జియో కొత్త సర్వీస్.. 90రోజుల పాటు ఫ్రీ!

|

టెలికా రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువైన జియో... తన వినియోగదారుల కోసం సరికొత్త సేవలను తీసుకురాబోతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సేవలను ప్రారంభించింది. దశల వారీగా ఈ సేవలు దేశ వ్యాప్తంగా అమల్లోకి రాబోతున్నాయి. అవే జియోలింక్‌ సర్వీసులు. ప్రస్తుతం టెస్టింగ్‌ దశలో ఉన్న జియోలింక్‌ సర్వీసులపై బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది.మాల్స్, హోటళ్లు, కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాల్లో జియో లింక్ 'ఇండోర్ వైఫై హాట్ స్పాట్'గా ఉపయోగపడుతుంది.

 

Airtel భారీ తగ్గింపు ఆఫర్లు, 6నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై..Airtel భారీ తగ్గింపు ఆఫర్లు, 6నెలలు, ఏడాది బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లపై..

హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌

హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌

జియోలింక్‌ అనేది డివైజ్‌ హాస్పాట్‌ డివైజ్‌ కంటే ఎక్కువ. వైర్డ్‌ కనెక్షన్‌లో ఎలాంటి పరిమితులు లేకుండా.. హై-స్పీడ్‌ ఇంటర్నెట్‌ యాక్సస్‌ను అందించడమే జియోలింక్‌ డివైజ్‌ ఉద్దేశం.

రూ. 2,500తో సెట్ టాప్ బాక్సు..

రూ. 2,500తో సెట్ టాప్ బాక్సు..

ఈ ప్లాన్ లో భాగంగా రూ. 2,500తో సెట్ టాప్ బాక్సును పోలి ఉండే ఒక చిన్న పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాటిలైట్ డిష్ లాంటి ఒక చిన్న పరికరాన్ని భవనం పైభాగంలో అమర్చి, కేబుల్ ద్వారా భవనంలోని రూటర్ కు కలుపుతారు. దీని ద్వారా హైస్పీడ్ వైఫై సేవలు అందుబాలోకి వస్తాయి.

మూడు కొత్త ప్లాన్లు
 

మూడు కొత్త ప్లాన్లు

కాగా కంపెనీ తన జియోలింక్‌ సబ్‌స్క్రైబర్ల కోసం మూడు కొత్త ప్లాన్లను లాంచ్‌ చేస్తున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. అవే 699 రూపాయలు, 2099 రూపాయలు. 4199 రూపాయల ప్యాకేజీలు.

 699 రూపాయల ప్లాన్

699 రూపాయల ప్లాన్

తొలి ప్లాన్ కింద 699 రూపాయలపై 5జీబీ 4జీ డేటాను కంపెనీ అందిస్తోంది. ఈ ప్లాన్‌వాలిడిటీ 28 రోజులు. కేవలం 5 జీబీ డేటా మాత్రమే కాకుండా 16 జీబీ అదనపు డేటాను జియో ఆఫర్‌ చేస్తోంది.మొత్తంగా నెలకు 156 జీబీ డేటాను యూజర్లు పొందుతారు.

 2099 రూపాయల  ప్లాన్‌

2099 రూపాయల ప్లాన్‌

రెండో ప్లాన్‌ కింద పైన పేర్కొన్న ప్రయోజనాలే 98 రోజుల పాటు అందనున్నాయి. రోజుకు 5 జీబీ డేటా, ఈ ప్లాన్‌పై అదనంగా 48 జీబీ డేటాను 4జీ స్పీడులో యూజర్లకు జియో ఆఫర్‌ చేయనుంది. దీంతో మొత్తంగా 98 రోజుల పాటు 538 జీబీ డేటాతో యూజర్లు పండుగ చేసుకోవచ్చు.

4,199 రూపాయల ప్లాన్‌

4,199 రూపాయల ప్లాన్‌

మూడో ప్లాన్ 4,199 రూపాయలది. ఈ ప్లాన్‌ 196 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 5 జీబీ డేటాను, అదనంగా 96 జీబీ డేటాను యూజర్లు పొందవచ్చు. అంటే మొత్తంగా యూజర్లు 1076 జీబీ డేటాను పొందనున్నారు.

మూడు ప్యాక్‌లపై

మూడు ప్యాక్‌లపై

ఈ మూడు ప్యాక్‌లపై జియో యాప్స్‌ కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. మంచి నెట్‌వర్క్‌ ఉండి కూడా సమస్యలు ఎదుర్కొనే వారికి జియోలింక్‌ సర్వీసులు ఎంతో ఉపయోగకరం.

టెస్టింగ్‌ దశలో..

టెస్టింగ్‌ దశలో..

ప్రస్తుతం జియో లింక్‌ సర్వీసులు కమర్షియల్‌గా ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవి టెస్టింగ్‌ దశలో ఉన్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ సర్వీసులను కూడా రిలయన్స్‌ జియో కమర్షియల్‌గా లాంచ్‌ చేయబోతుంది.

రోజుకు 5జీబీ డేటా

రోజుకు 5జీబీ డేటా

ఈ ప్యాకేజీలన్నింటిపై రోజుకు 5జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు రిలయన్స్‌ జియో తెలిపింది. ఈ ప్యాక్‌లపై ఎలాంటి కాలింగ్‌ ప్రయోజనాలు ఉండవు. ఫేస్ బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Reliance Jio launches new JioLink plans which offer 5GB data per day More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X