రూ.1,999కే జియో 4జీ హాట్‌స్పాట్

రిలయన్స్ తన JioFi 4G Hotspotలను సైలెంట్‌గా మార్కెట్లో లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లతో పాటు డిజిటల్ ఎక్స్‌ప్రెస్ మినీ స్టోర్‌లు వీటిని రూ.1,999 ధర ట్యాగ్‌తో విక్రయిస్తున్నాయి.

Read More : ఆ ఫోన్‌లను సగం ధరకే అమ్మేస్తున్నారు..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

OLED డిస్‌ప్లే

ప్రత్యేకమైన OLED డిస్‌ప్లేను ఈ హాట్ స్పాట్‌లో ఏర్పాటు చేసారు. పవర్ ఆన్/ఆఫ్, నెట్‌వర్క్ Strength, వై-ఫై టవర్ వంటి వివరాలను ఈ డిస్‌ప్లే సూచిస్తుంది.

బ్యాటరీ

2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న ఈ డివైస్ సింగిల్ ఛార్జ్ పై 5 గంటలు పనిచేస్తుంది.

 

ఏకకాలంలో 10 డివైస్‌లకు

JioFi 4G Hotspot ఏకకాలంలో 10 డివైస్‌లకు ఇంటర్నెట్‌ను అందించగలదు.

ఎక్కడికి కావాలంటే ...

అరచేతిలో ఇమిడే ఈ పోర్టబుల్‌ వైఫై హాట్‌స్పాట్‌ డివైజ్‌‌ను ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్లవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లలో

స్మార్ట్‌ఫోన్‌లలో జియో జాయిన్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, ఈ హాట్ స్పాట్‌కు కనెక్ట్ అవటం ద్వారా వాయిస్‌ కాలింగ్‌‌తో పాటు ఎస్‌ఎంఎస్‌లను కూడా పంపుకోవచ్చు.

32జీబి మెమరీ

డేటా డౌన్‌లోడ్‌ ఇంకా స్టోరేజ్‌ కోసం Hotspotలో 32జీబి మెమరీ సామర్థ్యం గల
మైక్రోఎస్డీ‌ కార్డ్‌స్లాట్‌ను నిక్షిప్తం చేసారు.

వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా

జియో వెల్‌కమ్ ఆఫర్‌లో భాగంగా డిసెంబర్ 31, 2016 వరకు JioFi 4G ద్వారా జియో అందించే అన్ని సేవలను ఉచితంగా ఆస్వాదింవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio JioFi 4G Hotspot With Oled Display, 2600mAh Battery Launched at Rs.1,999. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot