Home
News

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జియో కొత్త ప్లాన్! సంవత్సరం వ్యాలిడిటీ తో...

By Maheswara

రిలయన్స్ జియో 2.5GB రోజువారీ డేటా ప్రయోజనాలతో కొత్త ఇండిపెండెన్స్ ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 2,999, ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాలింగ్, SMS ప్రయోజనాలు మరియు జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ తో సహా Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది.

ఈ రూ. 2,999 ఇండిపెండెన్స్ ఆఫర్ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. అదనంగా, వినియోగదారులు, Swiggy లో రూ. 249 కొనుగోలు పై రూ.100 తగ్గింపు పొందుతారు. మరొక్క ప్లాన్ లో Jio ధర రూ. 2,545 తో 336 రోజుల చెల్లుబాటు ను అందిస్తోంది.

Reliance Jio Introduces One Year Validity Recharge Plan As Independence Day Offer Priced At Rs.2999

రిలయన్స్ జియో రూ. 2,999 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
రిలయన్స్ జియో తన అధికారిక వెబ్‌సైట్‌లో పంచుకున్న వివరాల ప్రకారం, ఈ రూ. 2,999 ప్రీపెయిడ్ టారిఫ్ 2.5GB రోజువారీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 365 రోజుల పాటు రోజుకు 100 SMSలతో వస్తుంది. ఈ ఇండిపెండెన్స్ ఆఫర్ ప్రీపెయిడ్ ప్లాన్‌తో కూడిన అపరిమిత 5G డేటాతో పాటు వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ మరియు జియో క్లౌడ్ కి ఉచిత యాక్సెస్‌ను కూడా పొందుతారు.

అదనంగా, అర్హతగల సబ్‌స్క్రైబర్‌లు Swiggy లో రూ.249 కొనుగోళ్లపై రూ.100 తగ్గింపు ను పొందుతారు. ఇంకా, ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు. మరియు యాత్ర ద్వారా బుక్ చేసుకునే విమానాలపై రూ.1,500 వరకు తగ్గింపు. ఇతర బండిల్ ఆఫర్‌లలో Ajioలో ఎంపిక చేసిన ఉత్పత్తులకు రూ. 999 విలువైన ఆర్డర్ లపై రూ.200 తగ్గింపు. మరియు నెట్‌మెడ్స్‌లో రూ.999 విలువైన ఆర్డర్‌లపై 20 శాతం తగ్గింపు వస్తుంది.

రిలయన్స్ జియో రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
Jio నుండి రూ. 2,545 ప్రీపెయిడ్ ప్లాన్ 1.5GB రోజువారీ డేటా పరిమితితో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 336 రోజుల పాటు రోజుకు 100 SMSలతో వస్తుంది. జియో సినిమా , జియో టీవీ మరియు జియో క్లౌడ్ కు ఉచిత యాక్సెస్ వంటి ఇతర ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అర్హత కలిగిన సబ్‌స్క్రైబర్‌లకు అపరిమిత 5G డేటాను కూడా అందిస్తుంది.

ఈ రెండు ప్లాన్‌లు కాకుండా, చౌకైన ప్రీపెయిడ్ ప్లాన్ లో జియో యొక్క ధర రూ. 349, అదే
రూ. 2,999 ప్లాన్ అందించే ప్రయోజనాలను అందిస్తోంది. అయితే, ఇది 30 రోజులు మాత్రమే చెల్లుబాటు వ్యవధితో వస్తుంది. మొత్తంగా, చందాదారులు 75GB హై-స్పీడ్ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ లో ఆఫర్ చేసిన రోజువారీ డేటా పరిమితి ని మించిన తర్వాత, వినియోగదారులు 64 Kbps వేగంతో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలరు.

రిలయన్స్ జియో వినియోగదారులు MyJio యాప్, Jio వెబ్‌సైట్ మరియు PhonePe, Google Pay, Paytm మరియు మరిన్ని రీఛార్జ్ సేవలను అందించే ఇతర ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio Introduces One Year Validity Recharge Plan As Independence Day Offer Priced At Rs.2999
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X