ఒక్క దెబ్బకు జియో బుకింగ్స్ ఆపేశారు, మళ్లీ ఎప్పుడంటే..?

Written By:

జియో బుకింగ్స్ కోసం ఎదురుచూసిన కష్టమర్లకు నిరాశే మిగిలేలా ఉంది. 4జీ మార్కెట్లో సంచలనం రేపిన జియో ఫోన్ బుకింగ్స్ 24 నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా దెబ్బకి ఈ జియో బుకింగ్స్ ని నిలిపివేశారు. జియో వెబ్‌సైట్‌లో థాంక్యూ ఇండియా పేరిట ఓ మెసేజ్ ప్రస్తుతం మనకు దర్శనమిస్తోంది. త్వరలోనే మరోసారి బుకింగ్స్‌ను ప్రారంభిస్తామని అందులో మెసేజ్ ఉంచారు. అయితే ఈ రెండు రోజుల్లో ఎన్ని జియో 4జీ ఫీచర్ ఫోన్లను యూజర్లు బుక్ చేసుకున్నారో తెలుసా..?..

గెలాక్సీ ఎస్8 ప్లస్‌పై నమ్మశక్యం గాని తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రారంభమైన కొన్ని గంటల్లోనే

జియో 4జీ ఫోన్ బుకింగ్స్ ప్రారంభమైన కొన్ని గంటల్లోనే 30 లక్షల మంది ఈ ఫోన్‌ను బుక్ చేసుకున్నట్టు తెలిసింది.

అంతకు కొన్ని రెట్లు ఎక్కువ సంఖ్యలోనే

ఇక ఈ రెండు రోజుల్లోనూ అంతకు కొన్ని రెట్లు ఎక్కువ సంఖ్యలోనే జియో ఫోన్లు బుక్ అయినట్టు సమాచారం.

మొత్తం ఎన్ని జియో ఫోన్లు బుక్ అయ్యాయో

కాగా ఇప్పటి వరకు మొత్తం ఎన్ని జియో ఫోన్లు బుక్ అయ్యాయో ఆ సంఖ్యను జియో ఇంకా వెల్లడించలేదు.

1 కోటి మందికి పైగానే

కానీ మొత్తంగా చూసుకుంటే 1 కోటి మందికి పైగానే ఈ ఫోన్‌ను బుక్ చేసుకుని ఉండవచ్చని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

ఆన్‌లైన్ సేల్స్‌లో అత్యధిక సంఖ్యలో

దీంతో ఇప్పటి వరకు ఆన్‌లైన్ సేల్స్‌లో అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ వచ్చిన ఫోన్‌గా జియో 4జీ ఫోన్ రికార్డు సృష్టించడం ఖాయంగా కనిపిస్తున్నది.

జియో వెబ్‌సైట్ హోమ్ పేజీలోనూ

మరో వైపు అటు జియో వెబ్‌సైట్ హోమ్ పేజీలోనూ కొన్ని మిలియన్ల మంది జియో ఫోన్‌ను బుక్ చేసుకున్నారు, వారందరికీ థాంక్స్ అంటూ జియో ఓ మెసేజ్‌ను ఉంచడాన్ని బట్టి చూస్తే ఈ ఫోన్‌కు భారీ స్థాయిలో బుకింగ్స్ జరిగినట్టు తెలుస్తోంది.

రెండు వారాల గడువులోగా

మరి వారందరికీ నిర్దేశించిన రెండు వారాల గడువులోగా ఫోన్లను డెలివరీ చేయాల్సి ఉంటుంది. మరి డెలివరీ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio JioPhone: Pre-bookings suspended, how to check status, and more Read more At Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot