ఆఫర్ అంటే ఇది, రూ.500కే 100జీబి డేటా

రిలయన్స్ జియో గురించి ఏ చిన్న న్యూస్ లీక్ అవుతున్నా, అది ఇంటర్నెట్‌లో పెద్ద సెన్సేషన్‌గా మారిపోతుంది. జియో నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న JioFiber బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులకు సంబంధించి ఆసక్తికర న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం..

ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. జియో ఫైబర్ సేవలు సెప్టంబర్ లేదా అక్టోబర్ నాటికి కమర్షియల్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న JioFiber ఫ్రీ ట్రెయిల్ ఆఫర్‌ను మరికొన్ని ప్రాంతాలకు రిలయన్స్ విస్తరించబోతోందట.

ప్రస్తుతానికి 6 నగరాల్లో...

జియో ఫైబర్ ట్రెయిల్ సేవలు ప్రస్తుతానికి ముంబై, డిల్లీ, అహ్మదాబాద్, జామ్‌నగర్, సూరత్, వడోదరా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రెయిల్ ఆఫర్‌ను మరికొన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నట్లు జియో ట్విట్టర్ అకౌంట్ ధృవీకరించింది.

 

త్వరలో హైదరాబాద్, చెన్నై నగరాలకు..

JioFiber ప్రివ్యూ సేవలను త్వరలో హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్‌లోని జియో హోమ్ టౌన్ జామ్ నగర్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆ తరువాత దేశంలో ప్రముఖ పట్టణాలకు, అనంతరం గ్రామాల్లో కూడా జియో ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు.

మొదటి మూడు నెలలు ఉచితం..

జియో తన జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్‌ను పొందవచ్చు. ప్రివ్యూ ఆఫర్ క్రింద 100జీబి ఇంటర్నెట్ డేటా అందుబాటులో ఉంటుంది.

ఇన్‌స్టాలేషన్ ఛార్జీల క్రింత రూ.4,500

ముందుగా ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కింద ఒకసారి రూ. 4500 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం తరువాత వినియోగదారుడు జియో మీద సంతృప్తిగా లేకపోతే అతనికి తిరిగి ఇస్తారు. ఈ ఛార్జిలో మీకు వైఫై రూటర్ కూడా లభిస్తుంది.

జియో స్పీడ్ ఎంతంటే..?

యో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్‌తో 5జీబీ సైజ్ గల హెచ్‌డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది.

100 పాటలను 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు

అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది. తమ బ్రాడ్‌బ్యాండ్ సేవలను మరింత పాపులర్ చేసే క్రమంలో లాంచ్ ఆఫర్ క్రింద రూ.500కే 100జీబి డేటాను ఆఫర్ చేసేందుకు రిలయన్స్ జియ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to launch its broadband services by Diwali, might offer 100GB data at Rs 500. Read Mor in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot