జియో నుంచి కొత్త లాంగ్ టర్మ్ ప్లాన్!! 365 రోజుల వాలిడిటీతో 3GBరోజువారీ డేటా
రిలయన్స్ జియో గత కొన్ని కొన్ని రోజుల నుంచి తన వినియోగదారుల కోసం కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రారంభించింది. ఇప్పుడు కూడా టెల్కో రూ.3,499 ధర వద్ద మరోక కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను వినియోగదారుల కోసం ప్రవేశపెట్టింది. రూ .3,499 ధర వద్ద లభించే ఈ ప్లాన్ వినియోగదారులకు 1 పూర్తి సంవత్సరం అంటే 365 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో రూ.3499 ప్లాన్ వివరాలు
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం రూ.3,499 ప్లాన్‌ను కొత్తగా విడుదల చేసింది. ఈ ప్లాన్ గురించి వివరాలను జియో యొక్క వెబ్‌సైట్ మరియు టెల్కో యొక్క మొబైల్ యాప్ రెండింటిలోనూ చూడవచ్చు. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 365 రోజులమొత్తం చెల్లుబాటు కాలానికి 3GB రోజువారీ డేటాను పొందుతారు. అంటే ప్లాన్ అందించే మొత్తం చెల్లుబాటు కాలానికి 1,095GB మొత్తం డేటాను పొందవచ్చు. రోజువారి FUP డేటా యొక్క పోస్ట్ వినియోగం తరువాత వినియోగదారులు 64 Kbps వేగంతో అపరిమిత డేటాను పొందడానికి యాక్సిస్ లభిస్తుంది.

రిలయన్స్ జియో సంస్థ తన వినియోగదారుల కోసం కొత్తగా అందించే రూ.3499 ప్లాన్ రోజువారి డేటానే కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను కూడా ఈ ప్లాన్‌తో పొందుతారు. అలాగే అదనపు ప్రయోజనాలలో జియోటీవీ, జియోసినిమా, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ మరియు జియోన్యూస్ వంటి వాటికీ ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఇప్పటి వరకు 3GB రోజువారీ డేటాతో జియో అందించే అత్యధిక చెల్లుబాటు ప్లాన్ 84 రోజుల చెల్లుబాటుతో లభించే రూ.999 ప్లాన్ మాత్రమే.

రోజువారీ 2GB కంటే ఎక్కువ డేటాను ఉపయోగించే మరియు ప్రతి నెల రీఛార్జ్ చేయడానికి ఇష్టపడని వినియోగదారులకు ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ ప్లాన్ వినియోగదారుల అవసరాలను స్పష్టంగా తీరుస్తుంది. ఇంకా రిలయన్స్ జియో 1 సంవత్సరానికి 3GB రోజువారీ డేటాను అందించే దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ ఆపరేటర్‌గా అవతరించింది. ఇప్పటి వరకు, జియో, భారతి ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాతో సహా అన్ని ప్రైవేట్ ఆపరేటర్లు 84 రోజుల చెల్లుబాటుతో వినియోగదారులకు 3GB రోజువారీ డేటా ప్లాన్‌లను మాత్రమే అందించారు.

రిలయన్స్ జియో ఈ కొత్త ప్లాన్‌తో డిస్నీ + హాట్స్టార్ విఐపికి ఉచిత చందాను లేదా బోనస్ డేటా వంటి ఇతర ప్రయోజనాలను జోడించే అవకాశాలు ఉన్నాయి. అయితే దీని గురించి ఖచ్చితమైన ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు. రూ.3,499 ప్లాన్ టెల్కో నుండి అపరిమిత డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో అత్యంత ఖరీదైన ప్రీపెయిడ్ ప్లాన్‌గా మారింది.

జియో యొక్క రూ.999 ప్లాన్ 3GB రోజువారీ డేటా బెనిఫిట్స్
3GB రోజువారీ డేటా ప్రయోజనంను ఎక్కువ చెల్లుబాటు కాలానికి కావాలనుకునే వినియోగదారులు జియో అందించే రూ.999 ప్యాక్‌ను ఎంచుకోవచ్చు. ఇది వినియోగదారులకు రోజుకు 3GB డేటాతో మొత్తం చెల్లుబాటు కాలంలో 252GB డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 84 రోజులుగా కలిగి ఉంది. వినియోగదారులకు రోజుకు 100 SMS లతో పాటుగా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. వీటితో పాటుగా అదనంగా Jio యొక్క అన్ని యాప్లకు ఉచిత కాంప్లిమెంటరీ చందాను కూడా పొందుతారు.

3GB రోజువారీ డేటా బెనిఫిట్స్ జియో రూ.401 ప్లాన్
3GB రోజువారీ డేటాను అందించే ప్లాన్‌లలో మూడవది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది జియో యొక్క అన్ని యాప్ లకు ఉచిత యాక్సిస్ తో పాటుగా ఓవర్-ది-టాప్ (OTT) ప్రయోజనంతో అందిస్తుంది. రూ.401 ధర వద్ద లభించే ఈ ప్లాన్ 3GB రోజువారీ డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. మొత్తం వాలిడిటీ కాలంలో 6GB డేటా బోనస్‌ను కలుపుకొని మొత్తంగా 90GB అందిస్తుంది. దీనితో పాటుగా వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ.399 ధర వద్ద 1 సంవత్సర కాలానికి లభించే ‘డిస్నీ + హాట్‌స్టార్ విఐపి' OTT ప్రయోజనాన్ని ఉచితంగా అందిస్తుంది.


Click it and Unblock the Notifications