నో లిమిట్, 365 రోజులకు 1000 జిబి జియో డేటా, కేవలం ఆ రెండు ఫోన్లకే !

Written By:

టెలికాం మార్కెట్లో రోజు రోజుకు టారిప్ వార్ వేడెక్కుతున్న నేపథ్యంలో టెలికాం దిగ్గజాలు స్మార్ట్ ఫోన్ల వైపె తమ దృష్టిని సారిస్తున్నాయి. కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్లతో భాగస్వామ్య ఒప్పందాలను కుదర్చుకుంటూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఇందులో భాగంగానే జియో , ఐడియా, ఎయిర్‌టెల్ మొదలగు టెలికాం దిగ్గజాలు శాంసంగ్, షియోమి లాంటి కంపెనీలతో జతకట్టాయి. ఆ కంపెనీల నుంచి ఇండియాలో కొత్తగా లాంచ్ అయ్యే ఫోన్లకు భారీ క్యాష్ బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ నేపధ్యంలోను జియో ఓ అడుగు ముందుకేసింది. శాంసంగ్ నుంచి 16వ తేదీన విడుదల కాబోతన్న గెలాక్సీ ఎస్9 , గెలాక్సీ ఎస్9 ప్లస్ లకు బంపరాఫర్ ని అందిస్తోంది. 365 రోజులకు 1000జిబి డేటాను అందించేందుకు రెడీ అయింది. ఈ ప్లాన్ పూర్తి వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ. 2 వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్, ఆ యూజర్లకి మరో బంపరాఫర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్9 , గెలాక్సీ ఎస్9 ప్లస్ లను కొనుగోలు చేస్తే ..

జియో కస్టమర్లు ఎవరైనా శాంసంగ్ నుంచి రాబోతున్న గెలాక్సీ ఎస్9 , గెలాక్సీ ఎస్9 ప్లస్ లను కొనుగోలు చేస్తే వారికి 1000 జిబి డేటాను ఏడాది పాటు జియో అందిచనుంది. అయితే కస్టమర్లు దీని కోసం రూ. 4999తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మీకు ఎటువంటి పరిమితులు ఉండవు. ఈ మొత్తాన్ని మీరు సింగిల్ డేలో వాడుకోవచ్చు.

కాల్స్ అపరిమితం

అలాగే కాల్స్ అపరిమితంగా ఉంటాయి. అయితే ఈ ప్లాన్ కేవలం శాంసంగ్ నుంచి వచ్చే రెండు ఫోన్లను కొనుగోలు చేసే కొనుగోలు దారులకు మాత్రమేనని తెలుస్తోంది. అయితే ఈ ప్లాన్ జియోలో ఇప్పటికే ఉంది. అందులో యూజర్లకు కేవలం 360 రోజుల పాటు 360 జిబి డేటా మాత్రమే లభిస్తుంది. ఈ ప్లాన్ నే ఇప్పుడు ఆ రెండు ఫోన్ల కొనుగోలుదారుల కోసం 1000 జిబి డేటాకు పెంచింది.

మార్చి 16 నుంచి..

కాగా ఈ ఫోన్లు ఇప్పటికే ఫ్రీ బుకింగ్ ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. మార్చి 16 నుంచి వీటిని కంపెనీ కస్టమర్లకు అందించనుంది. Galaxy S9 64GB ధర రూ. 57,900గానూ, 256GB వేరియంట్ ధర రూ. 65,900గాను ఉండే అవకాశం ఉంది. Galaxy S9+ 64GB ధర రూ. 64,900గానూ 256 GB ధర రూ. 72,900గానూ ఉండనుంది. lilac purple, coral blue and midnight black మూడు కలర్లలో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి.

రూ. 6000 వేల వరకు క్యాష్ బ్యాక్

ఎయిర్టెల్ ఈ ఫోన్ల మీద రూ. 2,499తో ఏడాది పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్ అందించనుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌లో నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అలాగే రూ.9900 డౌన్ పేమెంట్ చెల్లిస్తే గెలాక్సీ ఎస్9 ఫోన్‌ను ఎయిర్‌టెల్ కస్టమర్లకు అందిస్తుంది. వారు నెలకు తమకు లభించే పోస్ట్‌పెయిడ్ ప్లాన్, ఈఎంఐతో కలిపి రూ.2499లను 24 నెలల పాటు చెల్లించాలి. ఈ కాలంలో వారికి 2టీబీ మొబైల్ డేటా లభిస్తుంది.
ఇక వొడాఫోన్ కూడా ఏడాది పాటు Netflix streamingను ఉచితంగా అందిచనుంది.

 

 

ఫీచర్లు

గెలాక్సీ ఎస్‌ 9 ఫీచర్లు
5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8 ఓరియో
1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌
4జీబీర్యామ్‌
64జీబీస్టోరేజ్‌
12ఎంపీ కెమెరా
8ఎంపీ సెల్ఫీ కెమెరా
3000 ఎంఏహెచ్‌బ్యాటరీ,

గెలాక్సీ ఎస్‌9 ప్లస్‌ ఫీచర్లు

6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ

 

ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌

రెండు స్మార్ట్‌ఫోన్లలోనూ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, డాల్బీ సరౌండ్‌ స్టీరియో సౌండ్‌ స్పీకర్లు అమర్చింది. ఐ ఫోన్‌ ఎక్స్‌ యానిమోజీల మాదిరిగా మన ఫోటోలతో రకరకాల ఎమోజీలను సృష్టించుకునే అవకాశాన్నికూడా కల్పిస్తోంది.

అగ్‌మెంటెట్‌ రియాలిటీ ఎమోజీ ఫీచర్‌

కెమెరాలను మెరుగు పర్చడంతో పాటు ఎస్‌9 ప్లస్‌లో ద్వంద్వ రియర్‌ కెమెరాలను, అలాగే ఫేస్‌ రికగ్నిషన్‌, ఎఆర్‌ (అగ్‌మెంటెట్‌ రియాలిటీ) ఎమోజీ ఫీచర్‌ను జోడించింది.

పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే ..

పేటీఎం ద్వారా కొనుగోలు చేస్తే రూ.6వేల వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు, కన్‌జ్యూమర్ డ్యూరబుల్ లోన్ ద్వారా కొనుగోలు చేసినా రూ.6వేల క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే పాత స్మార్ట్‌ఫోన్లను ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.22,500 వరకు డిస్కౌంట్‌ను ఇస్తారు. మరో రూ.6వేల వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను ఇవ్వనున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Launches Its Best Ever Plan! Tap To Know More news at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot