Home
News

Jio నుంచి 'క్యాలెండర్ మంత్ వాలిడిటీ' కొత్త ప్లాన్!! ముందు ప్లాన్లకు బిన్నంగా...

రిలయన్స్ జియో టెలికాం సంస్థ నేడు ఇండియాలో రూ.259 ధర వద్ద కొత్తగా 'క్యాలెండర్ మంత్ వాలిడిటీ' పేరుతో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను విడుదల చేసింది. ఇది ఖచ్చితంగా ఒక క్యాలెండర్ నెల వ్యవధిలో అపరిమిత డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందజేస్తుందని వాగ్దానం చేయబడింది. రూ.259 ధర వద్ద కొత్తగా ప్రారంభించిన ఈ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రతి నెలా అదే తేదీన పునరుద్ధరించబడే విధంగా రూపొందించబడింది. వినియోగదారులు ప్రతి నెలా కేవలం ఒక రీఛార్జ్ తేదీని గుర్తుంచుకోవడంలో సహాయపడుతుందని టెల్కో తెలిపింది. అంటే ఏప్రిల్ 5న రూ.259 ధర వద్ద లభించే ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కనుక మీ తదుపరి పునరావృత రీఛార్జ్ తేదీలు మే 5, జూన్ 5 న మళ్ళి చేసుకోవచ్చు.

జియో

జియో టెల్కో తన యొక్క కొత్త మరియు ఇప్పటికే ఉన్న వినియోగదారుల కోసం రూ.259 ధర వద్ద తీసుకొచ్చిన కొత్త ప్లాన్ అన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ ఛానెల్‌ల ద్వారా రీఛార్జ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ 1.5GB హై-స్పీడ్ డేటా యాక్సెస్‌ని అందిస్తుంది. అది కేటాయించిన డేటా తర్వాత 64Kbpsకి పడిపోతుంది. ఇది మొత్తం వాలిడిటీ సమయంలో అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 SMS మెసేజ్స్ మరియు జియో యొక్క అన్ని యాప్‌లకు కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

కొత్త ప్లాన్

రూ.259 ధర వద్ద లభించే జియో యొక్క కొత్త ప్లాన్ అందించే అన్ని రకాల బండిల్ ప్రయోజనాలు జియో యొక్క మరొక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.239 పోలిఉన్నప్పటికీ ఇది విభిన్న అనుభవాన్ని అందించడానికి 'క్యాలెండర్ నెల వాలిడిటీ'ని అందిస్తోంది. జియో రూ. 259 ప్లాన్ యొక్క చెల్లుబాటు ప్రతి నెలా ఒకే రీఛార్జ్ తేదీతో వినియోగదారులకు అందించడానికి సర్దుబాటు చేస్తుంది. ఇది స్థిరమైన చెల్లుబాటు వ్యవధితో వచ్చే సాధారణ రీఛార్జ్ ప్లాన్ వలె కాకుండా ప్రతి నెల చక్రంలో ఒకే రీఛార్జ్ తేదీని పొందడానికి వీలుగా ఉంటుంది.

రీఛార్జ్

రూ.259 ధర వద్ద లభించే జియో ప్లాన్ చెల్లుబాటు ఎలా ఉంటుందో ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. ఎవరైనా ముందుగా జనవరి 30 లేదా 31వ తేదీన రీఛార్జ్ చేసుకుంటే జియో ప్లాన్ ఎలా పని చేస్తుంది అన్న విషయంపై ఇంకా పూర్తి వివరణ రావలసి ఉంది. దీని గురించి స్పష్టమైన వివరణ వచ్చినప్పుడు మళ్ళి అప్‌డేట్ చేస్తాము. ఇప్పటికే ఉన్న అన్ని జియో ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే రూ.259 ప్లాన్‌ని ఒకేసారి అనేక సార్లు రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందస్తుగా రీఛార్జ్ చేయబడిన ప్లాన్ క్యూలోకి వెళ్లి ప్రస్తుత యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే తేదీన ఆటోమేటిక్‌గా యాక్టివ్ అవుతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో జియో రూ.555 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

డిస్నీ+ హాట్‌స్టార్ ప్రయోజనంతో జియో రూ.555 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్

రిలయన్స్ జియో ఇప్పుడు రూ.555 ధర వద్ద కొత్తగా ఒక ప్రీపెయిడ్ ప్లాన్ ను ప్రారంభించింది. ఇది మొత్తంగా 55GB డేటాతో వస్తుంది. వాయిస్ కాలింగ్ మరియు SMS ప్రయోజనాలను కూడా బండిల్ చేసే అపరిమిత ప్రయోజనాల ప్రీపెయిడ్ ప్లాన్‌ని కోరుకునే వినియోగదారుల కోసం ఈ ప్లాన్ ఉద్దేశించినది కాదని గుర్తుంచుకోండి. రూ.555 ప్లాన్ వాస్తవానికి డేటా యాడ్-ఆన్ ప్లాన్. ఇది వినియోగదారులకు ఏకమొత్తంలో 55GB డేటాను అందిస్తుంది. పేర్కొన్నట్లుగా ఈ ప్లాన్ వాయిస్ కాలింగ్ లేదా SMS ప్రయోజనాలను అందించదు. ఈ ప్లాన్‌తో అందించే మొత్తం వాలిడిటీ 55 రోజులు. ఓవర్-ది-టాప్ (OTT) సబ్‌స్క్రిప్షన్‌లలో డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ కూడా ఉంది. దీని ధర స్వతంత్ర ప్రాతిపదికన సంవత్సరానికి రూ.499. ఇంకా JioCloud, JioTV, JioSecurity మరియు JioCinemaతో సహా Jio యాప్‌లు ఈ ప్లాన్‌తో వినియోగదారులకు అందించబడతాయి. ఈ ప్లాన్ ధర రూ.200 కంటే ఎక్కువ కనుక. మీరు రూ.200 వరకు 20% JioMart మహా క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందవచ్చు. ఇది ఇళ్ల నుండి పని చేస్తున్న వ్యక్తుల కోసం ఒక సాలిడ్ డేటా యాడ్-ఆన్ ప్లాన్. ఇది స్వతంత్ర వాలిడిటీతో కూడా వస్తుంది కాబట్టి ఎక్కువగా టాక్‌టైమ్ ప్లాన్‌లతో మాత్రమే రీఛార్జ్ చేసుకునే వ్యక్తులకు ఇది గొప్ప ఎంపిక.

Best Mobiles in India

English summary
Reliance Jio Launched New Rs.259 'Calendar Month Validity' Prepaid Plan With Unlimited Calls and 1.5GB Daily Data
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X