రూ.19కే రిలయన్స్ జియో

దాదాపు 6 నెలల పాటు నిరాటంకంగా కొనసాగిన రిలయన్స్ జియో ఉచిత సేవలకు మార్చి 31, 2017తో కాలం చెల్లబోతోంది. ఏప్రిల్ 1, 2017 నుంచి జియో సేవలు ఉపయోగించుకోవాలంటే తప్పనిసరిగా జియో ఆఫర్ చేస్తున్న ఏదో ఒక ప్లాన్‌ను సబ్‌స్కైబ్ చేసుకుని ఉండాలి.

మార్కెట్లోకి సామ్‌సంగ్ కొత్త ఫోన్‌లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 కోట్ల మంది చందాదారులు

ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది చందాదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ భవిష్యత్ లో ఈ కౌంట్ ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ను తెరపైకి తెచ్చింది. మార్చి 31, 2017లోపు రూ.99 చెల్లించి జియో సబ్‌స్ర్కిప్షన్‌ను తీసుకోవటం ద్వారా మార్చి 31, 2018 వరకు జియో స్పెషల్ బెనిఫిట్స్ యూజర్ కు లభించే అవకాశం ఉంటుంది.

రూ.303 టారిఫ్ ప్లాన్

జియో ప్రైమ్ మెంబర్‌షిప్ పిరియడ్‌లో భాగంగా జియో డేటా సేవలను పొందేందుకు నెలకు రూ.303 చెల్లించటం ద్వారా 28జీబి డేటా జియో ప్రైమ్ యూజర్‌కు లభిస్తుంది. ఈ 28జీబి డేటాను రోజుకు 28 రోజుల పాటు రోజుకు 1జీబి చొప్పున వాడుకోవచ్చు. జియో ప్రైమ్ సభ్యత్వం అనేది మార్చి 31, 2018 వరకు వర్తిస్తుంది.

రూ.19, రూ.49, రూ.96

రూ.303 టారిఫ్ ప్లాన్ మాత్రమే కాకుండా మరో 8 డేటా ప్లాన్‌లను ప్రైమ్ యూజర్ల కోసం జియో అందుబాటులోకి తీసుకువచ్చింది. మీ బడ్జెట్ అలానే అవసరాన్ని బట్టి వీటిలో ఏ ప్లాన్‌నైనా మీరు ఎంపిక చేసుకోవచ్చు. రూ.303 ప్లాన్ చాలా మంది యూజర్లకు ఖరీదైన విషయంగా మారటంతో ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వారి కోసం రూ.19, రూ.49, రూ.96 ప్లాన్‌లను లాంచ్ చేసింది.

రూ.19 ప్లాన్ ప్రత్యేకతలు

కేవలం ఒక రోజు వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. 200 ఎంబి 4జీ డేటా లభిస్తుంది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోని వారికి ఈ ప్లాన్ లో భాగంగా 100 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. మిగలినవి అన్ని ఉచితమే.

రూ.49 ప్లాన్ ప్రత్యేకతలు

మూడు రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. 600 ఎంబి 4జీ డేటా లభిస్తుంది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోని వారికి ఈ ప్లాన్‌లో భాగంగా 300 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. మిగలినవి అన్ని మామూలే.

రూ.96 ప్లాన్ ప్రత్యేకతలు

ఏడు రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్‌లో భాగంగా జియో వాయిస్ కాల్స్, యాప్స్, ఎస్ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు. 7జీబి 4జీ డేటా లభిస్తుంది. జియో ప్రైమ్ సబ్‌స్ర్కిప్షన్‌ తీసుకోని వారికి ఈ ప్లాన్‌లో భాగంగా 600 ఎంబి 4జీ డేటా మాత్రమే లభిస్తుంది. మిగలినవి అన్ని మామూలే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Launched Its Cheapest Plan Ever!. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot