జియో మరో అద్భుతం, ప్రపంచపు తొలి ఏఐ ఫీచర్, స్టార్ట్స్‌తో వీడియో కాల్ !
దేశీయ టెలికాం రంగంలో తనదైన ముద్రను వేసుకున్న జియో సరికొత్తగా యూజర్లకు ముందుకు వస్తోంది.
దేశీయ టెలికాం రంగంలో తనదైన ముద్రను వేసుకున్న జియో సరికొత్తగా యూజర్లకు ముందుకు వస్తోంది. ఇప్పటికే టారిప్ లలో దిగ్గజ టెల్కోలకు సవాల్ విసురుతున్న జియో ఏఐ ఆధారిత రంగంలోనూ సత్తా చాటేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ (జియో) ప్రపంచంలోనే మొట్ట మొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత జియో ఇంటరాక్ట్ వేదికను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా నేరుగా సినీ దిగ్గజాలతో మీరు లైవ్ లో మాట్లాడిన అనుభూతిని పొందవచ్చని జియో చెబుతోంది.

లైవ్ వీడియో కాల్ ఫీచర్..
ఇప్పటికే ఈ వేదికలో ఎన్నో సేవలు అందుబాటులోకి రానుండగా.. తొలుత ‘లైవ్ వీడియో కాల్ ఫీచర్'ను రిలయన్స్ జియో ప్రారంభించబోతోంది. ఈ ఫీచర్‌తో భారతీయ సినీ దిగ్గజాలతో నేరుగా మాట్లాడిన అనుభూతిని వినియోగదారులు పొందవచ్చు.

102 నాటౌట్' కామెడీ..
దానిలో భాగంగానే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ త్వరలో ప్రారంభించబోయే ‘102 నాటౌట్' కామెడీ షోని ఈ లైవ్ వీడియో కాల్ ఫీచర్‌తో జియో తన వినియోగదారులకు అందించనుంది. జియో కస్టమర్లు జియో ఇంటరాక్ట్ ఫీచర్‌తో మే 4న బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు.

మై జియో అప్లికేషన్
దీనికి కస్టమర్లు చేయాల్సిందల్లా ‘మై జియో అప్లికేషన్'ను డౌన్‌లోడ్ చేసుకోవడమే. ఆప్ డౌన్‌లోడ్ తర్వాత జియో ఇంటరాక్ట్‌పై క్లిక్ చేసి.. స్టార్ట్ వీడియో కాల్‌పై నొక్కితే చాలు అమితాబ్‌తో వీడియో కాల్ మాట్లాడిన అనుభూతి పొందొచ్చు.

102 నాటౌట్‌పై ప్రశ్నలు..
అమితాబ్ కామెడీ షో 102 నాటౌట్‌పై ప్రశ్నలు కూడా అడగవచ్చు. జియో ఇంటరాక్ట్‌లో మొదటి సర్వీస్‌గా లైవ్ వీడియో కాల్ నిలవనుంది. మొత్తం మీద జియో వినూత్న ఆఫర్లతో తన వినియోగదారులకు తీపి కబురు అందించింది.

జియో ఇంటరాక్ట్ సేవలతో..
ఇప్పటికే 186 మిలియన్ల సబ్‌స్కైబర్లు, 150 మిలియన్ల స్మార్ట్‌ఫోన్ వినియోగ దారులతో భారతీయ టెలికాం రంగంలో జియో విశిష్టమైన స్థానంలో నిలిచింది. తాజాగా ప్రారంభమయ్యే జియో ఇంటరాక్ట్ సేవలతో దేశంలోని మూవీ ప్రమోషన్ సేవల్లో అగ్రగామిగా జియో అవతరించనుంది.

గొప్ప సేవలు అందించడం ..
కొద్ది రోజుల్లోనే వీడియో కాల్ సెంటర్లు, వీడియో కేటలాగ్, వర్చువల్ షో రూమ్‌లు ప్రవేశ పెట్టి తమ సేవలు అందిస్తామని జియో ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, కృత్రిమ మేధతో వినియోగదారులకు ఇంత గొప్ప సేవలు అందించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి.

ధనాధన్ లైవ్
కాగా ఇప్పటికే ఐపీఎల్ అభిమానుల కోసం జియో ధనాధన్ లైవ్ నిర్వహిస్తోంది. Never ‘Run-Out' of Laughter అంటూ ప్రముఖ కమెడియన్ సునీల్ గోవర్, సమీర్ కొచ్చార్ లతో కలిసి క్రికెట్ కామెడీ షోని నిర్వహిస్తోంది.

జియో అలాగే నాన్ జియో కస్టమర్లకు
ఈ షో జియో అలాగే నాన్ జియో కస్టమర్లకు అందుబాటులో ఉంది. వీరితో పాటు Shilpa Shinde, Ali Asgar, Sugandha Mishra, Suresh Menon ఇంకా చాలామంది నవ్వుల్ని పూయిస్తున్నారు.


Click it and Unblock the Notifications








