ఇక రిలయన్స్ జియో కేబుల్ ప్రసారాలు..?

రిలయన్స్ జియో త్వరలోనే డిజిటల్ టీవీ ప్రసార సర్వీసులను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం.

|

రెండు నెలల క్రితం టెలికం మార్కెట్లోకి అడుగుపెట్టి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ వంటి ప్రముఖ టెలికం ఆపరేటర్లకు ముచ్చెమటలు పట్టిస్తోన్న రిలయన్స్ జియో త్వరలోనే డిజిటల్ టీవీ ప్రసార సర్వీసులను లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. జియో ఆఫర్ చేయబోతున్న DTH సర్వీసులు అత్యంత చౌక ధరల్లో అందబాటులో ఉంటాయని సమచారం.

Read More : లెనోవో లేటెస్ట్ 4జీ ఫోన్‌లు ఇవే!

అధికారికంగా ప్రకటించలేదు

అధికారికంగా ప్రకటించలేదు

తాము అందించబోతున్న DTH సర్వీసులకు సంబంధించి రిలయన్స్ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను రిలయన్స్ అధికారికంగా ప్రకటించలేదు. విశ్వసనీయ వర్గాల సమచారం ప్రకారం DTH సేవల విభాగంలోకి రిలయన్స్ జియో త్వరలోనే అడుగుపెట్టనున్నట్లు తెలియవచ్చింది.

పోటీ మార్కెట్ తథ్యం..

పోటీ మార్కెట్ తథ్యం..

రిలయన్స్ జియో DTH సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లయితే, మార్కెట్లో ఇప్పటికే DTH సేవలను ఆఫర్ చేస్తున్న ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, టాటా స్కై, వీడియోకాన్ డీ2హెచ్ వంటి ఆపరేటర్లు తీవ్రమైన పోటీ మార్కెట్‌ను ఎదుర్కోవల్సి ఉంటుంది.

రూ.185కే DTH సేవలు..?
 

రూ.185కే DTH సేవలు..?

మార్కెట్లో రూ.275 నుంచి రూ.300 మధ్య అందుబాటులో ఉన్న DTH ప్లాన్ లను రిలయన్స్ జియో కేవలం రూ.185కే అందించే అవకాశముందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిజిటల్ ఇకో సిస్టం

డిజిటల్ ఇకో సిస్టం

రిలయన్స్ జియో తన డిజిటల్ ఇకో సిస్టంకు ఒక విజన్‌ను తీసుకువచ్చే క్రమంలో భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలకు అందుబాటులోకి తీసుకురాబోతున్న పలు విప్లవాత్మక ఆవిష్కరణల వివరాలను ఇప్పుడు చూద్దాం. లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

ఉచిత కాల్స్‌తో పాటు ఉచిత 4జీ డేటా

ఉచిత కాల్స్‌తో పాటు ఉచిత 4జీ డేటా

భారత్‌లో పూర్తిస్థాయి డిజిటల్ ఇకోసిస్టంను నెలకొల్పేందుకు తొలి ప్రయత్నంలో భాగంగా ఉచిత కాల్స్‌తో పాటు ఉచిత 4జీ డేటాను జియో అందించే ప్రయత్నం చేస్తోంది.

స్మార్ట్  సొల్యూషన్స్

స్మార్ట్ సొల్యూషన్స్

ఓ సాధారణ కారును స్మార్ట్ కారులా మార్చేసే సొల్యూషన్స్ తన డిజిటల్ ఇకో సిస్టంలో భాగంగా రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.

ఆన్ ద బోర్డ్ ఇంటర్నెట్..

ఆన్ ద బోర్డ్ ఇంటర్నెట్..

రానున్న నెలల్లో రిలయన్స్ జియో ఆన్ ద బోర్డ్ డయగ్నస్టిక్ ఆధారిత డివైస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. హాట్ స్పాట్‌లా వ్యవహిరించే ఈ డివైస్ ఏక కాలంలో 10 డివైస్‌లకు ఇంటర్నెట్‌ను సమకూరుస్తుంది. 
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియో కార్‌కనెక్ట్ మొబైల్ యాప్‌

జియో కార్‌కనెక్ట్ మొబైల్ యాప్‌

ఆన్ ద బోర్డ్ డయగ్నస్టిక్‌తో పాటుగా జియో కార్‌కనెక్ట్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ యాప్ ద్వారా కారు ఓనర్లు కారుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని రియల్ టైమ్‌లో పొందవచ్చు. ఈ యాప్ ద్వారా రిమోట్ లోకేషన్, ట్రాకర్, రిమోట్ లాక్ - అన్‌లాక్, పవర్ విండోస్, హెడ్‌లైట్ ఆన్-ఆఫ్ వంటి ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.

 డిజిటల్ స్మార్ట్‌హోమ్ సొల్యూషన్‌

డిజిటల్ స్మార్ట్‌హోమ్ సొల్యూషన్‌

వీటితో పాటు జియో డిజిటల్ స్మార్ట్‌హోమ్ సొల్యూషన్‌లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. హెల్త్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ విభాగాల్లో కూడా విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చేందుకు జియో సన్నాహాలు చేస్తుంది. 

ఎయిర్‌టెల్ సంచలన ఆఫర్, నెలకు 5జీబి డేటా ఉచితంఎయిర్‌టెల్ సంచలన ఆఫర్, నెలకు 5జీబి డేటా ఉచితం

 

Best Mobiles in India

English summary
Reliance Jio to Launch India's Cheapest DTH Service. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X