కూడా అందిస్తోంది.

రిలయన్స్ జియో రూ.598 క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తి వివరాలు
రిలయన్స్ జియో తన యూజర్ల కోసం కొత్తగా ప్రారంభించిన రూ.598 క్రికెట్ ప్రీపెయిడ్ ప్లాన్ 2GB రోజువారీ డేటా ప్రయోజనంతో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMSలను 56 రోజుల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ రూ.399 విలువగల ఒక సంవత్సరం డిస్నీ + హాట్‌స్టార్ VIP సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తుంది. ఐపిఎల్ 2020 యొక్క అన్ని క్రికెట్ మ్యాచ్లను ఎటువంటి ఆటంకం లేకుండా చూడడానికి ఈ కొత్త ప్లాన్ చాలా మంది జియో ప్రీపెయిడ్ వినియోగదారులను ఆకర్షిస్తుంది.

జియో రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ అదనపు ప్రయోజనాలు
రిలయన్స్ జియో కొత్తగా అందిస్తున్న రూ.598 ప్రీపెయిడ్ ప్లాన్ మొత్తం చెల్లుబాటు కాలానికి 112GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. అంతేకాకుండా జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. జియో యొక్క అన్ని రకాల ప్లాన్ల మాదిరిగానే ఇది కూడా జియో సినిమా OTT యాప్ కు యాక్సిస్ అందిస్తుంది. దీని ద్వారా సుమారు 1000కి పైగా సినిమాలను చూడడానికి వీలును కల్పిస్తుంది.

డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లు
రిలయన్స్ జియో తన వినియోగదారులు IPL 2020 క్రికెట్ మ్యాచ్ లను చూడడం కోసం డిస్నీ + హాట్‌స్టార్ VIP ప్రయోజనంతో ఇటీవల కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇందులో రూ.499 ధర వద్ద లభించే ప్లాన్ వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటాతో మొత్తం చెల్లుబాటు కాలానికి 84GB డేటాను అందిస్తుంది. ఈ ప్యాక్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కాని ఇది వాయిస్ లేదా SMS ప్రయోజనాలను అందించదు. డిస్నీ + హాట్‌స్టార్ విఐపి ప్రయోజనంతో పాటు జియో యొక్క అన్ని రకాల యాప్ లకు ఉచిత యాక్సిస్ ను పొందుతారు. కాబట్టి ప్రతి రోజు క్రికెట్ చూసే వారికి ఇది మంచి ప్రీపెయిడ్ ప్లాన్. అలాగే రోజువారి 1.5GB డేటా ప్రయోజనంతో 84రోజుల చెల్లుబాటు కాలంతో లభించే రూ.777 ప్లాన్ కూడా అపరిమిత జియో-టు-జియో వాయిస్ కాలింగ్, 3,000 నాన్-జియో FUP నిమిషాలు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








