Reliance Jio Rs.2,121 Annual Plan:వార్షిక ప్లాన్‌లలో జియోదే అగ్రస్థానం

|

రిలయన్స్ జియో ఈ ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టిన తన న్యూ ఇయర్ 2020 ఆఫర్‌ను ప్రస్తుతం తొలగించింది. ఈ ఆఫర్‌లో భాగంగా జియో యొక్క రూ .2,199 వార్షిక ప్లాన్ ను కేవలం రూ.2,020 లకే పరిమిత కాలానికి ఇచ్చింది. తాజా అప్ డేట్ లో భాగంగా రిలయన్స్ జియో వార్షిక ప్లాన్ అయిన రూ .2,020 (అసలు ధర రూ .2,199) ను పూర్తిగా తొలగించి కొత్త దీర్ఘకాలిక వార్షిక రీఛార్జిని రూ.2,121 ను ప్రవేశపెట్టింది.

రూ.2,121 రిలయన్స్ జియో యొక్క రీఛార్జ్ ప్లాన్

రిలయన్స్ జియో కొత్తగా ప్రారంభించిన ఈ రీఛార్జ్ ప్లాన్ 1.5 జిబి రోజువారీ డేటా, అపరిమిత జియో టు జియో వాయిస్ కాలింగ్ మరియు జియోయేతర కాల్స్ పై ఎఫ్యుపి పరిమితి వంటి రూ.2,020 రీఛార్జ్ యొక్క అదే ప్రయోజనాలను అందిస్తుంది. అయితే చెల్లుబాటును మాత్రం 29 రోజులపాటు తగ్గించారు. మొత్తంమీద రూ.2,121 రిలయన్స్ జియో యొక్క రీఛార్జ్ ప్లాన్ రీఛార్జ్ చేసిన తేదీ నుండి 336 రోజులపాటు అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది.

 

 

Microsoft Office All-in-One App: ఇప్పుడు మొబైల్ ఫోన్లలోMicrosoft Office All-in-One App: ఇప్పుడు మొబైల్ ఫోన్లలో

వార్షిక ప్రణాళిక

రిలయన్స్ జియో వార్షిక ప్రణాళికను తొలగించడం విచారకరం కాని పెరిగిన ధరతో ఇది చాలా త్వరగా తిరిగి వస్తుందని ఆశించవచ్చు. ప్రస్తుతం ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా అన్ని సర్కిల్‌లలో రూ .2,398 మరియు రూ .2,399 ధరల వద్ద తమ వార్షిక ప్రణాళికలను అందిస్తున్నాయి.

 

 

Foldable స్మార్ట్‌ఫోన్‌లను కొంటున్నారా?? ఇది మంచి సమయం కాదు...Foldable స్మార్ట్‌ఫోన్‌లను కొంటున్నారా?? ఇది మంచి సమయం కాదు...

రిలయన్స్ జియో రూ.2,121 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో రూ.2,121 ప్లాన్ ప్రయోజనాలు

ప్రీపెయిడ్ ప్లాన్ల విషయానికి వస్తే రిలయన్స్ జియో ఎల్లప్పుడూ భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కంటే ముందు ఉంటుంది. ఏదేమైనా రెండు టెల్కోలు ఇప్పటికే అపరిమిత ఆఫ్-నెట్ వాయిస్ కాలింగ్ రూపంలో తమ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అయితే జియో యొక్క అన్ని ప్లాన్ లు ఆఫ్-నెట్ కాల్స్ కోసం FUP పరిమితితో వస్తాయి. ఇదే FUP పరిమితి రూ .2,121 ప్రీపెయిడ్ ప్లాన్‌కు కూడా వర్తిస్తుంది.

 

Tata Sky Binge: ఒక నెల పాటు ఫ్రీ ట్రయల్ సర్వీస్Tata Sky Binge: ఒక నెల పాటు ఫ్రీ ట్రయల్ సర్వీస్

ప్రయోజనాల

కొత్తగా ప్రారంభించిన రూ .2,121 దీర్ఘకాలిక ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అన్‌లిమిటెడ్ జియో టు జియో వాయిస్ కాలింగ్, 12,000నిమిషాల నాన్-జియో కాలింగ్, రోజుకు 1.5 జిబి డేటా మరియు 100 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలు 336 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ చెల్లుబాటు కాలంలో మొత్తం డేటా ప్రయోజనం 504GBగా ఉంది. రోజువారీ డేటా కేటాయింపు తర్వాత జియో యూజర్లు 64 కెబిపిఎస్ వద్ద డేటాను వినియోగించుకోవచ్చు. ఇది వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో మెసేజ్ లను పంపడానికి సరిపోదు.

ఉచిత యాప్ యాక్సిస్

ఉచిత యాప్ యాక్సిస్

ఎప్పటిలాగే ఈ ప్లాన్ JioTV మరియు JioCinema వంటి యాప్ లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. JioTV యాప్ లో రిలయన్స్ జియో ప్రస్తుతం 650 ఛానెల్‌లను తమ ఆఫర్‌లో భాగంగా అందిస్తుంది. అయితే JioCinema యాప్ సన్‌ఎన్‌ఎక్స్ టి మరియు జియో యొక్క సొంత లైబ్రరీ వంటి యాప్ల కంటెంట్‌తో VoD (వీడియో ఆన్ డిమాండ్) సర్వీసును అందిస్తుంది.

 

AP Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పుడు చాలా చౌకAP Fiber బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇప్పుడు చాలా చౌక

జియో రూ.2,020ల హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్

జియో రూ.2,020ల హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్

రిలయన్స్ జియో న్యూ ఇయర్ సందర్బంగా తన వార్షిక ప్రణాళికను రూ.2,020ల ధర వద్ద అందించింది. జియో ఈ ఆఫర్ ను కేవలం పరిమిత కాలానికి మాత్రమే అందించింది.ఇప్పుడు దీనిని తొలగించింది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాలలో భాగంగా ఇది 1.5GB రోజువారీ డేటాను, రోజుకు 100 SMSలను మరియు జియో to జియో అపరిమిత కాలింగ్‌తో పాటు 12,000 నిమిషాల నాన్-జియో FUPను అందించింది.

 

5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌5G నెట్‌వర్క్‌ కోసం క్వాల్కమ్ యొక్క కొత్త X60 మోడెమ్ చిప్‌

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.199 ప్లాన్ ప్రయోజనాలు

రిలయన్స్ జియో యొక్క 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లు రూ.199 నుండి ప్రారంభమవుతాయి. ఈ ప్లాన్ తన 28 రోజుల మొత్తం చెల్లుబాటు కాలంలో మొత్తంగా 42GB డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. దీనితో పాటుగా జియో - టు -జియో అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS లు మరియు నాన్-జియోలకు 1,000నిమిషాల FUP వంటి ప్రయోజనాలను అందిస్తుంది.

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో రూ.399 ప్లాన్ ప్రయోజనాలు

జియో అందిస్తున్న ప్లాన్‌లలో ఎక్కువగా జనాదరణ పొందిన వాటిలో రూ.399 ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్ ముందు వరుసలో ఉంది. ఈ ప్లాన్ అందిస్తూన్న ప్రయోజనాల విషయానికి వస్తే ఇది మొత్తంగా 56 రోజుల చెల్లుబాటు కాలానికి 1.5GB రోజువారీ డేటా, అపరిమిత జియో-టు- జియో వాయిస్ కాలింగ్, నాన్-జియోలకు 2,000నిమిషాలతో పాటుగా రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తాయి. ఈ ప్లాన్ యొక్క మొత్తం 56 రోజుల చెల్లుబాటు కాలంలో 84GB డేటాను వినియోగదారులకు అందించబడుతుంది. ఇంతకుముందు ఇదే ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందించడానికి ఉపయోగించబడింది. కాని ఇప్పుడు దీని యొక్క చెల్లుబాటు కాలం 56 రోజులకు తగ్గించబడింది.

Best Mobiles in India

English summary
Reliance Jio Introduces Rs.2,121 Annual Plan: Here are The Full Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X